Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు

 Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు

Podarillu Today ఏప్రిల్ 06 ఎపిసోడ్: నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మాధవ ప్రొఫైల్ మ్యాట్రిమోనీ సైట్‌లో పెడుతుంది మహా. ముందు మాధవ ఒప్పుకోకపోయినా తర్వాత మహా, చక్రి సహా తమ్ముళ్లు కలిసి ఒప్పిస్తారు. దీంతో మాధవ పెళ్లికి ఓకే అంటాడు. ఇక ఆ రోజు రాత్రే మాధవ నచ్చాడంటూ ఒక అమ్మాయి ప్రొఫైల్ నుంచి మెసేజ్ వస్తుంది. దీంతో వాళ్లకి కాల్ చేసి మహానే అన్నీ మాట్లాడుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

Podarillu Today
నేను మీకు నచ్చానా.. పెళ్లికి మాధవ ఓకే చెప్పెస్తాడా?.. సుద్దపూసలా చక్రి వేషాలు
Podarillu April 06th Episode: కేశవ గ్యారేజ్‌కి వచ్చి రెండు రీల్స్ చేసుకుంటాను ఫోన్ ఇవ్వమని శైలు అడిగిన సంగతి తెలిసిందే. ఇక దీని బాధ తట్టుకోలేక కేశవ సరేనంటాడు. కానీ ఎక్కడ ఫోన్ తీసుకొని పారిపోతుందోనని తన చేతికి శైలు చేతికి గొలుసు వేసి కడతాడు. ఇక కేశవ మీద వాలిపోతూ శైలు రీల్స్ చేస్తుంది. థాంక్స్ అండీ.. చాలా థాంక్స్.. నాకు ఫోన్ ఇచ్చినందుకని అంటుంది. ఒక రిక్వెస్ట్.. రోజూ ఇలానే రెండు రీల్స్ చేసుకోవడానికి ఫోన్ ఇస్తారా అని శైలు అడుగుతుంది. ఏంటి రోజూ ఇవ్వాలా.. ఇప్పుడు ఐదు నిమిషాలు నిన్ను తట్టుకోవడమే కష్టమైంది.. రోజూ అంటే నా వల్ల కాదు కానీ.. ఇదిగో ఈ ఫోన్ తీసుకొని వెళ్లు అంటాడు కేశవ. ఈ మార్పు చూసి శైలు అవాక్కవుతుంది. ఏంటి మీరు నాకు నిజంగానే ఫోన్ ఇచ్చేస్తున్నారా.. మరి నా దగ్గర డబ్బులు లేవు అంటుంది. ఫర్లేదు ఉన్నప్పుడే ఇవ్వు అంటాడు. థాంక్స్ ముంగీస.. నీలో ఇంత మార్పు నేను ఊహించలేదు అంటుంది. మరి నేను ఫోన్ తీసుకొని నీకు ఇక కనబడకుండా పోతే ఏం చేస్తావంటుంది. అంత ఓవరాక్షన్ చేయకు.. అందుకే మీ నాన్న నంబర్ సేవ్ చేశా అని కేశవ అంటాడు.

పెద్దికి మనం వేరే సంబంధం చూద్దాం

పెద్దికి మనం వేరే సంబంధం చూద్దాం

పెద్దికి మనం వేరే సంబంధం చూద్దాం
మరోవైపు చక్రి సహా కేశవ-కన్నాలతో మాధవ పెళ్లి గురించి మళ్లీ మహా మాట్లాడుతుంది. పెద్ది ప్రొఫైల్ మనం మ్యాట్రిమోనీలో పెడదామా.. 3 నెలల ప్యాకేజ్ తీసుకుంటే గాయత్రి పెళ్లి జరిగే లోపే మనం పెద్దికి కూడా పెళ్లి చేసేయొచ్చు అంటుంది. ఈ మాటకి ముందు తమ్ముళ్లు నో అంటారు. ఎందుకంటే పెళ్లి టాపిక్ తెస్తేనే మాధవ అన్నయ్య ఫైర్ అవుతున్నాడు.. మొన్నే కొట్టినంత పని చేశాడు.. మళ్లీ మాట్లాడామంటే ఏం చేస్తాడో అంటారు. అలా అని చెప్పి మనం ఇలానే వదిలేస్తామా అని మొత్తానికి అయితే మహా.. మాధవ ప్రొఫైల్ మ్యాట్రిమోనీలో పెడుతుంది.

ఏంటి మళ్లీ ఏం చేస్తున్నారు?

ఏంటి మళ్లీ ఏం చేస్తున్నారు?

ఏంటి మళ్లీ ఏం చేస్తున్నారు?
సరిగ్గా అప్పుడే మాధవ వస్తాడు. ఏంటి మళ్లీ అందరూ ఒక చోటే చేరారు.. మళ్లీ ఏమైనా గూడు పుఠాణి చేస్తున్నారా అని అడుగుతాడు. అదేం లేదు అన్నయ్య అని తమ్ముళ్లు ఏదో కవర్ చేయబోతారు. కానీ మహా మాత్రం ఎందుకు కవర్ చేస్తున్నారు నిజం చెప్పేద్దామని.. ఇలా మ్యాట్రిమోనీలో పెట్టామని చెప్తుంది. ఏంటమ్మా నిన్నే కదా పెళ్లి టాపిక్ తీసుకురావద్దని చెప్పాను.. మళ్లీ ఏంటిదని అడుగుతాడు. అదేంటి అన్నయ్య.. గాయత్రిని నీకు ఇవ్వకుండా వాళ్లు వేరే సంబంధం చేస్తున్నారు.. మరి మేము కూడా నీకు వేరే పెళ్లి చేస్తే తప్పేంటి అంటాడు చక్రి. అంతగా చేయాలనుంటే ఇదిగో మన కేశవకి పిల్లని చూడండి అంటాడు మాధవ.

మొత్తానికి ఓకే చెప్పిన మాధవ

మొత్తానికి ఓకే చెప్పిన మాధవ
మీరు ఉండగా కేశవకి చూడటమేంటి.. అయినా గాయత్రికి పెళ్లయిపోతే మీరు ఇలానే భగ్న ప్రేమికుడిలా ఉండిపోతారా.. అని మహా అంటుంది. అయినా మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి అంటుంది. నాకు పెళ్లే వద్దు అంటాడు. ఇక తమ్ముళ్లు, మహా వదలకపోయేసరకి చివరికి మాధవ సరేనంటాడు. సరే అయితే అమ్మాయి ఎలా ఉండాలో చెప్పండి అంటే.. సరిగ్గా గాయత్రి ఎలా ఉంటుందో అవే పోలికలు, లక్షణాలు చెప్తాడు మాధవ. నువ్వు అమ్మాయి కావలన్నట్లు లేదు గాయత్రి కావాలన్నట్లుగా చెప్పావని చక్రి ఏడిపిస్తాడు. ఏది ఏమైనా సరే నువ్వు పెళ్లికి ఓకే అన్నావ్ అది చాలు అన్నయ్య.. గాయత్రి పెళ్లికి ఒక్క రోజు ముందైనా సరే నీ పెళ్లి చేస్తామని తమ్ముళ్లు అంటారు.

మందు బాటిల్ లాక్కున్న మహా

మందు బాటిల్ లాక్కున్న మహా
మరోవైపు సాయంత్రం అయినా సరే నారాయణ ఇంకా ఇంటికి రాకపోయేసరికి గుమ్ముం ముందు కోపంగా నిల్చొని ఉంటుంది మహా. ఆ దెబ్బ పట్టుకొని ఈయనేంటి ఇంటికి రాకుండా షికార్లు కొడుతున్నాడు.. రానీ ఈయన పని చెప్తాను అనుకుంటుంది. ఇంతలో నారాయణ వస్తాడు. ఏంటి షికార్లు అయిపోయాయా.. అయినా రెస్ట్ తీసుకోకుండా ఎక్కడికి తిరుగుతున్నారని మహా దులిపేస్తుంది. సరే కూర్చోండి ఆ దెబ్బకి డ్రెస్సింగ్ చేయాలి అంటుంది. వదమ్మా అని అంటే తమ్ముళ్లు అందరినీ పిలిచి మొత్తానికి నారాయణ సీక్రెట్‌గా దాచిన మందు బాటిల్ లాక్కుంటుంది. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే మందు బాటిల్ ఇస్తానని పట్టుబడుతుంది. దీంతో నారాయణ బుద్ధిగా ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు.

అమ్మాయి ఎలా ఉంది?

అమ్మాయి ఎలా ఉంది?
ఇంతలో మహా ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. మనం ఉదయమే కదా పెద్ది ప్రొఫైల్ మ్యాట్రి్మోనీలో పెట్టాం.. అప్పుడే ఒక అమ్మాయి నుంచి దానికి లైక్ వచ్చింది.. పెద్ది నచ్చాడని మెసేజ్ కూడా పెట్టారని మహా అంటుంది. దీంతో తమ్మళ్లు ఎగిరి గంతేస్తారు. ఇదిగో అమ్మాయి ఫొటో చూడండి అని చూపిస్తుంది. అమ్మాయి చక్కగా ఉంటుంది. దీంతో తమ్ముళ్లు కూడా చాలా బావుంది అమ్మాయి.. వెంటనే మాట్లాడి పెళ్లి చేసేద్దాం అంటారు. ఆ అమ్మాయి ఏదో జువెలరీ షాపులో సేల్స్ గర్ల్‌గా పని చేస్తుందంట.. పూర్తి వివరాలు రేపు ఉదయం పెడతానన్నారు అంటుంది మహా.

సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ

సాంప్రదాయినీ సుప్పినీ సుద్దపూసనీ
ఇక తెల్లారగానే నుదుటిన పెద్ద విభూతి పెట్టుకొని పూజ చేస్తూ కనిపిస్తాడు చక్రి. ఇది చూసి కేశవ-కన్నా అవాక్కవుతారు. అన్నయ్య ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా అంటాడు కన్నా. అదేరా నాకూ అర్థం కావడం లేదు.. వీడు పూజ చేయడమేంటా అని కేశవ అనుకుంటాడు. ఇక ఇద్దరూ వచ్చి ఏంట్రా ఇది అని అడిగితే పూజరా పూజ అంటూ ఇద్దరికీ కూడా బొట్లు పెడతాడు. ఇక మహా బయటికొచ్చే వరకూ హారతిస్తూ గంట కొడుతూనే ఉంటాడు. ఇక మహా కూడా చూసి ఏంటి మీరు పూజ కూడా చేస్తారా అని వెరీ గుడ్ అంటుంది. అవునండీ స్నానం చేసి చేస్తే ఇంకా బావుండేదని కేశవ పరువు తీస్తాడు.

నేను చక్రి భార్యని

నేను చక్రి భార్యని
ఇక ఆ అమ్మాయి ఫ్యామిలీకి ఫోన్ చేద్దామని మహా అంటుంది. కానీ ఎవరు మాట్లాడతారని డిస్కషన్ రావడంతో చక్రి నేను మాట్లాడతా అంటాడు. ఎందుకు మళ్లీ పెద్ది ఆర్కిటెక్ట్.. తమ్ముడు ఆటో మొబైల్ ఇంజినీర్ అని చెప్పడానికా అని మహా ఏడిపిస్తుంది. ఇక కేశవ అయితే నేను మాట్లాడలేను అంటాడు. దీంతో మహా సరే నేనే మాట్లాడతానని ఫోన్ చేస్తుంది. హలో నమస్తే అండి.. నిన్న మాధవ నచ్చారని మెసేజ్ చేశారు కదా.. దాని గురించి మాట్లాడదామని చేశాను అంటుంది. హా చెప్పమ్మా.. నేను జ్యోతి వాళ్ల తండ్రిని మాట్లాడుతున్నాను.. ఇంతకీ పెళ్లి కొడుక్కి నువ్వు ఏమవుతావని అడుగుతాడు. నేను.. నేను మాధవ తమ్ముడు చక్రి వాళ్ల భార్యనని మహా అంటుంది. ఈ మాటకి చక్రి ఫుల్ ఖుషీ అయిపోతాడు. సరేనమ్మా మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి రండి అంటాడు అమ్మాయి తండ్రి.

మీ పెద్దరికం కావాలి

మీ పెద్దరికం కావాలి
ఇక ఈ విషయం గురించి నారాయణకి చెప్పాలని అంటుంది మహా. ఆయనకెందుకు.. ఇప్పుడు అక్కడికి వచ్చి 90, క్వార్టర్ అన్నాడంటే పరువు పోతుంది అంటారు చక్రి-కేశవ. లేదు లేదు ఇదేం బొమ్మల పెళ్లి కాదు.. పెద్దవాళ్లు మాట్లాడాల్సిందే.. ఆయనకి ఎలా మాట్లాడాలి ఏంటో మనమే ట్రైనింగ్ ఇద్దామంటుంది. ఇక నారాయణని పిలిచి విషయం చెప్తుంది. మీరే అమ్మాయిని సెలక్ట్ చేసినప్పుడు ఇక నేను మాట్లాడేదేముంది అంటూ నారాయణ సెటైర్ వేస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

నేను మీకు నచ్చానా?

నేను మీకు నచ్చానా?
తరువాయి భాగం ప్రోమోలో మాధవని తీసుకొని మొత్తం అందరూ చక్రి కారులో పెళ్లి చూపులకి బయలుదేరతారు. ఇక కారు మిర్రర్‌లో మహా ఫేస్ చూస్తూ చక్రి తెగ మురిసిపోతుంటాడు. ఇది చూసి తమ్ముళ్లు ఇద్దరూ లవ్ సాంగ్స్ పాడుతూ చక్రిని ఏడిపిస్తారు. ఇక పెళ్లి చూపులకి వెళ్లగానే సరే అమ్మాయి-అబ్బాయి మాట్లాడుకోండి అంటాడు పెళ్లి కూతురు ఫాదర్. ఇక ఆ అమ్మాయి.. మాధవని ముఖం మీదే నేను మీకు నచ్చానా అని అడుగుతుంది. దీనికి గాయత్రిని తలచుకొని మాధవ సైలెంట్‌గా ఉంటాడు. మరి ఓకే చెప్తాడా లేక గాయత్రి గురించి చెప్తాడా అనేది చూడాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *