రాశిఫలాలు 29 మే 2026: ఈరోజు త్రిగ్రాహ యోగం ప్రభావంతో మిథునం సహా ఏ రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయి?
రాశిఫలాలు 29 మే 2026: ఈరోజు త్రిగ్రాహ యోగం ప్రభావంతో మిథునం సహా ఏ రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయి?
horoscope today 29 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిగ్రాహి యోగం ప్రభావంతో మిథునం సహా ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Daily Horoscope in Tel May29
horoscope today 29 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజ గ్రహం భరణి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. అదే విధంగా చంద్రుడు, బుధుడు, శుక్రుడు కలిసి అరుదైన త్రిగ్రాహ కూటమి ఏర్పరచనున్నారు. దీంతో పాటు భద్ర యోగం, లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనున్నాయి. ఈ రెండు శుభ యోగాలతో పాటు శుక్రవారం కావడంతో శుక్ర గ్రహ ఆధిపత్యం వహించే మిథునం, కన్య రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మిథునంలో బుధుడు ప్రవేశించడంతో మేష రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మా మాటతీరుతో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీ శక్తి, సామర్థ్యం మేరకు నిరుపేదలకు పండ్లు, నీటిని దానం చేయాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశి నుంచి రెండో స్థానంలో శుక్రుడు, బుధుడి గ్రహాల కలయిక వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ముఖ్యమైన ప్రణాళిక ఒకటి విజయవంతంగా కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపొచ్చు. ఈరోజు మీరు తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. మీ ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవ్వొచ్చు.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ మాటతీరులో, ప్రవర్తనలోనూ సంయమనం పాటించాలి. ఈ రాశి నుంచి పన్నెండో స్థానంలో గురు, శుక్ర, బుధ గ్రహాల కలయిక కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అధిపతి అయిన చంద్రుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల లాభదాయకంగా ఉంటుంది. మీకు తల్లి వైపు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగులో ఉన్న కొన్ని ఇంటి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులను కలిసే అవకాశాలు లభిస్తాయి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ స్నేహితులతో వినోదాత్మక సమయాన్ని గడిపే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరగొచ్చు. రాజకీయాల్లో ఉండే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించొచ్చు. మీ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి బుధుడి అనుగ్రహంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి నుంచి దశమ స్థానంలో కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఉద్యోగం చేసే వ్యక్తులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. కార్యాలయంలో మీకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ తండ్రి నుంచి ఆశీస్సులు, మార్గదర్శకత్వం లభించొచ్చు.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిథున రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక కారణంగా శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అంతేకాదు లక్ష్మీనారాయణ యోగం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందే అవకాశం ఉంది. మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు బంధువుల నుంచి అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచరిస్తుండగా, బుధ, గురు, శుక్ర గ్రహాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాయి. అదనంగా ఆరో స్థానంలో కుజుడు సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాల కలయిక కారణంగా అనవసరంగా ఖర్చులు చేయొచ్చు. మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీరు కొంత మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో బుధుడు, గురుడు, శుక్రుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల ప్రభావంతో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీరు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు చేసే పనిలో గందరగోళాన్ని, ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలన్నింట్లో అప్రమత్తత వహించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి పంచమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం ప్రభావంతో ఆర్థిక పరంగా మంచి లాభాలు రావొచ్చు. వ్యాపారులు మంచి పురోగతిని సాధించే అవకాశాలున్నాయి. మతపరమైన కార్యకలాపాలు, ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి పెరగొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. విద్యార్థుల పనితీరు మెరుగుపడుతుంది. విదేశీ వనరుల నుంచి లేదా అంతర్జాతీయ సంబంధాల ద్వారా మీరు అనేక ప్రయోజాలు పొందే అవకాశం ఉంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు బుధుడు, గురుడు, శుక్రుడి కలయిక కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. అదే సమయంలో మీరు విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పాత పరిచయస్తులు లేదా బంధువులను కలిసే అవకాశం ఉంది. మీ పిల్లల విజయాన్ని చూసి సంతోషాన్ని పొందుతారు. ఈరోజు స్వల్ప లేదా సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ బంధువులతో సంబంధాలలో సఖ్యత కొనసాగుతుంది.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.