కలప దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి.. టాలీవుడ్ నిర్మాత చదలవాడ టింబర్ డిపోలో అద్భుతం

 కలప దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి.. టాలీవుడ్ నిర్మాత చదలవాడ టింబర్ డిపోలో అద్భుతం

Producer Chadalavada Srinivasa Rao Srivari Footprints: ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపోలో అద్భుతమైన సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి కట్ చేయగానే దుంగలో శ్రీవారి పాదాల ఆకృతి కనిపించింది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఇలా జరిగింది అంటున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఆ ఆకృతిని అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు చదలవాడ బ్రదర్స్ ముగ్గురి పేర్లు కూడా తిరుమల వెంకన్న పేరు కలిసి వచ్చేలా పెట్టారు.
హైలైట్:

టాలీవుడ్ ప్రొడ్యూసర్ చదలవాడ శ్రీనివాసరావు

టింబర్ డిపోలో శ్రీవారి పాదాలు బయటపడ్డాయి

అక్కడే ఉంచి పూజలు చేస్తామన్న శ్రీనివాసరావు

Chadalavada Srinivasa Rao

చదలవాడ శ్రీనివాసరావు టింబర్ డిపో

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ నిర్మాత, కలప వ్యాపారి చదలవాడ శ్రీనివాసరావు కు ఏషియన్ టిండర్ డిపో ఉంది. అక్కడికి ప్రతిరోజూ కలప దుంగలు కోతకు వస్తుంటాయి. ఈ క్రమంలో ఆయన టింబర్ డిపోలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఓ దుంగను తీసుకొచ్చి మెషిన్ మీదకు ఎక్కించి మధ్యలోకి కట్ చేయగానే అద్భుతం జరిగింది. ఆ దుంగపై మనిషి పాదాల ఆకృతిలో కనిపించడంతో టింబర్ డిపోలో పనిచేసేవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే చదలవాడ శ్రీనివాసరావు సమాచారం అందించగా.. ఆయన వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ దుంగపై పాదాల ఆకృతిని పరిశీలించి.. తమ ఇలవేల్పు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరుని పాదాలు అంటూ నమస్కారం చేశారు. సాక్షాత్తూ ఆ వెంకన్న తన చరణాలతో.. తమన ఆశీర్వదించారని.. ఇది తమ పూర్వజన్మ సుకృతం అన్నారు. ఇకపై ఈ చరణాలను అక్కడే ఉంచి ప్రతి రోజూ పూజలు చేస్తామన్నారు శ్రీనివాసరావు.

చదలవాడ బ్రదర్స్ మొత్తం ముగ్గురు కాగా.. వారి పేర్లు వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, శ్రీనివాసరావు. అయితే శ్రీనివాసరావు సతీమణి పేరు పద్మావతి కావడం విశేషం. ఇలా ఆతిరుమల వెంకన్నతో తమకు ఎంతో అనుబంధం ఉందని చెబుతున్నారు. గతంలో చదలవాడ బ్రదర్స్ తెనాలి నుంచి యాత్రికుల్ని తిరుమలకు తీసుకెళ్లేవారు. వెంకన్నను దర్శించుకున్న తర్వాత వారందరిని చెన్నైలోని ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి చూపించేవారట. ఇలా ఎప్పటి నుంచో చదలవాడ బ్రదర్స్‌కు శ్రీవారితో అనుబంధం ఉందని గుర్తు చేసుకుంటున్నారు.

చదలవాడ బ్రదర్స్‌ ఏషియన్ టింబర్ డిపో హైదరాబాద్ సమీపంలో ఉంది.. ఇక్కడి నుంచే అయోధ్యలో నిర్మితమైన శ్రీరాముడి ఆలయానికి ద్వారాలను, తలుపులను తయారు చేసి పంపించారట. అంతేకాదు చెన్నైలోని ఎన్టీఆర్ నివసించిన ఇంటిని చదలవాడ బ్రదర్స్ కొనుగోలు చేసి మ్యూజియంగా మారుస్తున్నారట. చదలవాడ బ్రదర్స్ సినిమా నిర్మాతలు, కలప వ్యాపారం కూడా ఉంది. ఈ క్రమంలోనే చదలవాడ బ్రదర్స్ టింబర్ డిపోలో ఉన్న ఓ దుంగను కట్ చేయగా ఇలా శ్రీవారి పాదాలు కనిపించడం చర్చనీయాంశం అయ్యింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *