Anchor Vishnupriya: విష్ణుప్రియకి నాకు ఎఫైర్ ఉందంటే కళ్లు పోతాయ్.. ఆమె మహా జ్ఞాని, నా శిష్యురాలితో పెళ్లేంటి?: జేడీ చక్రవర్తి
Anchor Vishnupriya: విష్ణుప్రియకి నాకు ఎఫైర్ ఉందంటే కళ్లు పోతాయ్.. ఆమె మహా జ్ఞాని, నా శిష్యురాలితో పెళ్లేంటి?: జేడీ చక్రవర్తి
టాలీవుడ్ హీరోల్లో జేడీ చక్రవర్తి రూటే సెపరేటు. 90 కాలం నుంచి జేడీ పేరు సినిమాల్లో కంటే ఎఫైర్ల విషయంలోనే ఎక్కువగా వినిపించేది. అప్పట్లో హీరోయిన్ మహేశ్వరి మొదలు చాలామంది హీరోయిన్‌లు, ఆర్టిస్ట్‌లతో జేడీ చక్రవర్తికి ఎఫైర్లు ఉన్నాయనే పుకార్లు వినిపించాయి. అయితే ఎప్పుడూ జేడీ బయటపడలేదు. ఆ పుకార్లను నిజం చేయనూ లేదు. తాజాగా ఆయన ‘గాయపడ్డ సింహం’ అనే చిత్రంతో బౌన్స్ బ్యాక్ కాబోతున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా.. వరుస ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ అవుతున్నారు.
Vishnupriya JD Chakravarthy
విష్ణు ప్రియ, జేడీ చక్రవర్తి
బిగ్ బాస్ తరువాత వరుస వివాదాల్లో ఉంటోంది యాంకర్ విష్ణు ప్రియ . ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఇష్యూలో ఆమెపై కేసు నమోదు కాగా.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అనంతరం రీసెంట్‌గా మళ్లీ ఆమెపై మరోకేసు నమోదు అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రైబ్ పేరుతో యువతకి వల వేస్తుందని.. బోల్డ్ కంటెంట్ పేరుతో డబ్బులు సంపాదిస్తుందంటూ ఆరోపణలు రావడంతో.. మళ్లీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విచారణకి హాజరైంది విష్ణు ప్రియ.
ఇక విష్ణు ప్రియ పేరు ఎఫైర్ల విషయంలో కూడా ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఆ లిస్ట్‌లో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి పేరు కూడా ఉండటంతో.. ఆ వార్తల్ని ఖండిచారు జేడీ చక్రవర్తి. మీకు విష్ణు ప్రియకి ఎఫైర్ ఉందనీ.. పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి అంటూ ఓ జర్నలిస్ట్ కూపీ లాగడంతో.. లాగిపెట్టి కొట్టనట్టుగా సమాధానం ఇచ్చారు జేడీ.
విష్ణు ప్రియ గురించి నేనో విషయం చెప్తా.. నాలో మరో యాంగిల్ ఉంది. అదే ఫిలాసఫికల్ సైడ్. విష్ణు ప్రియ నా ప్రియ శిష్యురాలు. విష్ణు ప్రియకి నేను ఫోన్ చేస్తే.. ఏవండీ గురువుగారూ అని మాట్లాడుతుంది తప్ప. అసలు ఆ అమ్మాయికి నాకు అఫైర్ అని అనుకునేటంత దుర్మార్గం మరొకటి ఉండదు. పాపమయ్యా.. తను నా శిష్యురాలు. పైగా మేమిద్దరం పెళ్లి చేసుకోవడమా? ఆ అమ్మాయి నన్ను గురువుగా భావిస్తుంది. శిష్యురాల్ని ఎలా పెళ్లి చేసుకుంటారా? అదంతా అబద్దం.. నిజం కాదు అని క్లారిటీ ఇచ్చాడు.
అయితే ఆయన అంత క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా.. గురు శిష్యులు పెళ్లి చేసుకోకూడదని ఎక్కడైనా రాజ్యాగంలో రాసి ఉందా అంటూ ఆ ఇంటర్వ్యూ చేసిన పనికిమాలిన జర్నలిస్ట్ పనికిమాలిన ప్రశ్న వేశాడు. దాంతో జేడీ చక్రవర్తి ఆ పనికిమాలిన జర్నలిస్ట్‌ని లాగిపెట్టి కొట్టకుండా.. చాలా ఓపిగ్గానే సమాధానం ఇచ్చి వాడి కళ్లు తెరిపించాడు. అసలు ముందు గురుశిష్యుల బంధం ఎలా ఉంటుందో తెలుసుకోమని క్లారిటీ ఇచ్చారు.
గురు శిష్యులు పెళ్లి చేసుకోకూడదని రాజ్యాంగంలో రాయక్కర్లేదు.. ఛ ఛ ఛ.. గురు అంటే విద్య నేర్పించిన వాడు. గురు అంటే అతని దగ్గర కొన్ని క్వాలిటీస్‌ని నేర్చుకోవడం. గురువుని గౌరవించడం అంటే వెళ్లి కాళ్లకి నమస్కారం పెట్టడం కాదు. అలా అయితే సినిమాకి పనిచేసే లైట్ బాయ్‌కి కూడా నమస్కారం పెట్టాలి. డాన్స్ మాస్టర్ మనకి డాన్స్ నేర్పుతుంటే అతని కాళ్లకి నమస్కారం పెడతాం. అది న్యాయమే. కానీ అదే డాన్స్ మాస్టర్ సినిమాల్లో డాన్స్ నేర్పడం మొదలుపెట్టారు. అలా వాళ్లందరికీ దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అది తప్పని అనడం లేదు’ అంటూ చెప్పారు.
అక్కడితో ఆ యాంకర్ ఆపకుండా.. విష్ణుప్రియని మీ శిష్యురాలని అంటున్నారు కదా.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 399 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే.. హాఫ్ న్యూడ్ చూపిస్తానని పెట్టడం వల్ల గొడవలు అయ్యాయి కదా.. మరి మీరు ఫోన్ చేసి మాట్లాడారా? ఎందుకు ఇవన్నీ అని అడిగారా? అని అడిగారు. ఆ ప్రశ్నకి జేడీ రియాక్ట్ అవుతూ.. ‘మీకు ముందే చెప్పాను.. విష్ణు ప్రియ నాకు ఫిలాసఫికల్ సైడ్‌లో మాత్రమే శిష్యురాలు. తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌తో నాకు సంబంధం లేదు. తన లైఫ్ తనది. మనకేం సంబధం? అలా ఉండూ ఇలా ఉండూ .. అది చెయ్ ఇదిచెయ్.. అని చెప్పడానికి? తను నాతో డిస్కస్ చేసేది ఫిలాసఫీ. ఆమెకి విపరీతమైన దైవ భక్తి. విపరీతమైన జ్ఞానం’ అంటూ తన శిష్యురాల్ని తెగ పొగిడేశారు జేడీ చక్రవర్తి.
జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ హీరోలుగా తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ మే 01న థియేటర్స్‌లో విడుదల కానుంది. కశ్యప్ శీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్‌కి మంచి ఆదరణ లభించడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జేడీ చక్రవర్తి ఓ 15 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టుగా కనిపిస్తున్నాడు లుక్స్‌లో. మరి ఈ సినిమాతో జేడీ ఈజ్ బ్యాక్ అనిపించుకుంటారో చూద్దాం.