రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: ధ్రువ యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

 రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: ధ్రువ యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: ధ్రువ యోగం ప్రభావంతో మిథునం, కన్య సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి!

రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధ్రువ యోగం ప్రభావంతో మేషం సహా ఈ 5 రాశులకు శివయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

రాశిఫలాలు 28 సెప్టెంబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు ధ్రువ, వ్యాఘతా యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఇది శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. ఈ శుభ సమయంలో మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభ యోగాల ప్రభావంతో మెరుగైన ఫలితాలు లభించొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చంద్రుడు మీనం నుంచి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఈ కారణంగా వ్యాపారులకు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నాయి. అంతేకాదు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. సమాజంలో మీకు కీర్తి, మర్యాదలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహం కూడా బాగా పెరిగే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు కొత్త ప్రణాళికలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు పుణ్యక్షేత్రాల సందర్శన వల్ల మీ మనసులో సంతోషకరంగా ఉంటుంది. రోజు చివరి భాగంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ, మీ ధైర్యం పెరుగుతుంది.

మీ కుటుంబంలో ఆనందకరమైన మరియు శుభప్రదమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. మీరు చేసే పని ప్రదేశంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారికి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు ఇష్టపడే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలు కూడా స్ఫూర్తిని ఇవ్వొచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నించాలి.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. మీ తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాలను పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా సంతోషకరంగా ఉంటుంది. మీరు ఏ పనిని అంకితభావంతో చేసినా, తక్షణ ఫలితాలను పొందొచ్చు. పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సహోద్యోగుల నుంచి సహకారం లభించొచ్చు. మీరు చేసిన పనికి గొప్ప ఫలితాలు రావొచ్చు.

మీ వైవాహిక జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు బయటి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకండి. వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాల కోసం కొంత సమయం కేటాయించుకోవడం మంచిది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవచ్చు. సహోద్యోగులు మీ పనులకు ఆటంకం కలిగించొచ్చు.

మరోవైపు ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడొచ్చు.

పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ మాటల్లో సంయమనం పాటించాలి. ఇతరులతో విభేదాలకు దిగకుండా జాగ్రత్త వహించాలి. మీ ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు తలెత్తొచ్చు.

మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. ఈరోజు రాత్రికి పరిస్థితులు మెరుగయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చంద్రుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల మీకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

మీ ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు చాలా చురుగ్గా ఉండాలి. మీ కుటుంబంలో శాంతి, స్థిరత్వాన్ని ఆస్వాదించాలి.

ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మంచి సహకారం పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీరు చేసే పనిలో కొత్త ఉత్సాహం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు ఒక చిన్న సాహసం చేయడం వల్ల మంచి లాభాలు పొందొచ్చు.

మీ ప్రియమైన వారి కోసం కొంత డబ్బును ఏర్పాటు చేయాల్సి రావొచ్చు. ఒక కొత్త అవకాశం త్వరలోనే రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఒకేసారి అనేక పనులు చేయాల్సి రావడం ఆందోళనను పెంచుతుంది.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు శుభవార్తలు వినిపించే అవకాశాలున్నాయి. శివయ్య అనుగ్రహం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడటంతో మంచి ఫలితాలు రావొచ్చు. కొత్తగా పెళ్లయిన వ్యక్తులు సంతానం విషయంలో కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి అద్భుతమైన లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ మానసిక స్థితిలో చాలా మెరుగుదల కనిపిస్తుంది.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో ఆరోగ్య మార్పుల వల్ల జలుబు సంబంధిత సమస్యలు తలెత్తొచ్చు. మీరు ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండకూడదు.

మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో మెరుగ్గా ఉంటుంది.

పరిహారం : ఈరోజు శని చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు కొంత రిస్క్ తీసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు. ఈ సమయంలో మీరు సహనంతో వ్యవహరించాలి. మీ తెలివితేటలతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు.
వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *