రాశిఫలాలు 04 అక్టోబర్ 2026: పరిఘ యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు సూర్యదేవుని అనుగ్రహం!
రాశిఫలాలు 04 అక్టోబర్ 2026: పరిఘ యోగం ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు సూర్యదేవుని అనుగ్రహం!
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు ప్రస్తుతం నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. చంద్రుడి ప్రభావంతో మీకు విలాసాల పట్ల కోరిక పెరగొచ్చు. మీరు మతపరమైన మరియు సామాజిక కార్యక్రమాలపై చూపే అవకాశం ఉంది.
వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి నుంచి ఈరోజు చంద్రుడు మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో జూనియర్లు, సీనియర్ల నుంచి ఆశించిన సహకారం లభించకపోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరోవైపు మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సూర్య దేవుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.
మిథున రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.
మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. మీ కుటుంబంలో మనస్పర్దలు ఉండొచ్చు. కాబట్టి ఈ సమయంలో ఓర్పుగా ఉండాలి. ఎందుకంటే తొందరపాటు చర్యలు మీకు ఇబ్బందులు కలిగించొచ్చు.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే అనేక కార్యకలాపాలలో సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీకు ఆధ్యాత్మిక రంగాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మీ భౌతిక సూఖలుప పెరిగే అవకాశం ఉంది.
కొత్త విషయాలు కనుగొనడంలో మంచి విజయం సాధించొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు సూర్య, చంద్రుల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు కొన్ని విలువైన వస్తువుల నుంచి అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీరు సొంత విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. అయితే బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే మంచిది.
మీ మాటతీరుతో ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. మీకు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు సూర్య దేవాలయంలో దానధర్మాలు చేయాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి నుంచి ఈరోజు చంద్రుడు పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరిగే అవకాశం ఉంది.
సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మీ ఇష్టానికి విరుద్ధంగా కొన్ని పనులు చేయాల్సి రావొచ్చు. ఈ కారణంగా మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి నుంచి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.
మరోవైపు మీకు సమాజం నుంచి ఆశించిన మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తారు.
పరిహారం : ఈరోజు సూర్య దేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశికి అధిపతి అయిన కుజుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కారణంగా మీ ఖర్చులు కూడా పెరగొచ్చు.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మరోవైపు ఈరోజు సాయంత్రం మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. రాత్రి పూట ఒక శుభకార్యానికి హాజరయ్యే అవకాశం లభించొచ్చు.
పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరగొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందొచ్చు. సప్తమ స్థానంలో ఉన్న గురుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చు. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక నియంత్రణ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
పరిహారం : ఈరోజు దుర్గా చాలీసా పఠించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు కేతువు, సూర్యుడు, కుజుడు, శుక్ర గ్రహాల ప్రభావంతో మీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీరు ఈరోజు దానధర్మాలు చేసే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు శని మంత్రాలను పఠించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు రాహువు, చంద్రుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త విషయాలపై మీకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభించొచ్చు.
సమజాంలో మీ కీర్తి, గౌరవం పెరగొచ్చు. ఆధ్యాత్మిక రంగాలపై మీకు ఆసక్తి పెరగొచ్చు. పెద్దల ఆశీస్సులతో, మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి నుంచి రాహువు పన్నెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శత్రువుల నుంచి ఆందోళన తగ్గే అవకాశాలున్నాయి. మీకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం తగ్గొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి స్వచ్ఛమైన నీటితో అర్ఘ్యం సమర్పించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.