లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

 లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

లంచం అడిగినందుకు.. నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్

ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్‌లో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా.. టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్.. ఆ చెకింగ్ అధికారిపై దాడికి దిగారు. చెప్పుతో కొడుతూ.. అక్కడ పరిగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

హైలైట్:
ఆర్టీసీ అధికారిని చెప్పుతో కొట్టిన కండక్టర్, ప్రయాణికులు
లంచం అడిగినందుకు తీవ్రంగా ఆగ్రహం
టికెట్ తీసుకోకుండా వ్యక్తి ప్రయాణించడంతో పట్టుకున్న అధికారి

RTC Conductor
నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై చెప్పుతో దాడి చేసిన బస్ కండక్టర్
నడిరోడ్డుపై ఆర్టీసీ అధికారిపై బస్ కండక్టర్, బస్సులోని ప్రయాణికులు చెప్పుతో దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. టికెట్ తీసుకోని ప్రయాణికుడు, కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు తనకు రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ చెకింగ్ అధికారి డిమాండ్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం కాస్తా మాటా మాటా పెరిగి.. దాడికి కారణం అయింది. చెకింగ్ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు, కండక్టర్.. అతడిని ఆర్టీసీ వాహనంలో నుంచి బయటికి లాగి మరీ దాడి చేశారు. చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన వీడియోను స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్‌కు వెళ్తోంది. ఈ క్రమంలోనే రాయికోడ్ బస్టాండ్ వద్ద.. ఆ బస్సును ఆర్టీసీ చెకింగ్ అధికారులు ఆపారు. ఈ నేపథ్యంలోనే బస్సులో ఉన్న ప్రయాణికుల వద్ద టికెట్లు ఉన్నాయా లేవా అనేది తనిఖీ చేశారు. అయితే ఒక వ్యక్తి టికెట్ తీసుకోలేదని చెకింగ్ అధికారి ప్రకాష్ గుర్తించాడు. బస్సులో ప్రయాణిస్తూ టికెట్ తీసుకోకపోవడంతో ఆ ప్రయాణికుడికి జరిమానా విధించడంతోపాటు.. సదరు బస్సు కండక్టర్‌పై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *