Podarillu Today ఏప్రిల్ 13 ఎపిసోడ్: గాయత్రి పెళ్లి చెడగొట్టబోయిన నారాయణ.. అడ్డంగా నిలబడిన మాధవ.. మహా కన్నీళ్లు

నన్ను క్షమించండి పెద్ది
నన్ను క్షమించండి పెద్ది
లేదు పెద్ది గాయత్రి అలానే చెప్పింది అంటూ మొత్తం జరిగిందంతా మహా చెప్తుంది. ఈ మాటలు విని మాధవ అలా నిల్చొని ఉండిపోతాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇదంతా నా వల్లే పెద్ది.. నేను అసలు మిమ్మల్ని పెళ్లికి ఒప్పించకపోయి ఉంటే మీరు ఇప్పుడు ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు అంటుంది. లేదమ్మా నువ్వు నాకు మంచే చేశావ్.. ఇప్పుడు ఇలా ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్లే కదా గాయత్రి మనసులో నేను లేననే నిజం తెలిసింది అంటూ మాధవ ఓదారుస్తాడు. ఇంతలో పంతులు వచ్చి పెళ్లి జరుగుతుందా లేదా అని అడుగుతాడు. దీంతో లేదు పంతులు గారు పెళ్లి జరగడం లేదని మాధవ చెప్తాడు. నేను ముందే అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని ఇదిగో ఈ తాళిబొట్టు తీసుకోండని మాధవ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు.
మహా ఒకటే ఏడుపు
తర్వాత మహా ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. దీంతో కేశవ-కన్నా ఫోన్ చేసి మాధవ-చక్రిని రమ్మంటారు. ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నారని అడిగితే వదిన గదిలోకి వెళ్లి ఏడుస్తూనే ఉంది. ఎంత పిలిచినా డోర్ మాత్రం తీయడం లేదు అంటారు. దీంతో మాధవ కంగారుగా వెళ్లి డోర్ కొట్టి మహాని బయటికి రమ్మని పిలుస్తాడు. లేదు పెద్ది మీకు నా మొహం చూపించలేను.. నా వల్లే మీరు ఇంత బాధపడాల్సి వస్తుందని మహా ఏడుస్తుంది. ఇక మొత్తానికి బతిమాలేసరికి బయటికి వస్తుంది. కాళ్ల మీద పడబోతే మాధవ ఆపి ఇలా చేస్తే ఎలాగమ్మా నాకు నువ్వు బాధపడుతుంటేనే ఇంకా బాధగా ఉంది అంటాడు. చక్రి.. మహానికి కాసేపు అలా చల్లగాలికి తిప్పు అంటూ మాధవ అంటాడు.
మీ వల్ల నాకు 25 వేలు నష్టం
మహాని పెరట్లోకి తీసుకెళ్లి ఏదో సరదాగా మాట్లాడి మూడ్ ఛేంజ్ చేద్దామని చక్రి అనుకుంటాడు. కానీ అక్కడ కూడా మహా ఏడుస్తూనే ఉంటుంది. దీంతో చక్రి కూడా దొంగ ఏడుపు ఏడుస్తాడు. మీరు ఎందుకు ఏడుస్తున్నారని అడిగితే మీ వల్ల నాకు నష్టం వచ్చింది.. మరి ఏడవకుండా ఏం చేయను అంటాడు. దేనికి నష్టమని అడిగితే పెళ్లి ఏర్పాట్ల కోసం 25 వేలు అప్పు చేశాను.. పెళ్లి జరగలేదు నాకు అప్పు మిగిలింది అంటాడు. మీరేం బాధపడకండి ఆ డబ్బులు నేను ఇస్తానని మహా అంటుంది. అయినా ఈ ఇంటికి ఒక అమ్మాయి కోడలిగా వస్తే నేను వెళ్లిపోవచ్చు కదా అనుకున్నానని అసలు విషయం చెప్తుంది మహా. ఈ మాట విని చక్రి అవాక్కవుతాడు.
అందర్నీ వాయించేసిన మహా
తెల్లారగానే మహా కొంచెం కుదుటపడుతుంది. మరోవైపు చక్రి-కేశవ-కన్నా కూడా కాస్త తేరుకుంటారు. మాధవ మాత్రం కొంచెం డల్‌గా ఉంటాడు. నేను పనికి వెళ్తున్నాను.. అన్నం, కూరలు అన్నీ వండేశాను.. మధ్యాహ్నం తినండి అని మాధవ చెప్తాడు. ఇంతలో అన్నయ్య నాకు ఉదయం నుంచి కాఫీ కూడా ఇవ్వలేదని అంటాడు. అయ్యో సారీరా ఇప్పుడే చేసి ఇస్తానని మాధవ లోపలికి వెళ్తాడు. ఇది వినగానే మహా కోపపడుతుంది. ఇంత బాధలో ఉంటే మీకు కాఫీ కావాల్సి వచ్చిందా అని చక్రిని తిడుతుంది . సరిగ్గా అప్పుడే రేయ్ అన్నయ్య వెళ్లిపోయాడా కాఫీ ఇవ్వలేదు ఈరోజు అని కేశవ అంటాడు. దీంతో కేశవని కూడా వాయించేస్తుంది మహా.
ఆ తాయారు ఓ గయ్యాళి గంప
మరోవైపు నారాయణ టీ షాపు దగ్గర ఉండగా గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్న కుర్రాడి తండ్రి, మరొకరు అక్కడికి వస్తారు. ఏవండి.. ఇక్కడ పురుషోత్తం గారని.. దుబాయ్ నుంచి వచ్చారు ఆయన మీకు తెలుసా అని నారాయణని అడుగుతారు. ఆ తెలుసు వాడి గురించి మీకెందుకని నారాయణ అడిగితే ఇలా వాళ్ల అమ్మాయి గాయత్రిని మా అబ్బాయికి చేసుకోబోతున్నాం.. వాళ్ల ఫ్యామిలీ గురించి అంక్వైరీ చేద్దామని వచ్చాం అంటారు. ఆహా దొరికింది అవకాశమని నారాయణ ఉన్నవి లేనివి కలిపి చెప్పేస్తాడు. ఆ పురుషోత్తం గాడికి దుబాయ్‌లో సెకండ్ సెటప్ ఉంది.. వాడి పెళ్లాం తాయారు పెద్ద గయ్యాళి గంప అంటూ మొత్తం చెప్పేస్తాడు.
గాయత్రి బంగారం
నారాయణ మాటలు విని వాళ్లు అవాక్కవుతారు. అయితే సరిగ్గా అప్పుడే మాధవ అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావ్.. అలా చెప్పడం తప్పు అంటూ వాళ్లకి తాయారు ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తాడు మాధవ. వాళ్లంతా చాలా మంచి కుటుంబం.. ముఖ్యంగా గాయత్రి అయితే బంగారం.. మీరు దర్జాగా పెళ్లి చేసుకోవచ్చని చెప్తాడు. ఈయన తాయారుకి సొంత అన్నయ్య.. నేను ఈయన కొడుకుని.. మాకు కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయ్.. అందుకే మా నాన్న అలా తప్పుగా మట్లాడారని మాధవ చెప్తాడు. ఈ మాటలు విని పెళ్లి వాళ్లు కాస్త శాంతిస్తారు. నీ లాంటి మంచి కుర్రాడు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదని చెప్పి మాధవని పొగిడి వెళ్లిపోతారు. నారాయణ అయితే మాధవని తెగ తిట్టుకుంటాడు.
ఇంటికి వచ్చి నారాయణ చిందులు
ఇక నారాయణ ఇంటికి వచ్చి మాధవ చేసిన పనికి తెగ తిట్టుకుంటాడు. ఏమైంది ఏంటని కన్నా-మహా అడిగితే డైరెక్ట్‌గా చెప్పకుండా మాధవని తిడుతూ మాట్లాడతాడు. ఉన్నాడుగా నాకు ఒక సుపుత్రుడు.. వాడి పెళ్లికి నేను ఒక ప్లాన్ వేస్తే.. అది చెడగొట్టి వాళ్ల గురించి గొప్పగా చెప్పి.. పెళ్లి సెట్ చేశాడు.. అసలు ఇంత మంచోడు నా కడుపున ఎలా పుట్టాడో నాకు తెలియట్లేదని నారాయణ తిట్టుకుంటాడు. మహా-కన్నాకి ఏం అర్థం కాదు.. అసలు ఏమైందో అర్థమయ్యేలా చెప్తావా అని కన్నా అడుగుతాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరి గాయత్రి-మాధవల పెళ్లి సంగతి ఏమవుతుందో చూద్దాం.