రాశిఫలాలు 01 జూలై 2026: ఈరోజు వేశి యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశుల వారికి అదృష్ట సంకేతాలు
horoscope today 01 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వేశి యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
horoscope today 01 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వ ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు గురు, చంద్రుడి ప్రభావంతో గజకేసరి యోగం ఏర్పడనుంది. బుధ, గురు గ్రహాల కారణంగా వేశి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మిథునం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు తాము చేసే పనులన్నింట్లో అదృష్టం కలిసొస్తుంది. ఈ రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో ప్రవేశించడం కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో గొప్ప విజయం సాధించొచ్చు. మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీ జీతం పెరిగే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలున్నాయి. మీరు కష్టపడి పనిచేస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. పనికి సంబంధించి కొన్ని సాహాసోపేతమైన నిర్ణయాలు తెలుసుకుంటారు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి పొందుతారు. సూర్యుని అనుగ్రహంతో మీకు తల్లిదండ్రుల, స్నేహితుల మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గురు, శుక్ర గ్రహాల ప్రభావంతో మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రావొచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉది. మీరు చేసే పనిలో నాయకత్వం వహించడానికి మంచి అవకాశాలు రావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆకస్మిక ఖర్చులు తలెత్తొచ్చు. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే పనులన్నింట్లో విజయం సాధించాలంటే మరింత కష్టపడాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ దగ్గరి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. బుధుడు తిరోగమనం కారణంగా ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా గడుపుతారు. తొందరపాటుతో పెట్టుబడులు పెట్టడం లేదా ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. ఈరోజు సరైన ప్రణాళిక మిమ్మల్ని భవిష్యత్తు ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉది. మీ మనోధైర్యం కూడా పెరగొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. కుటుంబం లేదా ఆస్తి సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఖర్చులను నివారించాలి. మీరు చేసే పని పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహకారాన్ని పొందుతారు. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు చట్టపరమైన లేదా పన్ను పత్రాలను చాలా జాగ్రత్తగా తనిఖీ చేయాలి. తొందరపాటుతో రుణాలు ఇవ్వడం లేదా ఎలాంటి ఆర్థిక పరమైన రిస్కులు తీసుకోవడం మానుకోవాలి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. బుధ గ్రహ తిరోగమనం కారణంగా మీరు చేసే పనుల షెడ్యూల్ లో ఆకస్మిక మార్పులు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరంతరం చేసే పనులలో మంచి విజయం సాధించే అవకాశాలున్నాయి. పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీకు గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు అన్ని పనులను చాలా బాధ్యతతో నిర్వహిస్తారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.