చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌

 చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్‌లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాద‌వ్‌

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్‌ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Pruthviraj yadav

పృథ్వీరాజ్ యాద‌వ్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త, పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ప్రతి శనివారం, ఆదివారం.. హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో ఏం పెట్టుకున్నారని.. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డను కర్నూలుకు తీసుకెళ్లి వేధిస్తే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదని విమర్శించారు. హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డికి (కేవీఆర్) సంఘీభావం తెలుపుతూ పృథ్వీరాజ్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని ఏపీ పోలీసులు గత మార్చి నెలలో అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నేతలపై అభ్యంతరకరమైన, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అయితే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ, ఈవీఎంల పనితీరుపై కథనాలు ప్రసారం చేసినందుకే ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేశారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. కేవీ రెడ్డి అరెస్టును ప్రశ్నిస్తూ హైదరాబాద్‌లో ఉంటున్న జర్నలిస్టును.. ఏపీ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారంటూ జర్నలిస్టు సంఘాలు అప్పట్లో నిరసనలు తెలిపాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి.. అరెస్టులు చేస్తారా అని కొన్ని జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి.

ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన కె. వెంకట్రామిరెడ్డి.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కలిశారు. మార్చి18న కుటుంబంతో కలిసి జగన్‌ను కలిసిన వెంకట్రామి రెడ్డి.. తనను కర్నూలు పోలీసులు వేధించిన తీరును వివరించారు. హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ వేయటంతో విడుదల చేసినట్లు జగన్‌కు వివరించారు.

ఈ సందర్భంగా తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేద్దామని కె. వెంకట్రామి రెడ్డికి జగన్ హామీ ఇచ్చారు. విడుదలైన నేపథ్యంలో పలువురు కేవీ రెడ్డిని కలిసి సంఘీభావం తెలియజేస్తు్న్నారు.ఈ క్రమంలోనే కేవీ రెడ్డిని కలిసిన పృథ్వీరాజ్ యాదవ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *