గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్.. ఫేక్ నగలతో దొరికిపోయిన బంగారు బాబు కొండ విజయ్‌కుమార్

 గోల్డ్ మ్యాన్ కాదు.. రోల్డ్ గోల్డ్ మ్యాన్.. ఫేక్ నగలతో దొరికిపోయిన బంగారు బాబు కొండ విజయ్‌కుమార్

తెలంగాణ గోల్డ్ మ్యాన్.. ఫేక్ అని ఐటీ అధికారులు తేల్చారు. ఒంటిపై కిలోల కొద్ది బంగారు ఆభరణాలను వేసుకుని తిరుగుతున్న బంగారు బాబు.. నకిలీ బంగారు బాబు అని తేల్చారు. ఇటీవల ఢిల్లీలో అతడి బంగారాన్ని సీజ్ చేసుకున్న ఐటీ అధికారులు.. అది నిజమైన బంగారం కాదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు బంగారు ఆభరణాలతో తిరిగిన ఆ గోల్డ్ బాబు కాస్తా రోల్డ్ గోల్డ్ బాబు కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

Hyderabad Gold Man

ఫేక్ నగలతో దొరికిపోయిన బంగారు బాబు కొండ విజయ్‌కుమార్

ఇటీవల ఐటీ అధికారులకు చిక్కిన తెలంగాణ గోల్డ్ మ్యాన్‌ కొండ విజయ్ కుమార్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. విజయ్ కుమార్ ధరించింది అంతా నిజమైన బంగారం కాదని.. నకిలీ గోల్డ్‌తో అతడు అందర్నీ మాయ చేస్తున్నాడని ఐటీ అధికారులు గుర్తించారు. విజయ్ కుమార్ సోషల్ మీడియా పోస్ట్‌లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలను పరిగణలోకి తీసుకుని రంగంలోకి దిగిన ఐటీ అధికారులకు అంతా నకిలీ అని తేల్చారు. దీంతో ఆ గోల్డ్ మ్యాన్ వ్యవహారం అందరికీ తెలిసింది.

హైదరాబాద్‌లో భారీ బంగారు ఆభరణాలు ధరించి.. మీడియా, సోషల్ మీడియా, నిజ జీవితంలో పెను సంచలనం రేపిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన పల్లపు సురేష్ కుమార్‌ అలియాస్ సూర్య భాయ్.. ధరించేది నిజమైన బంగారం కాదని.. అది అంతా నకిలీ అని ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు తేల్చారు. ఇటీవల అతడిని అడ్డుకున్న ఐటీ అధికారులు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతడి ఒంటిపై ధరించిన నగలను సీజ్ చేసి విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కొండ విజయ్‌కుమార్‌ను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న ఐటీ అధికారులు 12 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అతడు ధరించిన 1.4 కిలోల బంగారాన్ని సీజ్ చేసి విచారణ చేపట్టారు. ఆయన ఆర్థిక మూలాలకు సంబంధించిన వివరాలను ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆ నగలను విచారణ చేసిన అధికారులు పరీక్షించగా అవి ఫేక్ అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు.

గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్ వద్ద ఉన్న సుమారు 32 రకాల భారీ బరువైన ఆభరణాల్లో ఎక్కువ భాగం రాగితో చేసి రోడియం పూత పూసినవేనని తేల్చారు. తన వద్ద ఉన్న ఆభరణాల విలువ సుమారు రూ.1 కోటి ఉంటుందని అతను చెప్పినా.. మార్కెట్ ధర ప్రకారం అది కేవలం రూ. 3 లక్షలే అని ఐటీ అధికారులు నిర్ధారించారు. ఆ నగలు తొందరగా రంగు వెలిసిపోవడంతోపాటు.. అవి కొత్త ఆభరణాలు అన్నట్లుగా ప్రజలను నమ్మించేవాడని ఐటీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

ఇక బంగారు బాబు విజయ్ కుమార్.. లైఫ్ స్టైల్ చూస్తే కోటీశ్వరుడిలా అనిపించినా.. అతని ఆర్థిక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఈ సంఘటన ద్వారా వెల్లడైంది. 2022-23లోనే కేవలం రూ. 4.9 లక్షల ఆదాయాన్ని మాత్రమే అతడు చూపించాడని తేల్చారు. గత 6 ఏళ్లుగా అతడు ఐటీ రిటర్నులే దాఖలు చేయలేదని ఐటీ అధికారులు తెలిపారు. అతడి పేరు మీద గానీ.. భార్య పేరు మీద గానీ ఎలాంటి స్థిరాస్తులు లేవని గుర్తించారు. నెలకు రూ.20 వేల అద్దె ఇంట్లోనే అతడు నివసిస్తున్నాడని వెల్లడించారు. భూ వివాదాల్లో వచ్చే కమిషన్లతోనే అతడి వద్ద ఉన్న మహీంద్రా థార్.. ఎండీవర్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు తేల్చారు.

అయితే ఐటీ అధికారులు చేపట్టిన విచారణలో విజయ్ కుమార్.. అసలు బంగారు ఆభరణాలు ధరించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు. సినిమాల్లో అవకాశాల కోసం.. రాజకీయాల్లోకి వచ్చేందుకు పాపులారిటీ కావాలని అతడు అలా చేసినట్లు ఐటీ అధికారుల విచారణలో అంగీకరించాడు. మరోవైపు.. ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన గోల్డ్ మ్యాన్.. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఈ బంగారు బాబు అవతారం ఎత్తాడని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇతర ఆర్థిక లావాదేవీలపైనా
ఐటీ అధికారులు మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *