Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: లాయర్ డీల్ రివీల్! కొంపముంచిన కామాక్షి.. దినేష్‌ని ఇరికించిన గుణ..

 Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: లాయర్ డీల్ రివీల్! కొంపముంచిన కామాక్షి.. దినేష్‌ని ఇరికించిన గుణ..

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: లాయర్ డీల్ రివీల్! కొంపముంచిన కామాక్షి.. దినేష్‌ని ఇరికించిన గుణ..

Gunde Ninda Gudi Gantalu 2026 April 13 Episode: బాలు.. మీనా కోసం వెతకడం.. మీనాను ఒక రాముడి కుడి ముందు ఉన్న పాడుబడిన బంగ్లాలో దినేష్, గుణలు కట్టిపడేయడం తెలిసిందే. అయితే గుణ ఈ కిడ్నాప్ వెనుక ఉన్నట్లుకాకుండా దినేష్‌ని ముందుంచి కథను నడిపించాడు. ఈ క్రమంలోనే మీనాకు దినేష్ దొరికేశాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. (photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu 2026 April 13 Episode(photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu 2026 April 13 Episode:దినేష్ మంకీ క్యాప్ వేసుకుని.. మీనా దగ్గరకు వచ్చి.. ‘నీ పని అయిపోయింది. నీ జీవితం అయిపోయింది’ అన్నట్లుగా వాగుతుంటారు. మీనా ‘నా భర్త వచ్చే వరకేరా నీ ఆటలు’ అని హెచ్చరిస్తూ ఉంటుంది. అప్పుడే దినేష్ తాగిన మత్తులో ఊగుతూ.. ‘నీ భర్తకు నీ అడ్రస్ తెలియడం అసాధ్యం’ అని తేల్చి చెప్పేస్తాడు. దాంతో ఎదురుగా కనిపించే దేవుడ్ని మొక్కుతూ ఉంటుంది. వాటర్ వాటర్ అని మీనా.. అరవడంతో.. దినేష్ వాటర్ తెచ్చి ఇస్తాడు. మీనా వాటర్ తాగినట్లే తాగి..వాడి ముఖం మీద ఊస్తుంది. దాంతో దినేష్.. ఆ కంగారులో మంకీ క్యాప్ తీసేస్తాడు. అది తియ్యగానే మీనా.. వాడ్ని గుర్తుపడుతుంది. (గతంలో రోహిణీ అనుకుని మీనాను కిడ్నాప్ చేసినప్పుడు.. వాడ్ని పోలీసులకు పట్టిస్తారు బాలు మీనాలు.). నువ్వా అంటుంది కోపంగా మీనా. ‘తెలిసిపోయిందా.. నేనే.. మీ మీద పగతో కిడ్నాప్ చేశాను.. ఇంకాసేపట్లో నువ్వు జీవితంలో కుమిలికుమిలి ఏడ్చేలా.. నీ చేతి వేళ్లను ఆ బాలు గాడికి పార్సిల్ చేయిస్తాను’ అంటూ వాగుతాడు. మరోవైపు బాలు.. రాజేష్‌తో కలిసి.. మీనాను వెతుకుతూ వెతుకుతూ.. మీనాను కిడ్నాప్ చేయడం చూసిన ముసలి దంపతుల దగ్గరకు వస్తాడు. వాళ్లు ‘మీనాను తీసుకెళ్లిన జీప్‌పై పాము పడగలు ఉన్న దేవుడి బొమ్మలు ఉన్నాయి’ అని చెబుతారు.

బిర్యానీ కోసం అదే వ్యాన్‌లో హోటల్‌కి..

బిర్యానీ కోసం అదే వ్యాన్‌లో హోటల్‌కి..

బిర్యానీ కోసం అదే వ్యాన్‌లో హోటల్‌కి..
వెంటనే బాలు, రాజేష్‌లు.. క్యాబ్ డ్రైవర్స్ గ్రూప్‌లో.. ‘కిడ్నాప్ గురించి, కిడ్నాప్ చేసిన వ్యాప్ గుర్తులను వివరిస్తూ మెసేజ్ చేసి.. సాయం కోరతారు. ఇక డ్రైవర్స్ అంతా కూడా తాము వెళ్లిన ప్రతి ఏరియాలోనూ ఆ వ్యాన్ కోసం వెతుకుతారు. బాలు, రాజేష్‌లు కూడా వెతుకుతూ వెళ్తుంటారు. ఇక బాలుకి కాస్త దూరం వెళ్లేసరికి మీనా చీర కొంగు ముక్క కనిపిస్తుంది. ఆ పక్కనే గుడి ఉండటంతో మీనా మీనా అని అరుస్తూ చుట్టూ వెతుకుతాడు. అయితే అప్పటికే మీనా మూతికి ప్లాస్టర్ వేయడంతో.. బాలు అరుపులు వినిపించినా పలకలేకపోతుంది. దేవుడికే దన్నం పెట్టుకుంటుంది. ఇక కాసేపటికి దినేష్ ఆ వ్యాన్ డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి బిర్యానీ తెమ్మనడంతో.. ఆ డ్రైవర్ అదే వ్యాన్ తీసుకుని హోటల్‌కి వెళ్తాడు.

మీనా చేతి వేళ్లు బాలుకి పార్సిల్..
మీనా చేతి వేళ్లు బాలుకి పార్సిల్..

మీనా చేతి వేళ్లు బాలుకి పార్సిల్..
అక్కడ బాలు డ్రైవర్ ఫ్రెండ్స్‌లో ఒకడికి.. ఆ కారు.. కారుమీద బొమ్మ కనిపిస్తుంది. వెంటనే అతడు బాలుకి కాల్ చేసి.. ‘బాలు.. నువ్వు చెప్పిన బొమ్మ ఉన్న కారు దొరికింది. నేను ఫాలో అవుతున్నాను.. నీకు లొకేషన్ పంపిస్తాను.. అక్కడికి వచ్చెయ్’ అని చెబుతాడు. దాంతో సరే అని బాలు పరుగుతీస్తాడు. రాజేష్‌కి లొకేషన్ పంపిస్తాడు. ఇక ఒకేసారి ఆ వ్యాన్‌ని ఫాలో అవుతూ కారులన్నీ అక్కడికి చేరుకుంటాయి. అప్పటికే మీనా.. వేలు కట్ చేయడానికి దినేష్ పట్టకర్రతో సిద్ధంగా ఉంటాడు. మీనా చేతిని కట్ చేసేందుకు సిద్ధమైపోతాడు. అయితే కారులన్నీ ఒకేసారి ఆగిన శబ్దంతో పాటు ఇద్దరు రౌడీలు పరుగున వచ్చి.. ‘సార్ వానరసైన్యంలా డ్రైవర్స్ అంతా వచ్చేశారు.. మనం పారిపోవడం మంచిది.. ఆ బాలు కూడా వచ్చాడు’ అంటారు.

అడ్డంగా ఇరుక్కున్న దినేష్.. తప్పించుకున్న గుణ, రోహిణీ..

అడ్డంగా ఇరుక్కున్న దినేష్.. తప్పించుకున్న గుణ, రోహిణీ..
దాంతో దినేష్.. ఛా.. అనుకుంటూ రౌడీలతో పాటు పారిపోతాడు. బాలు, రాజేష్ వాళ్లు లోపలకి వచ్చేసరికి మీనా దగ్గర ఎవ్వరూ ఉండరు. మీనాకు కట్లు విప్పి.. నోటికి ఉన్న ప్లాస్టర్ తియ్యగానే.. ‘ఏమైండీ నన్ను కిడ్నాప్ చేసింది ఆరోజు నన్ను కిడ్నాప్ చేస్తే పోలీసులకు అప్పగించామే వాడేనండీ.. నా వేళ్లు కట్ చేయబోయాడు’ అని చెబుతుంది. దాంతో బాలు.. వాడ్ని పట్టుకుంటాను అని పరుగుతీస్తాడు. కానీ అప్పటికే దినేష్.. గుణతో ఫోన్‌లో.. ‘బాలు డ్రైవర్స్‌తో వచ్చాడు.. నన్ను వెంటనే వచ్చి తీసుకెళ్లు’ అని చెబుతాడు. అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక బాలు.. వెతికినా దినేష్ దొరకడు. కానీ గుణ వెనకుండి నడిపించిన సంగతి.. రోహిణీ కోరిక మేరకే మీనా కిడ్నాప్ అయిన సంగతి బాలు, మీనాలకు తెలియకుండానే దినేష్ అడ్డంగా ఇరుక్కున్నాడు.

నిజం కక్కిన కామాక్షి..

నిజం కక్కిన కామాక్షి..
ఇక మరోవైపు.. మీనా తన మీద పడిన దొంగతనం గురించి బాలుకి చెప్పుకుని బాధపడటంతో.. ‘కామాక్షీ అత్తనే అడిగి తెలుసుకుందాం పదా’ అని బాలు.. మీనాను తీసుకుని డైరెక్ట్‌గా కామాక్షిని నిలదీస్తాడు. ఇక కామాక్షీ.. ‘రేయ్ బాలు.. మీనా మీద నిందలు వేసింది మాత్రం నేను కాదురా.. రెండు లక్షలు పోవడం మాత్రం నిజమే.. మీ అమ్మే మీనా తీసిందని ఫిక్స్ అయ్యి అంత గొడవ చేసింది’ అని చెబుతుంది. దాంతో బాలు.. ‘అయితే పదా అత్త.. రెండు లక్షల గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం’ అంటాడు. ‘అమ్మో నేను రాను.. అసలు ఆ డబ్బే నాది కాదు’ అనేస్తుంది. ‘నీది కాదా.. మరి ఎవరిది?’అని నిలదీస్తాడు బాలు. ‘అదేరా.. శివ మీద కేసు వెనక్కి తీసుకోవడానికి మీ అమ్మకు ఆ లాయర్ ఇచ్చిన డబ్బే అది’ అని అసలు నిజం చెబుతుంది కామాక్షి.

ప్రభావతి పని ఇత్తడే రేపు..

ప్రభావతి పని ఇత్తడే రేపు..
దాంతో మీనా.. ‘అదా సంగతి.. ఆవిడ అంత మంచిగా మారడం ఏంటా అని అప్పుడే అనుమానం వచ్చింది’ అని అంటూనే బాలుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. అయితే కామాక్షి కంగారుపడుతూ.. ‘నేను చెప్పానని చెప్పొద్దురా..’ అని వేడుకుంటుంది. కానీ బాలు, మీనాలు వినరు. ఆగరు. ఇక ప్రభావతి.. పొగరు అణిచేందుకుని బాలు, మీనాలు సిద్ధమవుతారు. అక్కడే రోహిణీ కూడా ఉంటుంది. జరిగేది అంతా చూస్తూ వింటూ ఉంటుంది. ‘అసలు రెండు లక్షలు ఎక్కడివో చెప్పమనండి మావయ్యా’ అంటూ ప్రభావతిని సత్యం ముందే ఇరికిస్తుంది మీనా. ప్రభావతి మౌనంగా ఉండటంతో.. ‘మీరు చెబుతారా.. నేను చెప్పనా?’ అని మీనా అంటుంది. బిత్తరపోతుంది ప్రభావతి. ఈ పంచాయితీ రేపు తేలుతుంది. సత్యంతో సహా మిగిలిన అంతా నిజం తెలుసుకోబోతున్నారు. రూ.2 లక్షలు తీసుకుని శివ కేసు వెనక్కి తీసుకుందన్న నిజం రేపు బయటపడబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *