రాశిఫలాలు 21 జూన్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు ఊహించని విజయాలు దక్కనున్నాయా?

 రాశిఫలాలు 21 జూన్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు ఊహించని విజయాలు దక్కనున్నాయా?

రాశిఫలాలు 21 జూన్ 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు ఊహించని విజయాలు దక్కనున్నాయా?

horoscope today 21 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో కర్కాటకం సహా ఈ 5 రాశులకు అన్ని పనుల్లో మంచి విజయం దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel Jun21

horoscope today 21 June 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. మరోవైపు గురుడు, శుక్రుడి కలయిక వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. సూర్యుడి స్థానం కూడా బలపడుతుంది. అంతేకాదు సిద్ధి యోగం, వ్యాతీపత యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మేషం, కర్కాటకం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు తాము చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మంచి ప్రవర్తనతో సాధారణ వాతావరణాన్ని కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభించొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారవేత్తలకు భారీ ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. మీ ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో బలమైన సంబంధాన్ని కలిగి ఉంటారు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. పనికి రాని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించకూడదు. పనికి సంబంధించి చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం కావొచ్చు. కెరీర్ పరంగా మీకు గొప్ప పురోగతి సాధించొచ్చు. మీకు అప్పుల నుంచి విముక్తి లభించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అధికారులకు కొత్త బాధ్యతలు లభించొచ్చు. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి సిద్ధి యోగం ప్రభావంతో ఈరోజు అన్ని రంగాల్లో మంచి విజయం లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి ఫలితాలు సాధించొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లభించొచ్చు. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావొచ్చు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా బలపడొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వింటారు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేసిన పనులకు ప్రశంసలు లభించొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ ఖర్చులు పెరగొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ ప్రకారం ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు చేసే పనిలో అభిప్రాయ భేదాలు రావొచ్చు. మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరగొచ్చు. మీ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు తాము చేసే పనిలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఈరోజు ఖర్చు పెట్టే ముందు బాగా ఆలోచించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు అదృష్టం పెరిగే అవకాశం ఉంది. మీకు పనిభారం తగ్గుతుంది. మీరు శారీరక అలసట, ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ సోదరుడు, భార్యతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ సమస్యలకు పరిష్కారం లభించొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈరోజంతా మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటే, కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారవేత్తల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించొచ్చు.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందడంతో పాటు సంతోషకరమైన క్షణాలను గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభించొచ్చు. అంతేకాకుండా మీ జీవితంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈరోజు సూర్య భగవానుడిని పూజించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనిలో ఒత్తిడి పెరగొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అకస్మాత్తుగా ఒక చిన్న ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మెరుగైన లాభాలు రావొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టమైన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. మీ బాధ్యతలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించొద్దు. పనికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. పని, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. మరోవైపు ఆరోగ్య పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుపుతారు. మీ లక్ష్యాలను సాధించడంపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శుభ యోగాల కారణంగా మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. మీరు చాలా ధైర్యంగా ఉండాలి. అంతేకాకుండా, జీవితంలో ముందుకు సాగడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది. మీరు ఏదైనా ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *