భార్య ఉండగానే మరో మహిళతో నటరాజ్ మాస్టర్.. కాపురం నిలబెట్టుకున్న భార్య కన్నీటిపర్యంతం

 భార్య ఉండగానే మరో మహిళతో నటరాజ్ మాస్టర్.. కాపురం నిలబెట్టుకున్న భార్య కన్నీటిపర్యంతం

భార్య ఉండగానే మరో మహిళతో నటరాజ్ మాస్టర్.. కాపురం నిలబెట్టుకున్న భార్య కన్నీటిపర్యంతం

Neethu About Her Husband Natraj నీతూ, నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో అదరగొట్టేస్తున్నారు. ఈ ఇద్దరూ ఆ షోలో తమ పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నటరాజ్ వేరే మహిళతో పెట్టుకున్న సంబంధం, తన కాపురంలో వచ్చిన గొడవల గురించి చెబుతూ కన్నీరు పెట్టుకుంది. చివరకు తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకుందో చెప్పి కంటతడి పెట్టేసుకుంది. ఇక నటరాజ్ మాస్టర్ సైతం ప్రేమంటే నమ్మకం అని చెప్పుకొచ్చాడు.

Neethu Natraj
నీతూ నటరాజ్
నీతూ, నటరాజ్ ప్రస్తుతం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. నటరాజ్ గతంలో చేసిన మోసం, వేరే అమ్మాయితో ఉండటం ఇవన్నీ ఈ షోలోనే బయట పెట్టేశారు. అయితే మళ్లీ తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకుందో చెబుతూ నీతూ కన్నీటి పర్యంతమైంది. ఒకప్పుడు నటరాజ్ ఎంతో పొగరుగా ఉండేవాడని, అందరూ తనకు పడిపోతారనే పొగరుతోనే ఉండేవాడని, నేనే ఆయన్ను ప్రేమించానని, నాది వన్ సైడ్ లవ్ అని నీతూ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే నటరాజ్ మాస్టర్ మాత్రం చాలా మందితో మాట్లాడుతూ ఉండేవాడని, గర్ల్ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉండేవారని, ఓ సారి ఓ మహిళతో చూసి ఎంతో బాధపడ్డాను అని నటరాజ్ చేసిన పనుల గురించి నీతూ బహిరంగంగానే షోలు చెప్పారు. నటరాజ్ కూడా ఆ విషయాల్ని ఒప్పుకున్నాడు. ఇదంతా 25 ఏళ్ల క్రితం జరిగిందని కూడా నీతూ, నటరాజ్ చెప్పారు. అయితే తాజాగా నీతూ ఆ ఘటన గురించి చెబుతూ మళ్లీ తన కాపురాన్ని ఎలా నిలబెట్టుకుందో చెప్పి అందరినీ ఎమోషనల్ చేసేసింది.

ఓసారి కంటిన్యూగా ఆయన ఫోన్‌కు మెసెజ్‌లు వస్తున్నాయి.. ఆయన మీద నాకు చాలా నమ్మకం.. మేం మా ఫోన్స్‌ని చెక్ చేసుకోం.. కానీ ఆ రోజు కంటిన్యూగా మెసెజ్‌లు వస్తున్నాయి.. కదా అని రిప్లై ఇవ్వాలని చూశాను.. ఆ రోజు షాక్ అయ్యాను.. ఆ రోజు ఆయన మీద కోపం వచ్చింది.. ఇంటికి రా అని పిలిచాను.. ఎప్పుడూ తల ఎత్తుకుని ఉండే ఆయన.. మొదటి సారి తలకిందకు దించి.. కనిపించాడు.. నా కాళ్లు పట్టుకున్నాడు.. ఇంకోసారి ఇలా చేయను అని అన్నాడు.. నేను ప్రేమించి ఇంట్లో వాళ్లని కాదని ఈయన్ను పెళ్లి చేసుకున్నాను.. నమ్మి వస్తే ఇలా మోసం చేస్తారా? అని బాధపడ్డాను.. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను.. అని అన్నాడు..

ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి.. అన్నింటినీ క్లియర్ చేసుకుని.. ఈ రోజు మా లవ్వుని నిలబెట్టుకున్నాం.. అని నీతూ చెప్పి ఏడ్చేసింది. ప్రేమంటే.. నమ్మకం అని నటరాజ్ ఈ వీడియోలో చెప్పడంతో, నీతూ ఎమోషనల్ అవ్వడం కనిపిస్తోంది. ఈ షోలో నీతూ, నటరాజ్ ఇద్దరూ ఎంతో కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక టైంలో ఈ షో నుంచి బయటకు వస్తామని నీతూ, నటరాజ్ చెప్పారు. కానీ మళ్లీ అక్కడే నిలబడి పోరాడుతున్నారు. చివరి వరకు ఈ జంట ఉంటుందా? టైటిల్ గెలుస్తుందా? లేదా? అన్నది చూద్దాం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *