రాశిఫలాలు 14 ఏప్రిల్ 2026: ఈరోజు సునఫ యోగంతో తులా, మకరం సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు

 రాశిఫలాలు 14 ఏప్రిల్ 2026: ఈరోజు సునఫ యోగంతో తులా, మకరం సహా కొన్ని రాశులకు అదృష్ట సంకేతాలు

horoscope today 14 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సునఫ, గ్రహణ యోగాల ప్రభావంతో తులా, మకరం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr14

horoscope today 14 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు అశ్విని నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తూ, మేషంలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో శుక్రుడితో కలయిక కారణంగా శుక్రాదిత్య యోగం ఏర్పడనుంది. అంతేకాదు చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశించడంతో గ్రహణ యోగం ఏర్పడనుంది. అయితే చంద్రుడిపై గురు గ్రహం ప్రభావం ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. అంతేకాదు చంద్రుడు, రాహువు కలయికతో ప్రతికూల ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుంది. చంద్రుడికి రెండో స్థానంలో కుజుడు, బుధుడు ఉండటం కారణంగా సునఫ యోగం కూడా ఏర్పడనుంది. దీంతో నీచభంగ రాజయోగల ఏర్పడటం వల్ల తులా, మకరం సహా ఈ 5 రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు సూర్యుడి ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు కొన్ని శుభ యోగాల కారణంగా మీ ధైర్యం కూడా పెరుగుతుంది. అంతేకాదు సూర్య, శుక్రుని కలయిక వల్ల మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. సహోద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగులో ఉంటే, వాటిలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు తాము చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకేసారి అనేక పనులు చేయకూడదు. ముందుగా ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. శుక్రుడి ప్రభావంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు కాలానికి అనుగుణంగా రిస్క్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే సీనియర్లు, గురువుల సలహాలు తీసుకోవాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సూర్యుడు ఈ రాశి నుంచి పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈరోజు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. అయితే ఆరోగ్య పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు.మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులకు కొంత నష్టాలొచ్చే అవకాశం ఉంది. మీ పని పట్ల చాలా బాధ్యతగా వ్యవహరించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఈరోజు తన ఉచ్ఛ రాశి అయిన మేషరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి అదృష్ట( తొమ్మిదో స్థానం) ఇంట్లో నివాసం ఉండనున్నాడు. ఈ కారణంగా మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులు కొన్ని పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుది. మీ ఆదాయం పెంచుకునేందుకు తగిన అవకాశాలు లభిస్తాయి. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు మీరు చేసే వ్యాపార ప్రయత్నాల్లో మంచి విజయం సాధించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ఈరోజు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీరే నష్టపోవాల్సి రావొచ్చు. మీరు ఒక నిర్దిష్ట విషయంపై ఒత్తిడికి గురికావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు శత్రువులను ఓడించే అవకాశాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ పనులను ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గురువు అనుగ్రహంతో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. వ్యాపారులు ప్రణాళిక ప్రకారం తమ పనులను పూర్తి చేస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీ కుటుం సభ్యులతో కలిసి విహారయాత్రకు ప్రణాళిక కూడా వేసుకోవచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు, సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. ఈ రాశి నుంచి రెండో స్థానంలో ఉన్న చంద్రుడిపై గురుడి ప్రభావంతో ఉండటంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు ఆధ్యాత్మిక పరమైన విషయాలలో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రాహువు, చంద్రుడితో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి పెద్దల సలహా తీసుకోవాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు. విద్యార్థులు తమ చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగులకు కార్యాలయంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈరోజు రుణాలు తీసుకోవడం మానుకోవాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలోనూ కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. బయటి ఆహారం తీసుకోవడం మానుకోవాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. రుచికరమైన భోజనం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు.గురువు అనుగ్రహంతో ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ పనుల పట్ల శ్రద్ధగా, అంకితభావంతో ఉండాలి. ఈరోజు మీరు దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *