Podarillu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి-కేశవ-కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకొని తాయారు ఇంటికెళ్లింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు.. మహా గురిచి నోరు జారడంతో ముగ్గురు అన్నదమ్ములు రెచ్చిపోతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.
Podarillu Today
మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా
Podarillu April 02nd Episode: మాధవ-గాయత్రి పెళ్లి అయ్యేలా మనం ఏదో ఒకటి చేయాలని చక్రి-కేశవ-కన్నాలతో మహాలక్ష్మి అంటుంది. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని మాకు కూడా తెలుసండి.. కానీ వాళ్ల అమ్మ ఉండగా ఇది జరగడం అసాధ్యమని చక్రి అంటాడు. మా అత్తని లేపేద్దామని చక్రి అనగానే మహా తిడుతుంది. ఇప్పటికే మీ నాన్న గారు హంతకుడని అందరూ అంటున్నారు.. ఇప్పుడు సెకండ్ జనరేషన్ కూడా ఆ అపవాదు మోయాలా అని మహా తిడుతుంది. పోనీ మీ పెళ్లి జరగకుండా ఆ జుట్టుపొలిగాడ్ని కిడ్నాప్ చేసినట్లే గాయత్రి పెళ్లి జరగకుండా వాళ్ల ఇంట్లో వాళ్లందరినీ కిడ్నాప్ చేద్దామా అని కన్నా అంటాడు. చూశారా మీ పెంపకం ఎలా తయారైందో అంటూ మహా కేశవ-చక్రిలని తిడుతుంది. సరే మీరే ఏం చేద్దామో చెప్పండని కేశవ అంటాడు. దీంతో మనమే తాంబూలాలు పట్టుకొని మీ అత్తయ్య ఇంటికి వెళ్దాం.. ఆఖరి ప్రయత్నంగా గాయత్రిని పెద్దికి ఇవ్వమని అడుగుదామని మహా సలహా ఇస్తుంది. ఇది వినగానే ముగ్గురు అన్నదమ్ములు అది జరిగే పని కాదు. అది అయ్యేది కాదంటూ నో అంటారు.

మీ అమ్మాయిలకి ధైర్యం ఉండదే

మీ అమ్మాయిలకి ధైర్యం ఉండదే

మీ అమ్మాయిలకి ధైర్యం ఉండదే
కాసేపటికి కేశవ తన గ్యారేజ్‌లో పనిచేసుకుంటుండగా శైలజ కోపంగా వస్తుంది. అక్కడున్న వస్తువుల్ని తన్నేసి కేశవపై ఫైర్ అవుతుంది. రేయ్ అసలు నువ్వేం అనుకుంటున్నావ్.. నీ బైక్‌కి డ్యామేజ్ చేసినందుకు నా ఫోన్ తీసుకున్నావ్ సరిపోయింది కదా.. మళ్లీ మా నాన్నకి ఫోన్ చేసి నన్ను ఎందుకు ఇరికించాలని ట్రై చేశావ్ అంటూ అడుగుతుంది. అవునా మరి నువ్వు మా ఇంట్లో వాళ్లకి కాల్ చేసి నా గురంచి ఎందుకు అలా చెప్పావే అని కేశవ అంటాడు. అయినా నీ ఫోన్ నీకు కావాలంటే పోయి మీ ఇంట్లో వాళ్లకి చెప్పి డబ్బులు తీసుకురా అప్పుడే ఇస్తా అంటాడు. వామ్మో నాకు భయమని శైలు అనగానే గాయత్రి మ్యాటర్ గుర్తొచ్చి కేశవ మొత్తం అమ్మాయిల గురించి మాట్లాడతాడు. అయినా మీ అమ్మాయిలకి ఇంట్లోవాళ్లకి చెప్పడానికి ధైర్యం ఎందుకు రాదే.. ఊరికే తెగ అరుస్తారు కదా.. అంటూ తిట్టేసి పంపించేస్తాడు.

చక్రి-మహా నవ్వులు
చక్రి-మహా నవ్వులు

చక్రి-మహా నవ్వులు
రాత్రి అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మహా ఒంటరిగా కూర్చొని పెద్ది పెళ్లి ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో చక్రి వచ్చి ఏంటండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారని అడుగుతాడు. ఇంకేముంది మీరు ఎలాగో ధైర్యం చేయలేకపోతున్నారు.. కనీసం నేను అయినా పెద్ది పెళ్లి కోసం ఏదో ఒకటి చేయాలి కదా అని మహా అంటుంది. అలా ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఇక ఈ సీన్ చూసి మాధవ, కేశవ, కన్నా మురిసిపోతారు. రేయ్ చూశారా ఆ నవ్వులు.. వాళ్లని అలా చూస్తుంటే మహా ఇక ఈ ఇల్లు వదిలి వెళ్లదు అన్నట్లుగా అనిపిస్తుంది కదా.. వాళ్లిద్దరూ త్వరలోనే సంతోషంగా ఉంటారు చూసుకోండి అంటూ తమ్ముళ్లతో అంటాడు మాధవ.

ఏదైనా పనికొచ్చే పని చేయరా

ఏదైనా పనికొచ్చే పని చేయరా
ఇక ఉదయం కాగానే చక్రి దగ్గరికొచ్చి మరోసారి పెద్ది పెళ్లి టాపిక్ తెస్తుంది మహా. దీంతో సరేనండీ మీరు చెప్పేది కూడా రైటే అనిపిస్తుంది. అయితే వాళ్లు మమ్మల్ని ఏమన్నా ఫర్లేదు కానీ మిమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం మేము ఊరుకోలేమని చక్రి అంటాడు. ఇంతలో కేశవ-కన్నా కూడా వచ్చి సరే మీరు చెప్పినట్లే చేద్దాం.. మా అత్తయ్య ఇంటికి వెళ్లి గాయత్రిని ఇమ్మని అడుగుదామని కేశవ అంటాడు. అయితే సరిగ్గా అదే సమయానికి మాధవ పనికి వెళ్లేందుకు బయటికి వస్తాడు. మాధవని చూసి కంగారులో ఏదేదో మాట్లాడతారు అందరూ. రేయ్ ఏం మాట్లాడుతున్నార్రా.. ఏదైనా పనికొచ్చే పని చేయరా అని చక్రికి చెప్పి.. అమ్మా వీడితో జాగ్రత్త.. వీడ్ని నమ్మి ఏ పని చేయకు.. నట్టేట ముంచేస్తాడని సరదాగా చెప్పి మాధవ వెళ్లిపోతాడు.

నేను అసలే తిక్కలదాన్ని

నేను అసలే తిక్కలదాన్ని
ఇక పెద్దవాళ్లు ఎవరూ లేకుండా మనం మాత్రమే వెళ్తే బాగోదని.. నారాయణని కూడా తీసుకెళ్దామని మహా అంటుంది. ఇక అది అయినట్లేనని కొడుకులు అంటారు. కానీ మహా వెళ్లి అడుగుతుంది. పెద్ది-గాయత్రికి ఒకరంటే ఒకరికి ఇష్టం కదా.. వాళ్లకి పెళ్లి చేయమని చెప్పి గాయత్రి ఇంటికి వెళ్లి అడుగుదాం మీరు రండి అంటుంది మహా. దీనికి నారాయణ తెగ నవ్వుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా.. నీకు ఈ ఇంటి గొడవలు గురించి తెలియదా.. నా చెల్లి తాటకి అసలే మిమ్మల్ని చూస్తేనే భగ్గుమంటుంది. ఇక మీరు ఇలా అడిగితే ఊరుకుంటుందా అని నారాయణ వెటకారం ఆడతాడు. నేను అసలే తిక్కలదాన్ని మీరు వస్తారా రారా అని అంటుంది మహా. నేను అయితే రాను.. మీరు కూడా వెళ్లొద్దని నారాయణ అంటాడు.

తాంబూలాలు తీసుకొని

తాంబూలాలు తీసుకొని
ఇక చక్రి-కేశవ-కన్నాలని తీసుకొని తాంబూలాలు చేతిలో పట్టుకొని మహా.. తాయారు ఇంటికి వస్తుంది. ఇక వీళ్లని దూరం నుంచి చూసే రమణయ్య అవాక్కై లోపలికి పరిగెత్తుతాడు. తన చెల్లి-బావల్ని తీసుకొని వస్తాడు. ఇక వీళ్లని చూసి ఏంటి ఇలా దయచేశారని తాయారు అంటుంది. అదే గాయత్రి మా పెద్ది ఒకరినొకరు ప్రేమించుకున్నారు కదా.. మా పెద్దికి మీ గాయత్రిని ఇవ్వమని అడుగుదామని వచ్చాం.. మా ఇంట్లో మీ అంత పెద్దావిడ ఎవరూ లేరు.. అందుకే ఏం తీసుకురావాలి ఏంటో మాకు తెలియదు.. నాకు తెలిసినవి తీసుకొచ్చాను.. నిశ్చితార్థం చేసుకోవడానికి అంటుంది మహా.

మా పెద్దికి ఏం తక్కువ

మా పెద్దికి ఏం తక్కువ
ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్.. అయినా ఆ హంతుకుడి ఇంటికి నా కూతుర్ని పంపిస్తానని నువ్వెలా అనుకున్నావ్.. అంటూ తాయారు మండిపడుతుంది. మీకు అన్నీ తెలిసి కూడా మీరు ఆలోచించలేకపోతున్నారు.. ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి.. మా పెద్దికి ఏం తక్కువ.. గాయత్రి అంటే చాలా ఇష్టం.. ఎవరో తెలియని నన్నే ఎంతో అపురూపంగా ఒక తండ్రిలా చూసుకుంటున్నాడు మా పెద్ది.. మరి ఇంతలో ప్రేమించిన గాయత్రిని ఇంకెంత బాగా చూసుకుంటాడో అర్థం చేసుకోండి.. అంటూ మహా రిక్వెస్ట్ చేస్తుంది.

వీళ్లు పుట్టకముందే ఆ యజమాని గురించి మాకు తెలుసు

వీళ్లు పుట్టకముందే ఆ యజమాని గురించి మాకు తెలుసు
చాలు చాలు ఆపమ్మా.. నీకంటే ముందు.. అసలు మీరు పుట్టకముందే ఆ ఇంటి గురించి.. ఆ ఇంటి యజమాని గురించి మాకు తెలుసు.. అయినా నా కూతురి పేరు బయట నానకూడదనే కదా ఈ టాపిక్ గురించి ఎన్నిసార్లు వచ్చినా నోరు మెదపట్లేదు.. అయినా కూడా మీరు ఇలా ఇంటికి వచ్చి గోల చేస్తారా.. మీకు ఎంత ధైర్యం అంటూ పురుషోత్తం అంటాడు. అయినా ఆ అమ్మాయికి అయితే తెలియదు.. మీ బతుకులేంటో మీకు తెలుసు కదరా.. అయినా మీరు ఇంటికి ఎలా వచ్చి అడుగుతున్నార్రా సిగ్గు లేకుండా అంటూ రమణయ్య అంటాడు.

గాయత్రి చెంప పగలగొట్టిన తాయారు

గాయత్రి చెంప పగలగొట్టిన తాయారు
మహా మళ్లీ ఏదో చెప్పబోతే తాయారు ఇక రెచ్చిపోతుంది. అసలు మిమ్మల్ని అంటూ మహా చేతిలో ఉన్న తాంబూలాల పళ్లాల్ని నేలకేసి కొడుతుంది. ఇదంతా చూసి కేశవ ఇక ఫైర్ అవుతాడు. ఏయ్ ఆగుతావా.. ఓయ్ తింగరిబుచ్చి.. నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను.. మా అన్నయ్యని తప్ప ఇంకెవర్నీ నువ్వు పెళ్లి చేసుకోను అని ధైర్యంగా చెప్పి.. ఆ గడప దాటి మాతో రా.. మీ వాళ్లు 100 మంది వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా రా గాయత్రి అని కేశవ పిలుస్తాడు. గాయత్రి ఒక్క అడుగు ముందుకు వేయబోతే తాయారు లాగి ఒక్కటిస్తుంది. ఏంటో లోపలికి పో అంటుంది.

పురుషోత్తం పీక పట్టుకున్న చక్రి

పురుషోత్తం పీక పట్టుకున్న చక్రి
రేయ్ ఏం కూశావురా అంటూ పురుషోత్తం ఆవేశంగా పక్కనే ఉన్న కర్ర తీసి కేశవ మీదకి దూసుకొస్తాడు. ఇంతలో పురుషోత్తం పీక పట్టుకొని చక్రి రెచ్చిపోతాడు. రేయ్ వదలరా సచ్చినోడా.. ఎంత ధైర్యముంటే నా ఆయన కాలర్ పట్టుకుంటావ్ అంటూ తాయారు గింజుకుంటుంది. పక్కనే ఉన్న మహా అయితే చక్రి వదలండి.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. కేశవ కూడా రేయ్ వదలియెరా అంటూ చక్రితో చెప్తాడు. అయినా సరే చక్రి మాత్రం వదలడు. ఇక చివరికి ఊపిరాడక పురుషోత్తం గింజుకుంటుంటే అప్పుడు చక్రి వదులుతాడు.

తాయారు తల పగిలేది

తాయారు తల పగిలేది
ప్లీజ్ మమ్మల్ని లోపలికి రానివ్వండి.. నిశ్చితార్థం చేసుకుందామని మహా అంటుంటే ఇక తాయారుకి సహనం నశిస్తుంది. ఏయ్ అసలు సిగ్గుందా.. మేము వద్దని చెప్తుంటే మళ్లీ మళ్లీ అదే పాట పాడతావ్.. పో ముందు ఇక్కడి నుంచి అని తాయారు గసురుతుంది. ఈ మాటకి కన్నా, కేశవ రెచ్చిపోతారు. ఏయ్ మా వదిననే అంత మాట అంటావా నిన్ను అంటూ తాయారు మీదకి దూసుకొస్తాడు కన్నా.. పక్కనే ఉన్న చక్రి ఆపుతాడు. ఇక కేశవ అయితే కర్ర తీసి తాయారు నెత్తి పగలగొట్టడానికి వెళ్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

నా మాట అంటే లెక్కలేదా?

నా మాట అంటే లెక్కలేదా?
తరువాయి భాగం ప్రోమోలో మాధవకి జరిగిన విషయం చెప్తాడు నారాయణ. ఇదిగో ఈ నలుగురు పెద్ద మనుషులు ఇత్తడి పళ్లాలు పట్టుకొని నీకు సంబంధం అడగటానికి ఆ ఇంటి గుమ్మం తొక్కారు.. వాళ్లు బాగా తిట్టి పంపిస్తే వాడిపోయిన ముఖాలతో ఇక్కడికి వచ్చారని నారాయణ అంటాడు. రేయ్ ఏంట్రా అసలు మీకు నా మాట అంటే లెక్కలేదా.. అయినా సంబంధాలు మాట్లాడేంత పెద్దోళ్లు అయిపోయారా.. అని మాధవ సీరియస్ అవుతాడు. వాళ్ల తప్పేం లేదు పెద్ది.. నేనే మాట్లాడానని మహా అంటుంది. అయినా ఇవన్నీ చేయడానికి ఎవరు మీరు అంటూ మాధవ ఒక మాట జారతాడు. ఈ మాట వినగానే మహా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోతుంది

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *