PM Kisan: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి డబ్బులు ఆరోజే!
రైతులకు త్వరలోనే గుడ్న్యూస్ అందబోతేంది. మారో వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. అవును దేశంలో రైతున్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తున్న రూ.2000 నిధులు మార్చి రెండో వారంలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
పీఎం-కిసాన్ పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 22వ విడత పెట్టబడి సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి రెండో వారంలోనే ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలోనే రైతులు ఈ కేవైసీ వంటివి పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఈకేవైసీ ఉన్నవారికి మాత్రమే నిధులు జమ అవుతాయి.