Gundeninda Gudigantalu Today మే 29 ఎపిసోడ్: కామాక్షి, విద్య నుంచి కూపీ లాగిన మీనా.. రోహిణి ఉక్కిరి బిక్కిరి.. చావు దెబ్బ కొట్టిన బాలు

 Gundeninda Gudigantalu Today మే 29 ఎపిసోడ్: కామాక్షి, విద్య నుంచి కూపీ లాగిన మీనా.. రోహిణి ఉక్కిరి బిక్కిరి.. చావు దెబ్బ కొట్టిన బాలు

Gundeninda Gudigantalu Today మే 29 ఎపిసోడ్: కామాక్షి, విద్య నుంచి కూపీ లాగిన మీనా.. రోహిణి ఉక్కిరి బిక్కిరి.. చావు దెబ్బ కొట్టిన బాలు

Gundeninda Gudigantalu Serial 2026 May 29th Episode Preview గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో శుక్రవారం నాడు అదిరిపోయే సీన్లు పడ్డాయి. రోహిణి మీద అనుమానం వచ్చిన బాలు, మీనాలు డిటెక్టివ్‌లా మారిపోతారు. కామాక్షి, విద్య నుంచి కూపీ లాగే ప్రయత్నం చేస్తుంది మీనా. మరో వైపు మలేషియా ట్రిప్ ప్లాన్ చేశాను అని ఇంట్లో అందరితో పాస్ పోర్ట్ అప్లై చేయిస్తుంటాడు బాలు. దీంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్
రోహిణి, మనోజ్ ఇద్దరూ గుడికి వచ్చారని, సీసీటీవీ పుటేజ్ తీసుకున్నారు అని సుమతి ఫోన్ చేసి మీనాకి చెబుతుంది. సరే మీరు కూడా వెళ్లి అడగండి.. మీకు కూడా ఇస్తాడేమో అని మీనా అంటుంది. ఇక ఆ పుటేజ్ దొరికితే వాడ్ని పట్టుకోవడం ఈజీ అవుతుందేమో అని బాలు, మీనా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. మలేషియాలో జైల్ ఆఫీసర్ తెలుసు అంట.. మీ మామయ్యతో మాట్లాడొచ్చంట.. ఏ హెల్ప్ అయినా చేస్తారంట అని చెబుతాడు బాలు. అవునా అని మనోజ్ అనే లోపు.. అసలు మా నాన్న గురించి నీకు ఎందుకు.. మీ పని మీరు చూసుకుంటే బెటర్ అని రోహిణి అంటుంది. సాయం చేస్తామంటే వద్దని అంటారేంటి అని బాలు, మీనాలు అడుగుతారు. మా మామ గురించి నీకు ఎందుకు రా అని మనోజ్ అంటాడు. రేయ్.. మీ మామ పేరు ఏంటో టక్కున చెప్పురా అని బాలు అంటాడు. దీంతో మనోజ్ తెల్లమొహం వేస్తాడు. నీ మామ పేరు తెలీదు.. అసలు ఎలా ఉంటాడో తెలీదు.. ఇల్లు ఉందో లేదో తెలీదు.. రేయ్.. నాకు డౌట్ వచ్చిందంటే.. విల్లా విషయంలో ఎలా బోల్తా పడ్డావో.. నీ భార్య విషయంలో కూడా అదే అవుతుంది.. జాగ్రత్త అని మనోజ్‌ని బాలు హెచ్చరిస్తాడు.

అనుమానించిన బాలు..
అనుమానించిన బాలు..

అనుమానించిన బాలు..
అమ్మో బాలు అన్నంత పని చేస్తాడు అని రోహిణి లోలోప అనుకుంటుంది. అయినా భార్యాభర్తలు కలిసి ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారా? ఏం కనుక్కుంటారో కనుక్కోండి అని మనోజ్‌ని లోపలకు తీసుకు వెళ్తుంది రోహిణి. ఇక బాలు, మీనాకు మరింత అనుమానం వస్తుంది. ఏదో సీక్రెట్ బయట పడుతుందని రోహిణి భయపడుతోంది అని బాలు అంటాడు. ఈ కథ అంతా తవ్వి తీయాల్సిందే.. మనం డిటెక్టివ్స్ అవ్వాల్సిందే.. అసలు రోహిణిని అత్తయ్యకు అంట కట్టింది ఎవరు? అని మీనా అంటుంది. ఇంకెవరు కామాక్షి అత్తే అని అంటాడు బాలు. అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని మీనా అంటుంది.

హల్వా తీసుకెళ్లి..
హల్వా తీసుకెళ్లి..

హల్వా తీసుకెళ్లి..
కామాక్షికి హల్వా తీసుకు వచ్చి కూపీ లాగాని చూస్తారు బాలు, మీనా. మా ఫ్రెండ్‌కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం.. విదేశాల్లో ఉండే తెలుగు అమ్మాయి.. కావాలి.. మన రోహిణిలా అని ఏదో స్టార్ట్ చేస్తాడు బాలు. కానీ కామాక్షికి కూడా ఏమీ తెలీదని, ఆమెని కూడా రోహిణి మోసం చేసి ఉంటుందని బాలు, మీనాలు కనిపెడతారు. విద్యని అడిగితే ఏమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది.. ఇది వరకు కూడా అడిగాను.. మళ్లీ అవే ప్రశ్నలు వేస్తాను అని మీనా అంటుంది. అడిగి చూడు.. ఏమైనా బయట పడే అవకాశం ఉంటుంది అని బాలు అంటాడు.

దగ్గరైన విద్య, మురళీ

దగ్గరైన విద్య, మురళీ
మళ్లీ మురళీ, విద్య కలుసుకుంటారు. జరిగిందంతా గుర్తు చేసుకుంటారు. కాఫీ తాగుదామని విద్య అడుగుతుంది. అలా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ఎక్కువ జరుగుతుంది. పెళ్లి అయిందా? అని ఇద్దరూ ఒకరినొకరు అడిగి తెలుసుకుంటారు. అలా మురళీ, విద్య కాస్త క్లోజ్ అవుతారు. మీరు జోకులు చాలా వేస్తున్నారు అని విద్య అంటే.. మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు అని మురళీ అంటాడు. అలా ఆ మాటలకు విద్య కాస్త సిగ్గు పడుతుంది. ఆఫీస్‌కి లేట్ అవుతుందని విద్యకి చెప్పి మురళీ వెళ్లిపోతాడు. మళ్లీ ఎప్పుడు కలుద్దామని విద్య అంటే.. హెల్మెట్ పెట్టుకుంటున్నా కదా.. మళ్లీ కలుస్తాం అని మురళీ అంటాడు.

విద్య ఇంటికి మీనా..

విద్య ఇంటికి మీనా..
విద్య ఇంటికి మీనా వస్తుంది. ఈ పక్కనే డెలివరీ ఇచ్చా.. అందుకే ఇక్కడకు వచ్చా అని మీనా అంటుంది. మీ ప్రేమ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా.. నేను కూడా ప్రేమలో పడాలని అనుకుంటున్నా అని విద్య అంటుంది. మీ రోహిణి, మనోజ్‌లా ఉంటే చాలు కదా.. అని మీనా అంటే.. ఆ ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా కాదు.. ఒకరి మోసం ఇంకొకరికి తెలియకుండా దాచి పెట్టుకునేలా ఉంటారు అని విద్య అంటుంది. అసలు ఎలాంటి వాడ్ని పెళ్లి చేసుకోవాలి అని మీనాని విద్య అడుగుతుంది. నీకు బాగా తెలిసిన రోహిణిని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతున్నావ్ అని మీనా అంటుంది.

కంగారు పడ్డ విద్య..

కంగారు పడ్డ విద్య..
అయినీ నీకు రోహిణి చిన్నప్పటి నుంచి తెలుసా? అని మీనా అంటుంది. లేదు కాలేజ్ నుంచి తెలుసు అని విద్య అంటుంది. అంటే నువ్వు కూడా మలేషియాలో చదివావా? కానీ అప్పుడెప్పుడో వేరే కాలేజ్ పేరు చెప్పావే అని మీనా అంటుంది. దీంతో విద్య తడబడుతుంది. రోహిణి గురించి కూపీ లాగేందుకే మీనా వచ్చినట్టుంది.. ఏం చెబితే ఎక్కడ దొరికిపోతామో అని విద్య అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంత సేపు ఆలోచిస్తున్నావ్ అని మీనా అడుగుతుంది. రోహిణి నాన్న గురించి నీకేం తెలుసు అని అడగడంతో విద్య కంగారు పడుతుంది.

అబద్దాలే చెప్పింది..

అబద్దాలే చెప్పింది..
ఏం అడిగినా చెప్పదు.. కావాలంటే అబద్దాలే చెబుతుందని అర్థమైంది అని మీనా లోలోపల అనుకుంటుంది. రోహిణి వల్ల అబద్దాలు చెప్పలేక.. చెప్పిన అబద్దాలు గుర్తు పెట్టుకోలేక చస్తున్నా అని విద్య అనుకుంటుంది. విద్య మాటలు విన్నాక ఏది నిజమో.. ఏది అబద్దమో అర్థం కావడం లేదు అని మీనా అంటుంది. అబద్దాలు చెప్పడం కాదు.. గుర్తు పెట్టుకోవాలి.. దానికి మెమెరీ కావాలి కదా.. అని బాలు అంటాడు. ఇక మీనా వచ్చిన విషయం, కూపీ లాగిన విషయాన్ని రోహిణికి ఫోన్ చేసి చెబుతుంది విద్య. దీంతో రోహిణి కంగారు పడిపోతుంటుంది.

మలేషియా మామ గురించి చెప్పు..

మలేషియా మామ గురించి చెప్పు..
బాలు, మీనాలు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారట.. ఇదేం బాగా లేదు అని మనోజ్‌తో రోహిణి అంటుంది. వాడికి ఇదే పని అయిపోయినట్టుందని మనోజ్ అంటాడు. ముందు మనం ఆ ముప్పై లక్షలు ఎత్తుకెళ్లినవాడ్ని కనిపెట్టాలని రోహిణి అంటే.. మీ మలేషియా మామ ఎక్కడుంటాడో చెప్పు వెళ్లి డబ్బులు అడుగుతా అని మనోజ్ అంటాడు. లేదు.. మనం ఎవడి దగ్గర పోగొట్టుకున్నామో.. వాడి దగ్గరే రాబట్టుకోవాలని రోహిణి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వాడు దొరికినా డబ్బు ఉంటుందో లేదో.. తెలీదు కదా అని మనోజ్ అంటాడు. అసలు మీ మామ ఎక్కడున్నాడో చెప్పు అని రోహిణిని అడుగుతాడు మనోజ్.

చింతామణితో గొడవ..

చింతామణితో గొడవ..
సరే నేను కనుక్కుని చెబుతా లే అని రోహిణి అంటుంది. ఇంకెన్నాళ్లు ఇలా అబద్దాలు మోయాలని రోహిణి ఏడ్చేస్తుంది. మరో వైపు చింతామణి రౌడీలు మీనా పూల డబ్బాని ఎత్తుకు పోతారు. తనను ఇంటికి పిలిపించుకునేందుకు చింతామణి ప్లాన్ వేస్తుంది. నాకు పోటీగా ఎవ్వరూ రారు.. నువ్వు చిన్న పిల్లవి.. ఇవి వదిలేసేయ్.. అని చింతామణి అంటుంది. నీ మంచికే చెబుతున్నా.. నాతో కలిసి పని చెయ్.. నేను ఎక్కువ డబ్బులు ఇస్తా.. అని చింతామణి బేరం పెడుతుంది. మీరే నా దగ్గర పని చేయండన్నట్టుగా మీనా కౌంటర్ వేస్తుంది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది.

మలేషియా ట్రిప్..

మలేషియా ట్రిప్..
గుడ్ న్యూస్ అంటూ అందరినీ పిలుస్తాడు బాలు. అందరికీ ఓ ఫాం ఇస్తాడు. పాస్ పోర్ట్ కోసం అందరికీ అప్లికేషన్స్ పెడుతున్నామని బాలు చెబుతాడు. నాకు ఉందని శ్రుతి ఉందంటే.. రోహిణికి కూడా ఉండే ఉంటుందని మీనా, శ్రుతి అంటారు. కంగారు పడుతూ అవును అవును అని రోహిణి అంటుంది. మాకు హనీ మూన్ జరగలేదు కదా.. అందర్నీ మలేషియాకి తీసుకు వెళ్తున్నా అని బాలు అంటాడు. దీంతో ప్రభావతి, మనోజ్, రోహిణి షాక్ అవుతారు. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *