Today Horoscope in Telugu: సుకర్మ యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు!

 Today Horoscope in Telugu: సుకర్మ యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు!

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, బుధుడు, చంద్రుడి మధ్య సమసప్తక యోగం ఏర్పడనుంది. సింహ రాశిలో బుధుడు, సూర్యుడి కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో పాటు సుకర్మ, ధ్రుతి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనిలో సానుకూల మార్పులు రానున్నాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని మంచి ప్రాజెక్టులలో భాగస్వాములవుతారు. ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు పెంచుకుంటారు.

సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తవ్వడంతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో బంధం బలపడుతుంది.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వంతో, అధికారంలో ఉన్నవారితో పొత్తులు ప్రయోజనకరంగా ఉండొచ్చు.

నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ పిల్లల సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వినొచ్చు. శుభ యోగాల ప్రభావంతో మీకు ప్రత్యేక ఫలితాలు రావొచ్చు. బుధాదిత్య యోగం ప్రభావంతో మీ ప్రణాళికలు విజయవంతం కావొచ్చు.

వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను కనుగొనడంలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు సప్తమ స్థానం నుంచి సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. ఇదే రాశిలో గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండటం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లల పట్ల బాధ్యతలు నెరవేరొచ్చు.

కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీ ప్రయాణాలు ఆహ్లాదకరంగా మారే అవకాశాలున్నాయి. మీ ప్రియమైన వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు విష్ణువు ఆలయంలో దానధర్మాలు చేయాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీకు ముఖ్యమైన బాధ్యతలు కూడా లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు.

ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు కోల్పోయిన డబ్బు తిరిగి పొందొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడిపే అవకాశం లభిస్తుంది. మీ తోబుట్టువులతో స్నేహపూర్వక సంబంధాలు బలపడతాయి.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి ఈరోజు బుధుడి ప్రభావంతో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు మెరుగైన లాభాలు రానున్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

సమాజంలో మీ గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వ్యాపారులు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీనారాయణ మంత్రాలను పఠించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ ప్రణాళికలకు కార్యాలయంలో అందరి నుంచి ప్రశంసలు లభించొచ్చు. మీకు సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. దీంతో మీరు సులభంగా విజయాలు సాధిస్తారు.

వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మీ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి గురుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు కలగనున్నాయి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.

ఈ రాశి నుంచి చంద్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు ఊహించని లాభాలు పొందొచ్చు. మీరు పాల్గొనే ప్రాజెక్టుల్లో మంచి విజయం సాధించొచ్చు.

పరిహారం : ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీరు చేసే పనుల్లో కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపారలుకు మెరుగైన ఫలితాలు రానున్నాయి.

మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ పాత లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

పరిహారం :ఈరోజు దుర్గా చాలీసా పఠించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు రానున్నాయి.

సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు రానున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు విష్ణువు సహస్రనామం పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశికి అధిపతి అయిన శని దేవుడు మీన రాశిలో తిరోగమనం చేయనున్నాడు. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదురుకావొచ్చు. కాబట్టి చాలా ఓపికగా ఉండాలి.

మీరు చేసే ప్రయాణం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం :ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఇదే రాశిలో శని దేవుడు తిరోగమనం కారణంగా మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే మీ వైవాహిక జీవితంలో సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. మీ తోబుట్టువులతో బంధం బలపడొచ్చు.
ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రాలు, దానధర్మాల కారణంగా కొంత ఖర్చులు పెరగొచ్చు. మీరు చేసే ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గురు గ్రహం ప్రభావంతో కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు విష్ణువు ఆలయంలో దానధర్మాలు చేయాలి.

 

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *