Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: తప్పు నాదే క్షమించు.. మీనాకి ప్రేమగా తినిపించిన బాలు.. గొయ్యిలో పడబోతోన్న మనోజ్, రోహిణి
Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 29 ఎపిసోడ్: తప్పు నాదే క్షమించు.. మీనాకి ప్రేమగా తినిపించిన బాలు.. గొయ్యిలో పడబోతోన్న మనోజ్, రోహిణి

ప్రశ్నించిన మీనా..
ప్రశ్నించిన మీనా..
ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎందుకు లిఫ్ట్ చేయలేదు.. కోడలు నీ గురించి ఎదురు చూస్తూ ఉదయం నుంచి ఏమీ తినలేదు.. ఎంత బాధపడుతూ ఉందో నీకు తెలుసా? పైన ఉంది.. పిల్చుకుని రా.. ఇద్దరూ కలిసి తినండి.. వెళ్లు.. అని బాలుని తిట్టి పంపిస్తాడు సత్యం. నేను మీకు వడ్డిస్తాను.. అని ప్రభావతి అంటే.. సత్యం కౌంటర్లు వేస్తాడు. మేడ మీద ఎదురుచూస్తున్న మీనా దగ్గరకు బాలు వెళ్తాడు. బాలుని చూసి మీనా తెగ సంతోషిస్తుంది. వచ్చారా.. ఎన్ని సార్లు ఫోన్ చేయాలి మీకు.. నేను ఎంత కంగారు పడతానో మీకు తెలీదా అని ఇలా మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది.
డబ్బులిచ్చిన బాలు..
అన్ని సార్లు ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తాలి కదా.. ఫోన్ ఎత్తలేనంత బిజీగా ఉన్నారా? ఎందుకు కట్ చేశారు? ఎందుకు ఫోన్ లిప్ట్ చేయలేదు.. ఎందుకు మౌనంగా ఉన్నారు.. సమాధానం చెప్పండి..అని మీనా నిలదీస్తుంది. దీంతో తాను సంపాదించిన డబ్బుల్ని తీసి మీనా చేతిలో పెడతాడు. నేను ఎక్కువ డబ్బులు కావాలని అడిగానా? అని మీనా అంటుంది. అడగలేదు కానీ.. నీ కంటే తక్కువ సంపాదించాను అని అన్నావ్ కదా? అని బాలు అనడంతో మీనా గుండెల్లో పిడుగుపడినంత పనైంది. ఆ మాటకి మీనా బాధపడిపోయింది.
ఏంటండి.. లెక్కలు మాట్లాడుతున్నారు..
ఉదయం అన్న మాటల్ని మీనా గుర్తు చేసుకుంటుంది. నీ కంటే ఎక్కువే సంపాదించాలని ఉదయం నుంచి కష్టపడ్డా.. అందులో నువ్వు సంపాదించిన దాని కంటే ఒక వెయ్యి ఎక్కువే ఉందని బాలు అంటాడు. ఏంటండి.. లెక్కలు మాట్లాడుతున్నారు.. మీరు వేరు.. నేను వేరు అన్నట్టుగా చెబుతున్నారు అని మీనా బాధపడుతుంది. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అన్నట్టుగా నువ్వే కదా మాట్లాడింది అని బాలు అంటాడు. అందుకే కదా నీ సంపాదన కంటే నా సంపాదన తక్కువ అని తక్కువ చేసి మాట్లాడావ్ అని బాలు అంటాడు. ఆ మాటలకు మీనా మరింత బాధపడుతుంది.
మీరు ఇలా మాట్లాడుతున్నారా?
మిమ్మల్ని నేను ఎందుకు తక్కువ చేస్తాను.. ఏదో సరదాకి అలా అంటే.. సీరియస్‌గా తీసుకుంటారా? నా కన్నా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఇంతలా కష్టపడ్డారా? అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అని మీనా అంటుంది. నా భార్య కంటే ఎక్కువ సంపాదిస్తున్నా.. నా భార్య కంటే నేనే గ్రేట్ అని అనిపించుకుంటేనే విలువ ఉంటుందని మీరు అనుకుంటున్నారా.. లేదంటే.. నా ముందు తక్కువ అవుతారని భయపడ్డారు.. మీరు ఇలా మాట్లాడతారని అస్సలు ఊహించలేదు.. ఇష్టమైన వాళ్లు ఎదిగితే.. సంతోషంగా ఉంటుందని చెప్పిన మీరే ఇలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతోన్నాను అని మీనా బాధపడుతుంది.
నేను ఎప్పుడూ మీ వెనకాలే..
నేను పూలు అమ్ముకుంటాను అంటే ప్రోత్సహించింది.. మీరు.. గొప్పగా ఎదగాలని ఉందంటే.. అండగా ఉంది మీరు.. డెకరేషన్ వ్యాపారంలోకి దిగుతాను అంటే ధైర్యం చెప్పింది మీరే.. నా జీవితంలో అన్నింట్లో ముందుండే మీరు.. నేను జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేశాను అని చెప్పడంతోనే ఇలా ఆలోచిస్తారని అస్సలు ఊహించలేదు.. నేను భార్యగా మీ వెనకాలే నడవాలని అనుకుంటాను తప్పా.. మిమ్మల్ని దాటి వెళ్లాలని అనుకోను.. నా కంటే మీరే ఎక్కువ.. ఇప్పుడు సంతోషమా? అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్తుంది మీనా. అనవసరంగా అహనికి పోయి అపార్థం చేసుకున్నానా? అని బాలు అనుకుంటాడు.
కూల్ చేసే ప్రయత్నం..
నా కంటే ఎక్కువ సంపాదించాలని అనుకున్నాడట.. నేను చెప్పానా? ఎందుకు అంత అహానికి పోవాలి.. అని మీనా తనలో తాను అనుకుంటుంది. మాట్లాడుతూ ఉంటే వచ్చావ్.. నా సంపాదన అంతా నీ కోసమే కదా? అని డబ్బులు చేతిలో పెడతాడు బాలు. ఇక మీనాని కూల్ చేసేందుకు బాలు ప్రయత్నిస్తాడు. నేను అలా ఆలోచించకుండా ఉండాల్సింది.. అలా పురుషాధిక్యతను చూపించకుండా ఉండాల్సింది.. తప్పైపోయింది.. క్షమించు మీనా.. ఆలస్యం అవుతుంది.. ఆకలిగా లేదా?.. నేను తీసుకు వస్తాను అని వెళ్లి మీనాకు తీనిపించేందుకు ప్రయత్నిస్తాడు బాలు.
మీనాకి తినిపించిన బాలు..
మీనాకి తినిపించిన బాలు..
మీరు తెచ్చిన డబ్బులు చూసి నా కడుపు నిండింది.. మీరే తినండి అని మీనా అంటుంది. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను అని బాలు చెబుతాడు. అంటే మీ కోసం ఉదయం నుంచి చూసి పస్తులున్న నేనే పిచ్చి దాన్ని అన్నమాట అని మీనా బాధపడుతుంది. ఈ ఒక్క రోజు నేను తినకపోతే ఏమీ చావను.. తీసుకెళ్లి అక్కడే పెట్టేయండని మీనా ఆగ్రహిస్తుంది. తప్పు నాదే.. ఒప్పుకున్నా కదా.. క్షమించమని అడిగా కదా.. మా మంచి పూలగంప కదా.. తిను.. నా మీద కోపంతో కడుపు మాడ్చుకోకు.. అని బాలు అంటాడు. ముద్దకు ఒకసారి క్షమించమని అడగనా అని కామెడీ చేయడంతో మీనా తినేస్తుంది.
బాలుకి తినిపించిన మీనా..
తక్కువ ఫుడ్ ఉందని తినేశా అని అబద్దం చెప్పా.. కూర బాగుంది.. నాకు కూడా కాస్త పెట్టవా? అని బాలు అడుగుతాడు. మీకు పెట్టను పో అని మీనా కామెడీ చేస్తుంది. మీరు వస్తే వడ్డించాలని.. హాట్ బాక్సులో పెట్టాను..అని ఫుడ్ తీసుకు వస్తుంది మీనా. ఇప్పుడు నేను అలిగాను.. తినను పో అని బాలు మారాం చేస్తాడు. మన ఇద్దరిలో ఎవరు అలిగినా బాధ ఇద్దరిదీ అని మీనా అంటుంది. నువ్వు అలిగితే నేనేం చేశానో.. ఇప్పుడు నువ్వు కూడా అదే చెయ్యి అని అంటాడు బాలు. దీంతో బాలుకి మీనా తినిపిస్తుంది.
మనోజ్ స్పెషల్ పూజ..
మనోజ్ స్పెషల్ పూజ..
ఇంట్లోనే ప్రభావతి దిష్టిబొమ్మకి మనోజ్ పూజ చేస్తాడు. కానీ ప్రభావతి చూసే లోపు ఆ దిష్టిబొమ్మని తీసేస్తాడు మనోజ్. అలా మనోజ్‌ని చూసి ప్రభావతి మురిసిపోతుంది. ఇళ్లంతా పొగబెట్టావ్ ఏంట్రా అని సత్యం అడుగుతాడు. ఇదంతా కల కాదు కదా? అని శ్రుతి, రవి కౌంటర్లు వేస్తారు. అద్భుతాలు జరిగేటప్పుడు ఇలానే ఉంటుందని రోహిణి సెటైర్లు వేస్తుంది. ఈ పొగ ఏంటి? ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేయాలేమో అని బాలు కౌంటర్లు వేస్తాడు. మనోజ్‌కి ఏమైనా అయి ఉంటుంది.. అందరికీ ఫోన్ చేయండి అని బాలు కామెడీ చేస్తాడు.
ముప్పై లక్షలు అడ్వాన్స్..
మనోజ్ చేసిన పూజలు, వేసే కుళ్లు జోకులతో ఇంట్లో వారంతా కామెడీ చేస్తారు. మీరంతా ఆపండి.. ఎగతాళి చేయకండని రోహిణి అంటుంది. విల్లా కొనాలని ఫిక్స్ అయ్యామని రోహిణి చెబుతుంది. ఐదు కోట్లది మూడు కోట్లకే ఇస్తున్నారని చెప్పడంతో అందరికీ అనుమానం వస్తుంది. అడ్వాన్స్ ముప్పై లక్షలు ఇస్తే చాలు అని, అందులో ఓనర్‌కి ఐదు లక్షలు ఇవ్వడానికి వెళ్తున్నామని మనోజ్ చెబుతాడు. అత్యాశకి వెళ్లకండని సత్యం అంటాడు. కానీ మనోజ్, రోహిణి వినరు. సరిగ్గా వెళ్లే టైంలో మీనా తుమ్ముతుంది. దాన్ని కూడా పెద్ద రచ్చగా చేస్తుంది ప్రభావతి. మనోజ్, రోహిణిలకు దిష్టి తీస్తుంది. ఆ తరువాత రోహిణి, శ్రుతి, సత్యంలకు కూడా తుమ్ములు వస్తాయి. ఎండు మిరపకాయల డబ్బా తెరిచి పెట్టింది.. అందుకే ఇలా జరుగుతోందని సత్యం చెబుతాడు. అంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.
గుండెనిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్