ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్

 ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్

ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు.. మళ్లీ అదే పాత వీడియో.. నారా లోకేష్ సీరియస్

Nara Lokesh Warns Fake Video: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ఓ లబ్ధిదారుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ వీడియోను ఎడిట్ చేసి మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చిందని.. అయినా సరే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఇలా చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

హైలైట్:

ఏపీ సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్

ఎంత చెప్పినా మారట్లేదన్న మంత్రి లోకేష్

చట్ట ప్రకారం చర్యలుంటాయని వార్నింగ్

Chandrababu Fake Video
చంద్రబాబుపై ఫేక్ వీడియోతో ప్రచారం
Chandrababu Fake Video

చంద్రబాబుపై ఫేక్ వీడియోతో ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత వీడియో ఒకటి మళ్లీ వైరల్ అవుతోంది. మార్చి నెలకు సంబంధించిన ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మార్చి నెలలో నాయుడపేట పర్యటనలో.. ఓ మహిళ తన కుమారుడికి ఉద్యోగం కావాలని చంద్రబాబును కోరిన వీడియోను.. అంతకముందు చంద్రబాబు ఓ వ్యక్తి ఆటో కొనివ్వమని చెప్పిన క్లిప్‌కు కలిపేశారు. ఉద్యోగం కావాలని అడిగితే.. చదువుకున్న యువకుడికి ఆటో కొనిస్తామని చంద్రబాబు చెప్పినట్లుగా కొందరు పాత వీడియోతో ప్రచారం చేస్తున్నారు. ఈ పాత వీడియోను మళ్లీ కొందరు వైరల్ చేయడంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు.

తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైఎస్సార్‌సీపీ ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. అక్కడ ఒక లబ్ధిదారుడికి ఇచ్చిన హామీని వక్రీకరించి కొందరు ఆ సమయంలోనే తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఇప్పటికే AP Government Fact Check ద్వారా ఈ వీడియోపై వివరణ కూడా ఇచ్చారన్నారు. తాజాగా ఇప్పుడు మళ్లీ అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు. అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబిక కుటుంబానికి కొన్ని హామీలు ఇచ్చారని లోకేష్ వివరించారు. అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప దగ్గర ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారన్నారు. ముఖ్యమంత్రి అంబిక భర్తకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను.. ఆ మహిళ కుమారుడికి అడిగిన విషయానికి జత చేసి ‘‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని.. ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ అంశంపై మరోసారి ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా మరోసారి స్పందించింది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *