రాశిఫలాలు 27 ఏప్రిల్ 2026: ఈరోజు త్రిపుష్కర యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 4 రాశులకు ఆకస్మిక ధన లాభ సూచనలు
horoscope today 27 April 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు మోహినీ ఏకాదశి, త్రిపుష్కర యోగం ప్రభావంతో మేషం, సింహం సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Apr27
horoscope today 27 April 2026; జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వ ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మోహినీ ఏకాదశి వేళ కొన్ని త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. దీంతో పాటు ధ్రువ యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, సింహం సహా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు శివుని అనుగ్రహం లభించనుంది. కొందరు వ్యక్తుల జాతకంలో చంద్రుడి స్థానం కూడా బలపడనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి అధిపతిగా ఉండే కుజుడు ప్రస్తుతం పన్నెండో స్థానంలో మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులలో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు ప్రస్తుతం ఇదే రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీకు శుభ ఫలితాలు రానున్నాయి. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు రావొచ్చు. మీకు కొత్త వ్యాపార భాగస్వాములు దొరికే అవకాశం ఉంది. చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి అధిపతి అయిన బుధుడి ఈ రాశి నుంచి పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో కొంత ఆందోళన పెరగొచ్చు. మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే, మరింత అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి అధిపతిగా ఉండే చంద్రుడు ఈ రాశి నుంచి రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ ఆదాయం గణనీయంగా పెరగొచ్చు. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల నుంచి ప్రోత్సాహకరమైన వార్తలు లభిస్తాయి. మీ కుటుంబంలో వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడు ప్రస్తుతం మేష రాశిలో త్రికోణ ద్రుష్టిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణంగా మీకు అద్భుత ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు బుధుడితో కలయిక కారణంగా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి మనసు గెలుచుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. బుధుడి ప్రభావంతో మీకు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారులు మెరుగైన లాభాలు రావాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు రావొచ్చు. ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి నుంచి అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. మీ ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మీ మానసిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే చంద్రుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి అధిపతి అయిన కుజుడు ఈ రాశి నుంచి పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఆదాయం అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. స్నేహితుల సాయంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు ఈ రాశి నుంచి సప్తమ స్థానంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. మరోవైపు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ సంపద అకస్మాత్తుగా పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందొచ్చు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందే అవకాశం ఉంది.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి అధిపతిగా ఉండే శని దేవుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో, చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నారు ఈ కారణంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి శని దేవుడు రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. శని దేవుని అనుగ్రహంతో మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు వారిపై విజయం సాధించొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి అధిపతి అయిన గురుడు ఈ రాశి నుంచి నాలుగో స్థానంలో మిథునంలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మీ కోరికలలో ఒకటి నెరవేరే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగొచ్చు. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబంతో కొంత సమయం గడపడం వల్ల సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు