రాశిఫలాలు 16 ఆగస్టు 2026: ఈరోజు చంద్ర-శుక్రుడి కలయిక వల్ల ఏ రాశులకు అదృష్టం కలిసొస్తుంది?
రాశిఫలాలు 16 ఆగస్టు 2026: ఈరోజు చంద్ర-శుక్రుడి కలయిక వల్ల ఏ రాశులకు అదృష్టం కలిసొస్తుంది?
horoscope today 16 August 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు శుక్రుడు, చంద్రుడి కలయిక కారణంగా ఏ రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Daily Horoscope in Tel Aug16
horoscope today 16 August 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు శుక్రుడితో కలయిక జరపనున్నాడు. మరోవైపు గురుడు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. శుక్రుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అప్పుల భారం నుంచి ఉపశమనం లభించొచ్చు.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో గొప్ప విజయం సాధించొచ్చు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రానుంది.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. ఎవ్వరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకండి. ఈ కారణంగా మీరు నష్టపోవాల్సి రావొచ్చు. మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
మీకు కొన్ని ఆరోగ్య సమస్యలు పెరగొచ్చు. ఇది మీ శక్తిని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఇంటికి ఒక అతిథి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించొచ్చు. మీ ఆలోచనలను బలపరచుకోవడం ద్వారా కొత్త అవకాశాల వైపు పయనించేందుకు ప్రయత్నిస్తారు.
ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొద్దిపాటి వ్యాయామం నిరంతరం చేస్తూ ఉండాలి.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని కొత్త ఒప్పందాలపై సంతకం చేయొచ్చు. ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన పెరగొచ్చు.
ఈరోజు ఎలాంటి పుకార్లను నమ్మకూడదు. లేదంటే మీ మనసులో గందరగళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు మీ శక్తి మేరకు దానధర్మాలు చేయాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. శుక్ర, చంద్రుడి ప్రభావంతో మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సహోద్యోగుల నుంచి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు.
మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు. మీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు సూర్య నమస్కారాలు చేయాలి
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ మనసులో ఉద్రిక్త వాతావరణం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారులకు పోటీదారుల నుంచి గట్టిపోటీ ఎదురవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మీకు పాత ప్రాజెక్టుల నుంచి నష్టాలు ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా సహనంతో ఉండాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొందరు వ్యక్తులతో కొన్ని విషయాల పట్ల విభేదాలు తలెత్తొచ్చు.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండిగులో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఏ పనినీ వాయిదా వేయకుండా, దానిని వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయాలి.
వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. మరోవైపు ఏదైనా ఆస్తిని అమ్మాలని లేదా కొనాలని ప్లాన్ చేస్తుంటే, అది ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులలో చాలా ఓపికగా ఉండాలి.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. అయితే మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పనిలో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.
ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల నుంచి మీకు సహకారం లభించొచ్చు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.
పరిహారం :ఈరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పనికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవ్వొచ్చు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభించకపోవచ్చు.
పరిహారం :ఈరోజు సూర్య మంత్రాలను జపించాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీకు బంధువుల నుంచి గౌరవం లభిస్తుంది. మీ తోబుట్టువులతో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
అయితే ఉద్యోగులకు కార్యాలయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. మరోవైపు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు.
పరిహారం :ఈరోజు సూర్య దేవాలయంలో దానధర్మాలు చేయాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసిన పనిలో మంచి ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి అనేక రంగాల్లో మీకు మద్దతు లభిస్తుంది.
అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.