రాశిఫలాలు 09 జూలై 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు రెండింతల లాభాలు

 రాశిఫలాలు 09 జూలై 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు రెండింతల లాభాలు

రాశిఫలాలు 09 జూలై 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాశులకు రెండింతల లాభాలు

horoscope today 09 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి, సమ, హంస రాజ యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Jul9
horoscope today 09 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు, చంద్రుడి ప్రభావంతో దురధర యోగం, కర్కాటక రాశిలో గురుడు హంస రాజయోగం, చంద్రుడికి గురుడు నాలుగో స్థానంలో ఉండటం కారణంగా గజకేసరి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం, మిథునం సహా ఈ రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. అనేక శుభ యోగాల కారణంగా పనిలో మీ ఉత్సాహం పెరుగుతుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది.

మీడియా, కళా రంగాలలో పని చేసే వారికి ప్రశంసలు లభించొచ్చు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారులు తమ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

 వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వ్యాపారులు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు రావొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి చంద్రుడు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉది. ప్రభుత్వ పనులలో పని చేసే వ్యక్తులకు మంచి ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మీ బంధువుల నుంచి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. గజేంద్ర మెక్షం పఠించడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు బంధువుల సహాయంతో అనేక పనులు పూర్తి చేస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంద. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీకు మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే మీరు ప్రశాంతమైన మనసుతో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు.

మీకు పాత అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజంతా మీకు అనేక రంగాల్లో గందరగోళంగా ఉండొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు గురు గ్రహం అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలొస్తాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈ రాశికి అధిపతిగా ఉండే శుక్రుడు 11వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

టెక్నాలజీ రంగంలో పని చేసే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు తల్లిదండ్రులు, పెద్దల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. అయితే బయటి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీకు కొందరు స్నేహితులు శత్రువులుగా మారొచ్చు. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఏ పనిలోనూ అజాగ్ర్తత్తగా ఉండకపోవడమే మంచిది. లేదంటే మీరు పశ్చాత్తాపపడాల్సి రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. కొత్త వ్యక్తులను అతిగా నమ్మడం మానుకోవాలి. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందొచ్చు.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ తల్లిదండ్రుల నుంచి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సామరస్యం ఉంటుంది. మీ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటారు.

గురు గ్రహం ప్రభావంతో మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారి సాయంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలొచ్చ అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.

ఈరోజు మీరు చేసే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో లాభదాయకంగా ఉంటుంది. అనేక శుభ యోగాల ప్రభావంతో మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ఇతరుల వ్యవహారాలలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.

మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. అయితే మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *