ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేలు
Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
హైలైట్:
ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక
హామీ నిలబెట్టుకున్న చంద్రబాబు
రూ.45 కోట్లు విడుదల చేసిన సర్కార్
ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం కోసం
AP Govt Releases Rs 45 Crores
ఏపీలో ఇమామ్ మౌజన్లకు గౌరవ వేతనం విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రంజాన్ సందర్భంగా ఇమామ్, మౌజన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రోజు ఇమామ్, మౌజన్‌ల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటన చేయగా.. ఇవాళ నిధులు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం నిమిత్తం రూ.45 కోట్లు విడుదల చేశారు. గత ఆరు నెలల బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి క్లియర్ చేశారు. సోమవారం ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు హామీ మేరకు కొన్ని గంటల్లోనే నిధుల విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మంది ఇమామ్‌లు, మౌజన్‌ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తారు.
ఏపీ ప్రభుత్వం నెలకు ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. రాష్ట్రం 5000 వేల మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు 2025 అక్టోబరు నుంచి 2026 మార్చి వరకు ఆరు నెలలకు సంబంధించిన వేతనాలను రూ.45 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం ముస్లింలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. అమరావతిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 21 నెలలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్‌ను త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం కింద ఇప్పటి వరకు రూ.180 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నామని.. అలాగే వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచామన్నారు. 1,500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేసి కాపాడుతున్నామన్నారు. రాష్ట్రంలో ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధిలోకి తేవటమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.