రాశిఫలాలు 05 జూలై 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం వేళ వృషభం, తులా సహా ఈ రాశులకు ఏ రంగాల్లో ప్రయోజనాలు?

 రాశిఫలాలు 05 జూలై 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం వేళ వృషభం, తులా సహా ఈ రాశులకు ఏ రంగాల్లో ప్రయోజనాలు?

రాశిఫలాలు 05 జూలై 2026: ఈరోజు ఆయుష్మాన్ యోగం వేళ వృషభం, తులా సహా ఈ రాశులకు ఏ రంగాల్లో ప్రయోజనాలు?

horoscope today 05 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆయుష్మాన్ యోగం ప్రభావంతో తులా సహా ఈ 5 రాశులకు అనేక రంగాల్లో ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

horoscope today 05 July 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు ఉభయచారి యోగాన్ని ఏర్పరస్తుండగా, గురుడు కర్కాటక రాశిలో హంస రాజయోగాన్ని ఏర్పరస్తున్నాడు. దీంతో పాటు ఆయుష్మాన్ యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా కన్య, తులా సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు ఆలోచించకుండా డబ్బును పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఒంటరిగా పని చేయడం కంటే అందరితో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు రావొచ్చు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి సాధించొచ్చు. కొత్త ప్రాజెక్టులలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. అయితే మీ ఖర్చులు పెరగొచ్చు. మీరు విలాసాల కోసం ఎక్కువగా ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి గురుడు రెండో స్థానంలో హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాల వైపు ఆసక్తి చూపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. మీరు అవనసరమైన ఖర్చులను నియంత్రించగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీకు దగ్గరి బంధువులను కలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి రాబడి లభించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు రావాల్సిన బకాయిలు మరింత ఆలస్యం కావొచ్చు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. బుధుడు ఇదే రాశిలో ఉండటం వల్ల కొంత గందరగోళం ఏర్పడొచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడి సంచారం కారణంగా మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. పెండింగ్ పనులు తిరిగి ప్రారంభం కావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడొచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీరు చేసిన పనికి ప్రశంసలు లభించొచ్చు. మీ కుటుంబంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తవ్వొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు కొన్ని ఒప్పందాల కారణంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు. బట్టలు, విలాసవతమైన వస్తువుల కోసం ఎక్కువ ఖర్చులు చేయొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేసే పనులకు అందరి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు లాభాల కోసం మరింత కష్టపడాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోవచ్చు. దీంతో మీరు సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయం గడపొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నివారించాలి. మీ బడ్జెట్‌కు తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి పెట్టుబడులను ప్రణాళిక చేసుకోవడానికి ఈ సాయంత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి ప్రభావంతో మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా రచనా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రావొచ్చు. ఏదైనా పేమెంట్ చేసే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. శుక్రుడి ప్రభావంతో మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. ఈరోజు మీరు చాలా ఓపికగా ఉండాలి. అప్పుడే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు పొదుపు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుభవం ఉన్న వారితో సలహాలు తీసుకుని అడుగులు ముందుకు వేయాలి. బుధ గ్రహ ప్రభావంతో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారు ఈరోజు శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు చేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. మీరు దగ్గరి బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. మీకు రాజకీయ, సామాజిక సంబంధాల నుంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అయితే మీరు ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబం నుంచి, మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు పని నిమిత్తం కొంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సమస్యలన్నింటికీ పరిష్కారం లభించొచ్చు. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. శుభ యోగాల కారణంగా మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *