Gundeninda Gudigantalu: బాలు గతాన్ని తెలుసుకుని అల్లాడిన మీనా! ‘అమ్మకు నిజం చెప్పొద్దు నాన్నా’ సత్యం దగ్గర మాట తీసుకుని..

 Gundeninda Gudigantalu: బాలు గతాన్ని తెలుసుకుని అల్లాడిన మీనా! ‘అమ్మకు నిజం చెప్పొద్దు నాన్నా’ సత్యం దగ్గర మాట తీసుకుని..

Gundeninda Gudigantalu: బాలు గతాన్ని తెలుసుకుని అల్లాడిన మీనా! ‘అమ్మకు నిజం చెప్పొద్దు నాన్నా’ సత్యం దగ్గర మాట తీసుకుని..

Gunde Ninda Gudi Gantalu: ఏంటీ.. బాలు గతం గురించి మీనాకు తెలుసా? సత్యం చెప్పేశాడా? ఎప్పుడు? ఎలా? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అవును బాలు.. గతం గురించి మీనాకు చాలా వరకూ తెలుసు. స్వయంగా సత్యమే చెప్పాడు. అది మీనా, బాలుల పెళ్లి అయిన కొత్తలో ఎపిసోడ్. ఎపిసోడ్ 78లో మీనాకు.. బాలు గతం గురించి.. బాలు చేసిన త్యాగం గురించి.. మనోజ్ ఆడిన నాటకం గురించి.. సత్యం స్పష్టంగా మీనాకు చెప్పాడు. బాలు ప్రవర్తన నచ్చక.. అతడ్ని వదిలేయాలి అని నిర్ణయించుకున్న మీనాకు.. ఆ గతాన్ని చెప్పే సత్యం.. తిరిగి మీనా మనసు మారుస్తాడు. అసలేం జరిగింది ఆ వివరాలు ఒకసారి చూద్దాం

Gunde Ninda Gudi Gantalu (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు సీరియల్ (photo courtesy by star maa and JioHotstar)
Gunde Ninda Gudi Gantalu: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలు గతాన్ని కదిలించిన ప్రతీసారి ఆ సీన్ మనసుల్ని మెలిపెట్టేసే ఎమోషనల్ సీన్‌గా మారిపోతుంది. ప్రభావతి.. బాలుని ఎందుకు దూరం పెడుతుంది? అసలు బాలుని నష్టజాతకుడిగా ఎందుకు చూస్తుంది? అనేది సీరియల్ అభిమానులు చాలామందికి తెలుసు. బాలు పెద్ద అన్న జయరాం చనిపోవడానికి బాలునే కారణం అనుకున్న ప్రభావతి.. బాలుని చిన్నప్పుడే జైలుకి పంపించింది అని. నిజానికి బాలు, మనోజ్ చిన్నగా ఉన్నప్పుడు.. జయరాంని గోదావరిలోకి తోసింది మనోజ్. కానీ అందరి ముందు మనోజ్.. ఆ నేరాన్ని బాలు మీదకు తోసేయడంతో.. బాలు నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోయి.. జైలుకి వెళ్లిపోతాడు. అదే బాలు గతం. అయితే ప్రభావతి మాత్రం ఆ రోజు నుంచి బాలు కారణంగానే తన పెద్దకొడుకు జయరాం చనిపోయాడు అని నమ్మి.. బాలుని ధ్వేషిస్తోంది. ఈ క్రమంలోనే మనకు చాలాసార్లు మీనాకు బాలు గతం తెలుసా తెలియదా? అనే ఆసక్తి నెలకునేది. పైగా ప్రేక్షకాధరణ పెరిగిన తర్వాత చూపించే ఎపిసోడ్స్‌లో మీనా కూడా.. తనకు ఈ గతం అంతా తెలుసు అన్నట్లుగా ఏరోజు ప్రవర్తించలేదు. కానీ మీనాకు బాలు గతం తెలుసు. తల్లి ప్రభావతి.. బాలుని ఎందుకు ధ్వేషిస్తుందో.. మనోజ్ చేసిన మోసం ఏంటో కూడా తెలుసు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎపిసోడ్ 78లో బాలు ప్రవర్తన తీరు నచ్చని మీనా.. బ్యాగ్ తీసుకుని ఒక అర్ధరాత్రి.. పుట్టింటికి వెళ్లిపోతున్న సీన్ అది.

వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నావా అమ్మా?
వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నావా అమ్మా?

వెళ్లిపోవాలనే నిర్ణయించుకున్నావా అమ్మా?
మీనా బ్యాగ్ పట్టుకుని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంటుంది. గేట్ బయటే తన మామయ్య సత్యాన్ని చూసి ఆగిపోతుంది. “ఏమ్మా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నావా” అని అడుగుతాడు సత్యం. ” ఎందుకు ఉండాలో అర్థం కానప్పుడు.. వెళ్లిపోవడం తప్పు కాదని తెలిసినప్పుడు.. ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది కదా మామయ్య” అంటుంది ఆవేదనగా మీనా. “బాలుకు నీకు మధ్య జరిగిన వాదనను నేను విన్నానమ్మా. అంత చిన్న విషయానికే బంధాలు తెంచేసుకోవాలనుకోవడం. వెళ్లిపోవాలి అనుకోవడం ఏంటమ్మా” అని అడుగుతాడు సత్యం. మీనా కన్నీళ్లతో ‘అది మీ దృష్టిలో చిన్న విషయమా మావయ్యా’ అంటుంది.

మీ అబ్బాయి… ఈ ఇంట్లో నన్ను ఒక వస్తువులా చూస్తున్నాడు మావయ్యా..
మీ అబ్బాయి... ఈ ఇంట్లో నన్ను ఒక వస్తువులా చూస్తున్నాడు మావయ్యా..

మీ అబ్బాయి… ఈ ఇంట్లో నన్ను ఒక వస్తువులా చూస్తున్నాడు మావయ్యా..
మీనా ఆవేదనగా సత్యం ముందు మాట్లాడుతూ ఉంటుంది. ‘నా బాధను, కన్నీళ్లను అతడు పట్టించుకోకపోవడం మీకు చిన్న విషయంలా అనిపిస్తుందా.. ? ” అంటుంది మీనా. “నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా. నీ బాధను నీ భర్తకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలే తప్పా.. ఇలా వెళ్లిపోవాలి అనుకోవడంలో అర్థం లేదమ్మా” అంటాడు సత్యం. “ఎలా… అతడినికి అర్థమయ్యేలా చెప్పాలి. అతడి దృష్టిలో ఈ ఇంట్లో నలుగురిలో నేను ఒకదాన్ని. నన్ను ఈ ఇంట్లో ఒక వస్తువులా చూస్తున్నాడే తప్పా.. తాళి కట్టిన భార్యలా చూడడం లేదు. అతడు నా బాధను వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అలాంటి బండరాయి మనసుకు, మనిషికి నేను ఎప్పటికైనా అర్థమయ్యేలా ఎలా చెప్పగలను” అంటూ బాధపడుతుంది మీనా.

సత్యం నమ్మకం.. మీనా అపనమ్మకం..

సత్యం నమ్మకం.. మీనా అపనమ్మకం..
“వాడు మారడానికి కాస్త టైమ్ పడుతుందమ్మా. కానీ వాడు కచ్చితంగా మారతాడు అర్థం చేసుకుంటాడు. ఆ నమ్మకం నాకుందమ్మా” అంటాడు సత్యం. “కానీ నాకు మాత్రం ఆవగింజంత నమ్మకం కూడా లేదు మామయ్య. ఎందుకంటే అతడికి కుటుంబం అనే అనుబంధం తెలియదు. నావాళ్లు.. నా బంధం అనే ప్రేమ తెలియదు. ఆప్యాయతలు, అనుబంధాలు అంటే ఏంటో తెలియని ఒక బండరాయిలా మారిపోయాడు అతడు. అలాంటి వాడు మారతాడు అనుకునే భ్రమ, ముర్ఖత్వం మరోకటి ఉండదు మామయ్య గారు” అంటుంది ఆవేదనగా మీనా. “పైకి కనిపించే బండరాయిలో కూడా మనకు కనిపించని చల్లని నీళ్లు ఉంటాయి. వాడి మనసు కూడా అలాంటిదేనమ్మా” అంటాడు సత్యం.

కన్నతల్లి ప్రేమే పొందలేని వాడు మీ అబ్బాయి..

కన్నతల్లి ప్రేమే పొందలేని వాడు మీ అబ్బాయి..
“మామయ్యగారు.. మీరు నన్ను వెళ్లనివ్వకుండా ఆపడం కోసం సర్థి చెబుతున్నారని అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పండి మామయ్య. ఈ లోకం మనం ద్వేషించినా మనల్ని ప్రేమించినవారు ఎవరైనా ఉన్నారంటే, మనం ఎన్ని తప్పులు చేసిన క్షమించి కడుపులో పెట్టుకుని కాపాడేవాళ్ల ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం కన్నతల్లి మాత్రమే. అలాంటి కన్నతల్లే (ప్రభావతి) అతడిని ద్వేషిస్తుందంటే.. అతడి వ్యక్తిత్వమేంటో.. అతడు ఎలాంటి వాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి. అంటూ మీనా మాట్లాడుతుంటే సత్యం వింటూ ఉంటాడు.

అండగా ఉండాల్సిన భర్తే పట్టించుకోవడం లేదు మావయ్యా..

అండగా ఉండాల్సిన భర్తే పట్టించుకోవడం లేదు మావయ్యా..
కని పెంచిన తల్లితోనే అతడు ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడడు. అలాంటిది మధ్యలో వచ్చిన నాతో అతడు ఇంకేం ప్రేమగా ఉంటాడు. మా అమ్మ మాట కాదనలేక.. నాకు ఇష్టం లేకపోయినా సరే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఇష్టంతో జరిగినా.. అయిష్టంతో జరిగినా.. ప్రతి ఆడపిల్లకు అత్తవారిల్లే తన ఇల్లు. మరీ అలాంటి ఇంట్లోనే నన్ను దొంగను చేస్తే నేను తట్టుకోగలనా (ప్రభావతి అప్పట్లో కూడా మీనాపై ఓ దొంగతనం వేసింది).. ఇలాంటి టైమ్ లో నాకు అండగా నిలబడాల్సిన భర్తే నన్ను పట్టించుకోకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా ఇంకేం చేయగలను. చెప్పండి మామయ్యగారు. నేను ఇంకా ఈ ఇంట్లో ఏ నమ్మకంతో ఉండాలి ” అంటుంది మీనా.

మావయ్యగారు మీరేమంటున్నారు? అర్థం కావడం లేదు..

మావయ్యగారు మీరేమంటున్నారు? అర్థం కావడం లేదు..
మీనా మాటలకు సత్యం ఏడుస్తూ స్పందిస్తాడు. “కళ్ల ముందే కన్నతల్లి ఉన్నా సరే వాడిని అనాథను చేసేసింది. ఇప్పుడు కట్టుకున్న భార్య కూడా వాడిని అనాథను చేసి వెళ్లిపోతుంది. అందరూ వాడిని వదిలేసి వెళ్లిపోతుంటే.. కన్నతల్లి దగ్గరనుంచి భార్య వరకు అందరూ వాడిని వదిలేస్తుంటే.. వాడు బతికినంతకాలం ఇలా మందుకు బానిసై బతకడం తప్ప మనిషిలా ఎప్పటికీ మారతాడు. వాడిలో మమతలను ఎవరు పెంచుతారు” అంటాడు బాధగా సత్యం. సత్యం మాటలకు మీనకు ఏ మాత్రం అర్థం కావు. “మామయ్యగారు.. మీరేం అంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కన్నతల్లే అతడిని అనాథను చేయడమేంటీ.? అతడి మనసుకు గాయం చేయడమేంటీ.. ” అని అడుగుతుంది మీనా.

బాలు గతం రివీల్ చేస్తున్న సత్యం..

బాలు గతం రివీల్ చేస్తున్న సత్యం..
“బాలు మనందరికి పైకి నవ్వుతూ సరదాగా కనిపిస్తాడు. కానీ ఆ నవ్వు వెనకాల అగ్ని పర్వతం అంతా విషాదం ఉంది” అంటూ గతాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు సత్యం. బాలు పుట్టిన నక్షత్రం మంచిది కాదు. పిల్లాడికి 21 సంవత్సరాల వరకు కుటుంబానికి దూరంగా ఉంచడం తప్ప వేరే మార్గం లేదు అని పంతులు చెప్పాడు, అందుకే మీ అత్తయ్య.. ఇంకా ఒక్క క్షణం వాడు ఈ ఇంట్లో ఉండటానికి వీళ్లేదంటూ బాలును వాళ్ల నాన్నమ్మ ఇంట్లో వదిలేసింది. అమ్మ నన్ను వదిలి వెళ్లొద్దమ్మా అంటూ బాలు ఎంత ఏడ్చినా పట్టించుకోకుండా వెళ్లిపోయేది. అంటూ బాలు గతంలో జరిగిన ప్రతీ సీన్‌ని గుర్తు చేసుకుంటూ సత్యం చెబుతూనే ఉంటాడు.

జయరాం చావుకి కారణం మనోజ్.. కానీ నేరం బాలు మీదకు తోసి..

జయరాం చావుకి కారణం మనోజ్.. కానీ నేరం బాలు మీదకు తోసి..
ఒకరోజు.. నాన్నమ్మ ఇంట్లో ఉన్న బాలు.. అన్నయ్యలు వచ్చారన్న సంతోషంలో.. వాళ్లను తీసుకుని గోదావరి ఒడ్డుకి వెళ్లాడు. అప్పుడు మనోజ్.. జయరాంని ‘రేయ్ అన్నయ్యా నీకు స్విమ్మింగ్ వచ్చుగా.. నేర్చుకుంటున్నావ్‌గా.. గోదావరిలో కూడా స్విమ్మింగ్ చెయ్’ అని తోసేశాడు. దాంతో జయరాం చనిపోతే.. అందరి ముందు.. జయరాంని నీళ్లల్లోకి తోసింది బాలు అని అబద్దం చెప్పాడు. బాలుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను జైలుకి వెళ్లాను బాలుని కలవడానికి.. అంటూ జరిగిన ప్రతీ సీన్‌ని తలుచుకుంటూ మీనాకు బాలు గతాన్ని వివరిస్తుంటాడు.

జైల్లోని ఆనాడే.. సత్యానికి నిజం చెప్పిన బాలు..

జైల్లోని ఆనాడే.. సత్యానికి నిజం చెప్పిన బాలు..
సత్యం గతాన్ని చెబుతూ.. “అమ్మ ప్రేమ లేని బాల్యం నరకం అని అంటారు. వాడు జైలు గోడల మధ్య చిన్నప్పుడు అలాంటి నరకమే అనుభవించాడమ్మా” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు సత్యం. అప్పుడు కూడా బాలుని తాను జైలుకి వెళ్లి కలిసిన విషయం మీనాకు చెబుతాడు. జైల్లో నిశ్శబ్దంగా నిలబడిన బాలు దగ్గరకు వచ్చిన సత్యం .. “బాలు.. అమ్మ క్షమించదని తెలిసినా అన్నయ్యను నీళ్లలోకి ఎందుకు తోసావు రా” అని అడుగుతాడు సత్యం. “నేనెందుకు అన్నయ్యను నీళ్లలోకి తోసేస్తాను నాన్న” అంటాడు బాలు అమాయకంగా. “మరేలా పడ్డాడురా” అని అడుగుతాడు సత్యం. “మనోజ్ అన్నయ్యే తోసేసాడు” అంటూ అసలు నిజం చెప్తాడు బాలు. వాడా అంటూ షాకవుతాడు సత్యం.

అల్లాడించిన సీన్.. పాపం బాలు..

అల్లాడించిన సీన్.. పాపం బాలు..
“మరీ నిన్ను పోలీసులు తీసుకువస్తుంటే అప్పుడే ఎందుకు చెప్పలేదు రా” అని తిరిగి ప్రశ్నిస్తాడు సత్యం. “ఒక అన్నయ్య చచ్చిపోయాడు. అమ్మకు నేనంటే ఎలాగో ఇష్టం లేదు. నన్ను ఇంటికి రానివ్వదు. ఇంకా చిన్నన్నయ్య మనోజ్ కూడా జైలుకు వెళ్తే అమ్మకు ముగ్గురు కొడుకులలో ఒక్కరు కూడా లేకుండా పోతారు కదా నాన్నా. అందుకే చెప్పలేదు ” అంటాడు బాలు చాలా అమాయకంగా చూస్తూ కళ్లనిండా నీళ్లతో. దీంతో బాలును గుండెలను హత్తుకోని బోరున ఏడ్చేస్తాడు సత్యం. “నీ వల్ల నష్టాలు కలుగుతాయని మీ అమ్మ అంటుంది. కానీ నీకే ఇన్ని కష్టాలు వస్తాయని ఆలోచించడం మానేసింది” అని మనసులోనే అనుకుంటూ బాధపడతాడు సత్యం.

సత్యం దగ్గర మాట తీసుకున్న బాలు..

సత్యం దగ్గర మాట తీసుకున్న బాలు..
అప్పుడే బాలు కళ్లనిండా నీళ్లతో సత్యం ముందు.. “ఇప్పుడు చిన్నన్నయ్యే చేశాడని ఇంటికి వెళ్లి అమ్మకు చెప్తే అన్నయ్యను కూడా అసహ్యించుకుని నాన్నమ్మ దగ్గర వదిలేస్తుంది. ఇది ఎప్పటికీ అమ్మకు చెప్పను అని ప్రామిస్ చెయ్యు నాన్న” అని సత్యం దగ్గర మాట తీసుకుంటాడు బాలు. అది బాలు, సత్యంల మధ్య దాగిన గతం. మీనా అంతా వింటూ షాక్ అయ్యి.. బాలు మీద జాలితో అలానే నిలబడిపోతుంది. సత్యం మాట్లాడుతూనే ఉంటాడు. “వాడికి పెద్దయ్యాక కూడా అమ్మ ప్రేమ దక్కలేదమ్మా. ఆ బాధలోనే వాడు తాగుడుకు దగ్గరయ్యాడు. మందు తాగి మనసులోని విషాదాన్ని భరించడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడెంత మంచోడో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చెప్పాను.

వాడికి అనువంతం ప్రేమనిస్తే చాలమ్మా...

వాడికి అనువంతం ప్రేమనిస్తే చాలమ్మా…
వాడు చెయ్యని నేరానికి జైలుకు వెళ్లాడు. కానీ ఆ నిజం తెలిస్తే తన అమ్మ తట్టుకోలేదని ఆ పరమేశ్వరుడు విషాన్ని గొంతులో దాచుకున్నట్లు ఆ నిజాన్ని వాడి మనసులోనే దాచుకున్నాడు. ఆ నిజం వాళ్ల అమ్మకు చెప్పకుండా నా దగ్గర మాట తీసుకున్నాడు. కన్నతల్లే ద్వేషిస్తుంటే.. అతడి వ్యక్తిత్వమేంటో అర్థం చేసుకోమని అడిగావు కదమ్మా. ఇదమ్మా.. ఇది నా కొడుకు వ్యకిత్త్వం. వాడు మంచోడు. మంచి మనసున్న గొప్పోడు కాబట్టే.. వాళ్ల అమ్మ ద్వేషానికి పాతికేళ్లుగా కాలిపోతున్నాడు. ఆ బాధతో ప్రతి క్షణం ఎవరికి కనిపించని నరకాన్ని అనుభవిస్తున్నాడు. అమ్మ.. ఎదుటివాళ్లు అనువంత ప్రేమను పంచితే వాడు తిరిగి ఆకాశమంతా ప్రేమను పంచుతాడు. అందుకే ఈ నాన్న అంటే వాడికి అంత ఇష్టం.

బాలు అంటే అదమ్మా.. అర్థం చేసుకో..

బాలు అంటే అదమ్మా.. అర్థం చేసుకో..
అందుకే చిన్నప్పుడు వాడిని పెంచిన నాన్నమ్మ అంటే వాడికి అంత ప్రేమ. చెల్లెలు అంటే తనకు పంచ ప్రాణాలు. నువ్వు అన్నట్లు వాడికి నిజంగా నా వాళ్లు అనే బంధం విలువ తెలియకపోతే .. నేను చెప్పగానే నా మాటకు విలువ ఇచ్చి వాడు నీ మెడలో తాళి కడతాడా చెప్పు. బాలు నా కోడుకు అని గొప్పగా చెప్పట్లేదు. ఇన్నాళ్లు వాడిని దగ్గరుండి చూసినవాడిగా.. వాడి మనసు గురించి చెబుతున్నాను. ఒక్కసారి నువ్వు వాడిని ప్రేమించడం మొదలుపెట్టమ్మ. నువ్వు ఊహించనంత ప్రేమను.. కొన్ని జన్మలకు సరిపడ ప్రేమను వాడు తిరిగి నీకు పంచుతాడు.

ఆనాడు మీనా మనసుని మార్చిన సీన్ ఇదే..

ఆనాడు మీనా మనసుని మార్చిన సీన్ ఇదే..
ఇన్నాళ్లు వాడు ఏ ప్రేమను, ఆప్యాయతను అయితే కోల్పోయాడో.. వాటిని వాడికి నువ్వు అందించు. అప్పుడు ప్రాణం పోయే చివరి క్షణంలో వాడు నీ చెయ్యి వదలకుండా పట్టుకుని ఉంటాడు. అప్పుడు నువ్వే చేప్తావు అమ్మా.. బాలు కంటే మంచి భర్త ఈ లోకంలో నీకు దొరకడు అని. ఇవన్నీ నీకు నేను కన్వీన్స్ చేయడానికి చెప్పట్లేదు. అర్థం చేసుకుంటావని నిజం చెప్పాను. నువ్వు అర్థం చేసుకుంటే వెనక్కి తిరిగి నీ ఇంటికి వెళ్లు. లేదంటే నువ్వు అనుకున్నట్లు మీ పుట్టింటికి వెళ్లు. నేను నిన్ను ఆపనమ్మా. నీ ఇష్టం “అని చెబుతాడు సత్యం. దీంతో మీనా బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతుంది. అలా మీనా మనసుని ఆనాడు సత్యం నిజం చెప్పి.. బాలు గతాన్ని రివీల్ చేసి.. మార్చగలిగాడు. మరి ఇంతకాలం ఇన్ని ఎపిసోడ్స్ పూర్తి అయ్యాయి కాబట్టి.. స్టోరీని ఆసక్తికరంగా మార్చడానికి.. ఒకవేళ మీనాకు బాలు గతం తెలియనట్లుగా చూపించి.. మళ్లీ రివీల్ చెయ్యాలన్న ప్లాన్‌లో ఏమైనా డైరెక్టర్ ఉన్నారో ఏమో కానీ.. నిజమైంతే మీనాకు తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *