రాశిఫలాలు 15 జూన్ 2026: ఈరోజు సోమవతి అమావాస్య వేళ కుంభం సహా ఈ 5 రాశుల వారికి శివయ్య ప్రత్యే అనుగ్రహం
రాశిఫలాలు 15 జూన్ 2026: ఈరోజు సోమవతి అమావాస్య వేళ కుంభం సహా ఈ 5 రాశుల వారికి శివయ్య ప్రత్యే అనుగ్రహం
horoscope today 15 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సోమవతి అమావాస్య వేళ కర్కాటకం, కుంభం సహా ఈ 5 రాశులకు శివయ్య ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Jun15
horoscope today 15 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సోమవతి అమావాస్య సమయంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో బుధుడితో కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీంతో పాటు సర్వార్ధ సిద్ధి, అమృత యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా కుంభం సహా ఈ రాశుల వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. అంతేకాదు మహాదేవుని అనుగ్రహం కూడా లభించనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశులలో ఏ రాశి వారికి శివుని అనుగ్రహం లభిస్తుందనే పూర్తి వివరాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు, తన సొంత రాశిలో సంచారం చేయడం కారణంగా శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని శుభవార్తలు వింటారు. అయితే మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడి అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో నుంచి సంచారం చేసే సమయంలో మీకు చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు కొత్త వ్యాపార భాగస్వాములు దొరికే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి అధిపతిగా ఉండే బుధుడి ప్రభావంతో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు శుక్రుడి ప్రభావంతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థులు సీనియర్లు, ఉపాధ్యాయుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలి. మీరు బంధువులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి అధిపతిగా ఉండే చంద్రుడు, ఈ రాశి నుంచి పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మీ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఏ పనైనా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పరచనున్నాడు. ఈ కారణంగా మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపొచ్చు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో మద్దతు లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో చాలా తెలివిగా వ్యవహరించాలి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ పనిలో లేదా వ్యాపారంలో మౌనంగా ఉండటం ప్రయోజనకరంగా ఉంటుంది. వాదనలు, వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతిగా ఉండే శుక్రుడు తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. శుక్రుడి ప్రభావంతో మీ అదృష్టాన్ని పెంచి, మనశ్శాంతిని కలుగజేసే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మరోవైపు చంద్రుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సన్నిహితుల సహాయంతో పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. ఈరోజు మీరు సమయాన్ని, ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు శత్రు స్థానంలోని ఆరో ఇంట్లో, విజయం, కీర్తికి సంకేతమైన తొమ్మిదో స్థానంలో చంద్రుడు ఉన్నారు. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు మరింత కష్టపడాలి. ఒక నిపుణుడి సలహా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీకు ఆనందకరమైన, సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి. అయితే మీరు చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి అధిపతిగా ఉండే గురుడు గత కొన్ని రోజులుగా కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. చంద్రుడు సప్తమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. దీని వల్ల మీరు శాశ్వత విజయాలు సాధించే అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి నుంచి శని దేవుడు మూడో స్థానంలో, చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నారు. ఈ కారణంగా మీరు చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి అధిపతిగా ఉండే శని దేవుడు, ఈ రాశి నుంచి రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు శత్రు భయాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు అత్యంత బలమైన ప్రత్యర్థులపై కూడా విజయం సాధించొచ్చు. ఈ కారణంగా మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతిగా ఉండే గురుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి పంచమ స్థానంలో అంటే ధన స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మీ ఇంట్లో శుభకార్యాలు జరగొచ్చు. మీకు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరగొచ్చు. ఈరోజు మీరు పనికి సంబంధించి ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడానికి అవకాశం లభించొచ్చు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.