Podarillu Today ఏప్రిల్ 21 ఎపిసోడ్ : కేశవ చెంపచెల్లుమనిపించిన శైలు.. అనుమానపడ్డ మాధవ్.. చక్రికి పెళ్లి చేస్తానన్న మహా
Podarillu Serial 2026 April 21st Episode Preview మాధవ్ పెళ్లి చేసేందుకు చక్రి, మహా కష్టపడుతున్నారు. వేరు కాపురం కండీషన్ ఒప్పుకున్నట్టుగా మాధవ్ దగ్గర దాస్తున్నారు. కానీ మాధవ్‌కి మాత్రం ఇంకా అనుమానంగానే ఉంది. ఇదంతా ఇలా ఉంటే శైలుని మోసం చేద్దామని రౌడీ మూక చూస్తుంది. పెయిడ్ ప్రమోషన్ అనేది డ్రామా అని కేశవ తెలుసుకుని వారిని చితక బాదేస్తాడు. కానీ శైలు మాత్రం అపార్థం చేసుకుని కేశవనే కొడుతుంది. ఇక కన్నా అయితే పెద్ది పెళ్లి విషయం, వేరు కాపురం అని తల్చుకుంటూ

నాన్నలా అన్నయ్య పెంచాడు.. వదిలి ఉండాలంటేనే కష్టంగా ఉంది.. కానీ అన్నయ్యకి పెళ్లి జరగాలి.. నాకు ఓకే అని కన్నా అంటాడు. ఇక పెళ్లి కూతురు వాళ్లింట్లో చెప్పేద్దామని చక్రి అంటాడు. మరి మన పెద్ది అభిప్రాయం గురించి అడిగితే ఏం చెబుతాదామని కేశవ, మహా అడుగుతారు. అబద్దమే చెప్పాలి.. అని చక్రి అంటే.. అది అయితే నువ్వే చెప్పాలని కేశవ కౌంటర్ వేస్తాడు. దీంతో మహా నవ్వేస్తుంది. ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి తెలివిగా మాట్లాడాలి అని మహా అంటుంది. అయితే మీరే మాట్లాడండి అని కేశవ అంటాడు. అంటే ఏంట్రా నేను తెలివిగా మాట్లాడలేను అనా? చక్రి కౌంటర్ వేస్తాడు. కవిత వాళ్ల తండ్రికి చక్రి ఫోన్ చేసి.. కండీషన్ ఓకే అని, పెళ్లి చూపులకు రమ్మని అంటాడు. పెళ్లి సంబంధం చూశాను అని నారాయణతో మహా అంటుంది. నీకు ఏమైనా బుద్ది ఉందా?.. నాకు ఈ వయసులో పెళ్లి ఏంటి? ఎవరిని అడిగి పెళ్లి సంబంధం చూశారు? అని నారాయణ అంటాడు. పెళ్లి సంబంధం మీకు కాదు.. పెద్దికి చూశాం అని మహా చెబుతుంది. గారెల సంబంధమా? అని అడిగితే.. వేరే కాపురం అని కండీషన్ పెట్టిందని నారాయణ తెలుసుకుని బాధపడతాడు. వాడు లేకుండా ఉండటం కాస్త కష్టమే కానీ వాడికి కూడా పెళ్లి కావాలి కదా? అని నారాయణ అంటాడు.
కేశవని కొట్టిన శైలు..
కేశవని కొట్టిన శైలు..
శైలు కోసం కేశవ రోడ్డు మీద ఎదురుచూస్తుంటాడు. పక్కనే రౌడీ గ్యాంగ్ కూడా ఉంటుంది. వాళ్లే శైలుని ట్రాప్ చేసే గ్యాంగ్ అని కేశవ తెలుసుకుంటాడు. శైలు గురించి తప్పుగా మాట్లాడే సరికి కేశవ వారిని చితకబాదేస్తాడు. శైలు వచ్చే సరికి కేశవ వారితో ఫైట్ చేస్తుంటాడు. ఆ రౌడీ గ్యాంగ్ చెప్పిన మాటల్నే శైలు నమ్ముతుంది. కేశవని లాగి పెట్టి కొడుతుంది శైలు. నీ వల్ల చేతికొచ్చిన బిజినెస్ పోయిందని శైలు ఫైర్ అవుతుంది. నీలో ఏమైనా దురుద్దేశం ఉందా? అని శైలు అడుగుతుంది. నిన్ను కాపాడేందుకు వాళ్లని కొట్టా.. నమ్మితే నమ్ము లేకపోతే.. నీ చావు నువ్వు చావు అని కోపంగా వెళ్లిపోతాడు కేశవ.
కాలర్ పట్టుకున్న కేశవ
ఇంట్లోకి కేశవ డల్‌గా వస్తాడు. ఏంటి.. బుస్సు కాటేసిందా? అని కేశవకి కౌంటర్ వేస్తాడు చక్రి. దీంతో కేశవ పట్టరాని కోపంతో చక్రి కాలర్ పట్టుకుంటాడు. ఏంటి.. ఎందుకు అంత కోపం అని.. కాలర్ ఎందుకు పట్టుకున్నారు.. అని మీ కంటే పెద్ద వాడు ఏదో.. సరదా అన్నాడు అని మహా అంటుంది. ఇక ఇంతలో మాధవ్ వస్తాడు. పెళ్లి సంబంధం గురించి చెప్పేందుకు చక్రి, మహా ప్రయత్నిస్తారు. గారెల సంబంధం, కవిత గురించి చక్రి చెప్పడంతో మాధవ్ షాక్ అవుతాడు. కానీ మాధవ్ మాత్రం పూర్తిగా నమ్మడు.
అనుమానపడ్డ మాధవ్..
వేరు కాపురం గురించి, కవిత అన్న మాటల గురించి మాధవ్ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు వద్దని, ఇప్పుడు కావాలని అంటున్నారు.. అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది.. ఇది పెళ్లి రా.. సగం సగం మాట్లాడుకుని.. మిగతా విషయాలు వదిలేస్తే తరువాత జీవితాంతం బాధపడాలి.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకోవాలి.. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమేమో గానీ పెళ్లి మాత్రం ఇంట్లో వాళ్లకి ఇష్టం ఉండకపోవచ్చు.. కండీషన్స్ పెట్టి ఉంటారేమో.. అవేంటో చెప్పండి అని మాధవ్ అడుగుతాడు. మాకేం కండీషన్స్ పెట్ట లేదు.. మీకు ఏమైనా చెప్పారా? అని మహా కౌంటర్ వేస్తుంది. ఈ పెళ్లి ఫిక్స్ చేశాం, జరుగుతుంది అని చక్రి అంటాడు.
అబద్దం ఎందుకు చెప్పారు..
అమ్మాయికి ఉమ్మడి కుటుంబం ఇష్టం లేదు.. వేరు కాపురం పెట్టాలని చెప్పింది కదా.. ఈ విషయాన్ని పెద్ది దగ్గర ఎందుకు దాచారు? ఎందుకు అబద్దం చెప్పారు అని చక్రిని మహా అడుగుతుంది. నిజం చెబితే అక్కడే అందరినీ తిట్టి పెళ్లి క్యాన్సిల్ అనేవాడు అని చక్రి అంటాడు. నిజాన్ని ఎక్కువ రోజులు దాచలేం.. అబద్దాన్ని ఎక్కువ రోజులు ఆపడం కష్టం అని మీ వల్లే నాకు తెలిసింది అని మహా అంటుంది. ఇవి నాకు మీ వల్లే తెలిశాయి అని మహా చెబుతుంది. పెళ్లి జరిగితే అమ్మాయి మారుతుంది ఏమో.. మాంగళ్య బలం వల్ల ఏమైనా జరగొచ్చు కదా? అని చక్రి అంటాడు. పెద్ది పెళ్లి తరువాత మీకు కూడా సంబంధం చూడమని మీడియేటర్‌కు చెప్పానని మహా అనడంతో చక్రి షాక్ అవుతాడు.
ఆలోచనలో పడ్డ మహా..
వంట గదిలో పెద్ది పరధ్యానంలో ఉంటాడు. ట్యాప్ అలానే లీక్ అవుతూ ఉంటుంది. మీరు ఆలోచనలకు అడ్డు కట్ట వేయడం లేదా? అని పెద్దిని మహా అంటుంది. మీ ఆలోచన ఎక్కడ ఆగింది? అని మహా ప్రశ్నిస్తుంది. అయోమయంలో ఉన్నాను పెద్ది చెబుతాడు. పెద్ది కాస్త గట్టిగా అడిగితే నేను నిజం చెప్పేస్తాను.. అలా చేయకూడదు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు.. కానీ పెద్ది లాంటి వాడికి అబద్దం ఎలా చెప్పాలి అనేది ఎవ్వరూ చెప్పలేదు కదా? అని మహా లోలోపల అనుకుంటూ బాధపడుతుంది. గాయత్రి పెళ్లి కంటే ముందే నా పెళ్లి చేయాలని తమ్ముళ్లు పంతం మీదున్నారని పెద్ది అంటాడు.
కండీషన్ గురించి చెప్పిన పెద్ది..
అమ్మాయి గురించి, ఆ పెళ్లి గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు అని మహా అడుగుతుంది. ఈ విషయం మళ్లీ తమ్ముళ్లకి చెప్పకు.. ఆ అమ్మాయికి ఈ ఇంట్లో నా తమ్ముళ్లతో కలిసి ఉండటం ఇష్టం లేదు.. వేరు కాపురం పెట్టాలని కోరింది.. దానికి నేను ఒప్పుకోలేదు.. అందుకే పెళ్లి వద్దని చెప్పాను. మళ్లీ ఇప్పుడు ఆ వ్యక్తే పెళ్లికి ఓకే అని చెప్పిందంటే డౌట్ రాదా? పెళ్లి అయ్యాక మళ్లీ వేరు కాపురం అని అంటే ఆ పోరు ఎలా భరించాలి? నువ్వు ఉన్నావ్ అని నిర్ణయం మార్చుకుని ఉంటారు.. అని పెద్ది అంటాడు. నువ్వొచ్చిన వేళావిశేషం వల్లే కావొచ్చు అని మహాకి పెద్ది చెబుతాడు. తమ్ముళ్ల కోసం పెళ్లికి ఒప్పుకుంటాను అని మాధవ అంటాడు.
పరధ్యానంలో కన్నా..
అయితే కన్నా కాస్త డల్‌గా ఉండటం చూసి మాధవ్‌కి మళ్లీ అనుమానం వస్తుంది. కన్నాకి ఇష్టమైన బాదాం పాలు తెచ్చినా అయిష్టంగానే తీసుకుంటాడు.. ఎంత పిలిచినా పరధ్యానంలోనే ఉంటాడు.. ఇవన్నీ చూసి పెద్దికి అనుమానం వస్తుంది. వాడు ఎందుకు ఇంత డల్‌గా ఉన్నాడు.. ఏం జరిగింది.. నాకు తెలియాలి అని పెద్ది అంటాడు. ఏం జరగలేదు.. బాగానే ఉన్నాను అని కన్నా ముబావంగా చెబుతాడు. బాగున్నాను అని అలా చెబుతారా? చేతల్లో కూడా చూపించాలి అని కేశవ సీరియస్ అవుతాడు. అంతలో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.