July Horoscope 2026: జూలై నెలలో సూర్య, బుధ, శుక్ర గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు, ఎవరికి సవాళ్లు?

 July Horoscope 2026: జూలై నెలలో సూర్య, బుధ, శుక్ర గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు, ఎవరికి సవాళ్లు?

July Horoscope 2026: జూలై నెలలో సూర్య, బుధ, శుక్ర గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు, ఎవరికి సవాళ్లు?

July Horoscope 2026: జూలై నెలలో సూర్యుడు, బుధుడు, శుక్ర గ్రహాల ప్రభావంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

July Horoscope 2026: జూలై నెలలో గ్రహాల స్థానాల మార్పు, తిరోగమనంతో పాటు నక్షత్రాల స్థాన మార్పు కారణంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. కొందరికి శుభ ఫలితాలు రానుండగా, మరికొందరికి కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ సమయంలో జూలై 4న శుక్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. అనంతరం బుధుడు జూలై 7న బుధుడు, జూలై 16న సూర్యుడు తమ స్థానాలను మారనున్నారు. దీంతో పాటు కుజుడు, గురుడి ప్రభావంతో మిథునం, సింహం సహా కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి(Aries)

మేష రాశి(Aries)

మేష రాశి(Aries)
​మేష రాశి వారికి జూలై నెల ప్రారంభంలో కొంత గందరగోళంగా ఉండొచ్చు. ఈ కాలంలో వ్యాపారులు తాము చేసే పనులన్నింట్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. నెల చివర్లో మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు మీ కుటుంబ జీవితానికి సంబంధించి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోవచ్చు.

వృషభ రాశి(Taurus)
వృషభ రాశి(Taurus)

వృషభ రాశి(Taurus)
​వృషభ రాశి వారికి జూలై నెలలో శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు చేసే పనుల్లో గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీరు అనుకున్నపనులు సకాలంలో పూర్తవ్వొచ్చు. మీ పెండింగ్ పనులు కూడా ఊపందుకుంటాయి. వ్యాపారులు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుం సభ్యుల మధ్య ఉండే విభేదాలన్నీ తొలగిపోతాయి. పిల్లలకు సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తీసుకోవడం మానేయాలి.

మిథున రాశి(Gemini)

మిథున రాశి(Gemini)
జూలై మాసంలో మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చిన్న చిన్న విషయాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే చిన్నపాటి అజాగ్రత్త కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. నెల ప్రారంభంలో మీ శక్తి, సామర్థ్యాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. మరోవైపు నెల మధ్య నుంచి చివరి వరకు వ్యాపారులు కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో రెండో వారంలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని ఉద్రిక్తతలు తలెత్తొచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కర్కాటక రాశి(Cancer)

కర్కాటక రాశి(Cancer)
కర్కాటక రాశి వారికి జూలై నెల ప్రారంభంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా కాలంగా ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించడానికి లేదా మీ పనిలో పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తుంటే, అందులో మీకు విజయం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో మెరుగైన సమన్వయం కలిగి ఉంటారు. నెల ప్రారంభంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీంతో మీ సంబంధాలు బలపడే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

సింహ రాశి(Leo)

సింహ రాశి(Leo)
సింహ రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. నెల ప్రారంభంలో వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు నెల మొదటి భాగంలో శుభవార్తలు వినిపించొచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. రెండో వారంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది.

కన్య రాశి(Virgo)

కన్య రాశి(Virgo)
కన్య రాశి వారికి జూలై నెలలో అత్యంత శుభప్రదంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. మొదటి వారంలో వ్యాపార ప్రయోజనాల కోసం సుదూర ప్రయాణం చేయాల్సి రావొచ్చు. యువతకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలొస్తాయి. మీ అప్పులను తీర్చే అవకాశం ఉంది. మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

తులా రాశి (Libra)

తులా రాశి (Libra)
జూలై నెలలో తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు వేగంగా పనులు పూర్తి చేయొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలు భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. నెల మధ్యలో, ఒక కొత్త ప్రాజెక్టులో చేరే అవకాశాలున్నాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయొచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రేమ సంబంధాలకు మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని నివారించడానికి, అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి(Scorpio)

వృశ్చిక రాశి(Scorpio)
వృశ్చిక రాశి వారికి జూలై నెలలో సాధారణంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. నెల ప్రారంభంలో పనికి సంబంధించి కొన్ని సవాళ్లు తలెత్తొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో కొంత అసౌకర్యం కలగొచ్చు. సహోద్యోగులు, సన్నిహితుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంయమనం పాటించాలి. మీ ప్రేమ సంబంధాలు బలపడొచ్చు. మీ ప్రేమ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ సమయంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీకు శారీరకంగా బలహీనంగా అనిపించొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి (Sagittarius)

ధనస్సు రాశి (Sagittarius)
ధనస్సు రాశి వారికి జూలై నెలలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ప్రతి పనిని జాగ్రత్తగా చేయాలి. నెల ప్రారంభంలో మీరు పని నిమిత్తం చిన్న లేదా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు సహోద్యోగులతో విభేదాలను నివారించడం మంచిది. పెండింగులో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయడం చాలా కీలకం. మీ కుటుంబ జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తొచ్చు. మీ ప్రేమ సంబంధాలలో తొందరపాటు లేదా అహంకారాన్ని నివారించాలి. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వాహనం నడపాలి. ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.

మకర రాశి(Capricorn)

మకర రాశి(Capricorn)
మకర రాశి వారికి జూలై నెలలో సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. భూమి, భవనాలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించి పాత వివాదాలు నెల ప్రారంభంలో పరిష్కరించబడతాయి. ఒక ప్రభావవంతమైన వ్యక్తి సాయంతో చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తి కావొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్తగా పెట్టుబడి లేదా విస్తరణను ప్లాన్ చేస్తుంటే, ముందుగా అనుభవం, శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే నిరంతరం పని ఒత్తిడి కారణంగా మానసిక అలసటకు కారణం కావొచ్చు. ఈ సమయంలో అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి.

కుంభ రాశి(Aquarius)

కుంభ రాశి(Aquarius)
కుంభ రాశి వారికి జూలై నెలలో సాధారణంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి రావొచ్చు. ఎందుకంటే మీరు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేసే పనిలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈ నెలలో అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ఇది మీ బడ్జెట్‌పై ప్రభావం చూపొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారొచ్చు. మీకు మానసికంగా ఒత్తిడి పెరగొచ్చు. ఆరోగ్య పరంగా గణనీయమైన మార్పులు రావొచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఈ సమయంలో ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి.

మీన రాశి(Pisces)

మీన రాశి(Pisces)
జూలై నెలలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ నెల ప్రారంభంలో పని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని పెద్ద సవాళ్లు ఎదురుకావొచ్చు. ఈ కారణంగా మానసిక ఒత్తిడి కలగొచ్చు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ కాలంలో భూమి, భవనాలు లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు ఒక ప్రభావవంతమైన వ్యక్తి సాయంతో పరిష్కరించబడొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులతో కొన్ని అపార్థాలు లేదా ఉద్రిక్తతలు తలెత్తొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *