రాశిఫలాలు 07 అక్టోబర్ 2026: ద్విగ్రాహి యోగం ప్రభావంతో తులా, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధన లాభ అవకాశాలు
రాశిఫలాలు 07 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ద్విగ్రాహి యోగం ప్రభావంతో తులా, ధనస్సు సహా ఈ 5 రాశులకు ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
అప్పుడే మీ కష్టానికి తగిన ఫలితం లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. అంతేకాదు శుభ యోగాల ప్రభావంతో మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
వ్యాపారులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితుల సహకారంతో మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు సాయంత్రం కొన్ని శుభవార్తలు వింటారు.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
మిథున రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. శుభ యోగాల ప్రభావంతో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి పొందే అవకాశం ఉంది. మీ కుటుంబంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. గణేశుని అనుగ్రహం వల్ల మీకు శుభవార్తలు వినిపించొచ్చు.
ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో పురోగతి లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మంచి విజయం సాధించొచ్చు. శుభ యోగాల ప్రభావంతో మీరు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. మీ మాటతీరుతో చాలా మందిని ఆకర్షిస్తారు.
మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ ప్రియమైన వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు గణేష్ మంత్రాలను పఠించాలి.
కన్య రాశి వారికి ఈరోజు ప్రశాంతకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభించొచ్చు. స్నేహితుల సహకారంతో మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వ్యాపారులు మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు వినాయకుని అనుగ్రహం కారణంగా అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించొచ్చు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. మీరు పని నిమిత్తం దూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి మీకు సాయం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది.
పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీకు అకస్మాత్తుగా డబ్బు, సంపద లభించే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ మానసిక బలం కూడా పెరగొచ్చు. మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా చాలా మంచిగా ఉంటుంది.
పరిహారం : ఈరోజు గణేష్ మంత్రాలను పఠించాలి.
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. తోబుట్టువులతో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
మీ కుటుంబ జీవితంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించాలి.
పరిహారం : ఈరోజు వినాయకుని ఆలయంలో దానధర్మాలు చేయాలి.
మకర రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఆకస్మిక పురోగతి లభించే అవకాశం ఉంది.
శుభ యోగాల ప్రభావంతో మీకు అనేక కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీకు తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయం సాధిస్తారు.
కుంభ రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి. మీరు ధైర్యంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పరిహారం : ఈరోజు శని చాలీసా పఠించాలి.
మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు కొన్ని ప్రయత్నాల ద్వారా నష్టం చవిచూడొచ్చు. మరోవైపు ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది.
మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు. ఆస్తి, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన వివాదాలు సమస్యలకు దారితీయొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.