Podarillu Serial Today June 15th Episode: ఇంట్లో అందరి ముందే తిట్టేసిన మహా.. గొడవలో కేశవని కొట్టిన చక్రి.. రాత్రంతా కారులోనే
Podarillu Serial Today June 15th Episode: ఇంట్లో అందరి ముందే తిట్టేసిన మహా.. గొడవలో కేశవని కొట్టిన చక్రి.. రాత్రంతా కారులోనే
Podarillu Serial 2026 June 15th Episode Preview పొదరిల్లు సీరియల్లో సోమవారం నాడు ఎమోషనల్ సీన్స్ వచ్చాయి. మహాలక్ష్మీ తన ఆఫీసులో జరిగిన దానికి, వచ్చి గొడవ చేసిన దానికి చక్రిని పిచ్చి పిచ్చిగా తిట్టేస్తుంది. ఇక మహా తిట్టిన విషయాన్ని తెలుసుకుని కేశవ మరింతగా చక్రిని రెచ్చగొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. కేశవను లాగి పెట్టి కొడతాడు చక్రి. రాత్రి పూట ఇంటికి రాకుండా.. బయట కారులోనే పడుకుంటాడు చక్రి. దీంతో ఉదయాన్నే మహా ఫోన్ చేయడంతో కాస్త కూల్ అవుతాడు చక్రి. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

ఆఫీసులో నన్ను ఎవ్వరూ తిట్టలేదు.. ఆఫీస్ బాయ్‌ని తిట్టారు.. ఏం తెలుసుకోకుండా ఆఫీసుకి వచ్చి ఓ జులాయిలా, రౌడీలా ప్రవర్తిస్తారా?.. నన్ను ఇక్కడ ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా? నా తప్పు లేకుండా తిడితే, చీప్‌గా చూస్తే నేను ఎందుకు ఇక్కడ పని చేస్తాను.. కాస్తైనా ఆలోచించాలి.. అని మహా తిట్టిన తిట్టు తిట్టకుండా చక్రిని తిడుతుంది. మిమ్మల్ని మీ బాస్ మీకు పని రాదని తిట్టాడు కదా.. అని చక్రి అంటే.. నా బుద్ది తక్కువై.. ఆఫీస్ విషయాలు మీకు చెప్పాను.. మీరు వెళ్లండి నాకు చాలా పని ఉందని మహా అంటుంది. ఇంత తక్కువ జీతం ఇచ్చి అంత పని చెబుతున్నారా? ఇంత తక్కువ జీతానికి అంత తగ్గి మీరు పని చేయాలా? అని ఇలా చక్రి ఏదేదో వాగుతుంటాడు. దీంతో మహాకి కోపం వస్తుంది. ఇంక ఒక్క మాట మాట్లాడితే నేను బృందావనంలోకి రాను అని మహా అంటుంది. చక్రిని కారు వద్దకు లాక్కెళ్లి.. కారు ఎక్కి వెళ్లండని ఫైర్ అవుతుంది మహా. వెళ్లిపోండి అని చిరాగ్గా చెబుతుంది మహా. దీంతో చక్రి వెళ్లిపోతాడు.
విక్కీ సలహాలు..
అయ్యో ఆఫీసులో తల ఎలా ఎత్తుకుని తిరగాలి.. ఇతను ఎవరు అంటే ఏం సమాధానం చెప్పాలి అని మహా భయపడుతుంది. ఇంతలో విక్కీ వచ్చి.. ఎవరతను.. అలా ప్రవర్తిస్తున్నాడు అని మహాని అడుగుతాడు. నేను వాళ్ల ఇంట్లోనే ఉంటాను.. వాళ్లకి నేను ఉద్యోగం చేయడం నచ్చదు.. కుమార్ సరే నన్నే తిడుతున్నాడు అని అనుకుని వచ్చాడు.. సారీ అని మహా అంటుంది. నీకు పని రాదని నేను అన్నానా? అని విక్కీ అడుగుతాడు.. ఆఫీసు విషయాలు.. హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి.. లంచ్ బాక్సులో ఇంటి విషయాలు పెట్టుకుని ఆఫీసుకి రావొద్దు అని చెప్తాడు విక్కీ . సారీ అని మహా అంటుంది.
తిప్పించుకుని చెప్తా..
కేశవని ఎందుకు అలా తిట్టి పంపించావే అని శైలుని కీర్తి అడుగుతుంది. ఇన్ని రోజులు వాడంటే ఇష్టం అన్నావ్.. చుట్టూ తిరిగావ్.. ఒక్క దెబ్బ కొడితే అన్నీ మర్చిపోయావా? ఇక ప్రేమించవా? అని శైలుని ప్రశ్నిస్తుంది. వాడు నన్ను ఎంత తిప్పుకున్నాడు.. వాడ్ని కూడా అలా తిప్పుకుని.. టార్చర్ పెట్టి.. ఆ తరువాత నా ప్రేమ సంగతి చెప్తాను అని శైలు అంటుంది. అప్పటి వరకు పాపం అని కీర్తి అంటుంది. నన్ను ఎప్పుడైనా పాపం అన్నావా? తిరగనివ్వు.. బాగానే ఉంటుంది.. అని శైలు అంటుంది. ఇంకో వైపు రాత్రి పూట మహా వచ్చీ రాగానే చక్రి వచ్చాడా? అని పెద్దిని అడుగుతుంది.
ఏం జరిగింది..
మహాలక్ష్మీ ఎందుకు అలా ఉంది రా అని కన్నా గాడ్ని పెద్ది అడుగుతాడు. నాకు కూడా అర్థం కావడం లేదు.. బస్ దిగినప్పటి నుంచీ అలానే ఉంది అని కన్నా అంటాడు. ఏమైందమ్మా అలా ఉన్నావ్.. బస్సులో ఇబ్బందిగా అనిపించిందా.. అని కాఫీ ఇస్తూ మహాని అడుగుతాడు పెద్ది. రెండు స్టాపుల తరువాత సీటు దొరికింది అని మహా అంటుంది. ఈ సమస్యకి సోల్యూషన్ చెప్పా కదా.. నేను రోజూ పికప్ డ్రాపింగ్ చేస్తాను అన్నా.. కానీ మేడం గారు వినడం లేదు అని చక్రి అంటాడు. ఈ రోజు ఆఫీస్‌లో ఎంట్రీకి అందరూ అదిరిపోయి ఉంటారు అని చక్రి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు.
మహా ఆగ్రహం..
నువ్వు ఆఫీస్‌కి వెళ్లావా?.. ఎందుకు వెళ్లావ్.. ఏం అయింది అని పెద్ది అడుగుతాడు. నిన్న జరిగింది చెప్పాను కదా.. ఆఫీసులో ఒకరు మహాలక్ష్మీని తిట్టారు అని.. ఈ రోజు మళ్లీ ఫోన్లో తిట్టారు.. అది విని నేను వెళ్లాను.. ఒక్కొక్కడ్ని ఆడుకున్నాను అని చక్రి కాస్త ఓవర్ చేస్తాడు. ఇక ఆ మాటలకు మహా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మీకు అసలు బుద్ది ఉందా? ఆఫీసుకి వచ్చి అలా రౌడీలా అరుస్తారా? ఎక్కడికి వచ్చాం.. ఎలా మాట్లాడాం.. అసలు ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు?.. రోడ్డు మీద గొడవ పడినట్టు పడుతున్నారు.. ఇంట్లో కూడా అందరికీ ఏదో ఘన కార్యం సాధించినట్టుగా చెబుతున్నారు..
స్టాప్ ఇట్.. అని గట్టిగా
నన్ను ఏదో ఉద్దరించినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నారు.. కాస్తైనా బుద్ది ఉండాలి.. మీ రౌడీయిజం ఏమైనా ఉంటే బజారులో చూపించుకోండి.. నేను పని చేసే చోట కాదు.. అని మహా అంటుంది. నేను రావడం వల్ల వాళ్లు భయపడి ఇంకెప్పుడూ మిమ్మల్ని ఏమీ అనరని అనుకున్నాను అని చక్రి అంటాడు. స్టాప్ ఇట్.. అని గట్టిగా అరుస్తుంది మహా. నేను పని చేసే చోటకు రావడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు.. ఎందుకు వచ్చారు.. ఎందుకు అందరి మీద అరిచారు.. సడెన్‌గా ఒకడు వచ్చి అలా చేస్తే ఎలా.. డీసెన్సీ అనే పదానికి అర్థం తెలుసా? అని మహా పిచ్చి పిచ్చిగా తిడుతుంది.
రౌడీలను తీసుకు వచ్చి బెదిరించే దానిలా..
మీ ఆఫీస్ మీ ఆఫీస్ అని అంటారు.. నాకు రైట్స్ లేవని అంటారు.. అని చక్రి రివర్స్‌లో అడుగుతారు. ఇప్పటికీ మీది తప్పని రియలైజ్ అవ్వడం లేదు.. ఆఫీస్ బాయ్‌ని తిడితే నన్ను తిట్టారని మీరు అనుకున్నారు.. మీకు అసలు బుద్ది ఉందా? రౌడీలా ప్రవర్తిస్తావా? రౌడీలను తీసుకు వచ్చి బెదిరించే దానిలా అయిపోయా? అని మహా చీ కొట్టి వెళ్తుంది. సారీ పెద్ది అని లోపలకు వెళ్తుంది మహా. ఇలా చేస్తావా? అని కన్నా గాడు, పెద్ది కూడా చక్రిని అంటారు. దీంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు చక్రి. ఇదంతా బయటి నుంచి వింటూ ఇంకా తిట్టు అని నారాయణ అంటుంటాడు.
చక్రిని రెచ్చగొట్టిన కేశవ..
ఇంతలో కేశవ కూడా వస్తాడు. ఇక జరిగిన విషయాన్ని కన్నా చెబుతుంటాడు. ఇక ఆపరా అని చక్రి ఫైర్ అవుతాడు. వాడి మీద ఎందుకు అరుస్తున్నావ్.. నువ్వు చేసిందే కదా చెప్పాడు.. మహా సైడ్ నుంచి ఆలోచిస్తే నువ్వు చేసింది తప్పే అని పెద్ది అంటాడు. నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? తాయారు అత్త మన ఇంటి మీదకు వచ్చినట్టుగా.. నువ్వు ఆఫీసుకి వెళ్లి రౌడీలా చేసి వచ్చావ్.. నిన్ను సొంత భర్త అని కూడా అనుకోదు.. సొంత భార్య అయినా సరే.. ఆఫీసుకి ఇలా వెళ్లి గొడవ చేస్తే ఎలా ఉంటుంది.. కొంచమైనా ఆలోచించావా? అని చక్రిని తిడతాడు కేశవ.
చక్రి, కేశవ గొడవ..
నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా రా బండోడా.. ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు.. రెండు సార్లు మాట్లాడితే.. మూడో సారీ చీ కొట్టి పోతారు.. అని చక్రి అంటాడు. దీంతో కేశవకి కోపం వచ్చి చక్రి కాలర్ పట్టుకుంటాడు. నేను నీలాగా బిల్డప్‌లు ఇవ్వను.. అందుకే నిన్ను ఇప్పటికీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతోంది అని కేశవ అంటాడు. నా విషయంలోకి వస్తే నీ కాళ్లు విరగ్గొడతాను అని చక్రి వార్నింగ్ ఇస్తాడు. నిన్ను రౌడీల నుంచి కాపాడం.. అది మా తప్పు రా అని కేశవ అంటాడు. దీంతో కేశవను కొడతాడు చక్రి. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. పెద్ది, కన్నా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు.
ఎందుకు రా చక్రిని రెచ్చగొడుతున్నావ్..
ఏం జరిగినా నాదే తప్పు.. ఒక్కరైనా నా గురించి, నా వైపు నుంచి ఆలోచించారా? అని చక్రి అంటాడు. నువ్వు సుద్ద పూసవి.. సంబంధం లేని దాంట్లో దూరి తూ అనిపించుకుంటున్నావ్ అని చక్రిని అంటాడు కేశవ. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు మాట్లాడినా ఇద్దరినీ కొడతాను.. నువ్వు ఎందుకు రా చక్రిని రెచ్చగొడుతున్నావ్.. మహా తిట్టింది.. నేను కూడా తిట్టాను.. నువ్వు మళ్లీ వచ్చి ఎక్కువ చేస్తున్నావ్ ఏంటి? అని పెద్ది ప్రశ్నిస్తాడు. ఈ గొడవ సంగతి తెలిస్తే మహాలక్ష్మీ ఇంకా బాధపడుతుంది.. ఆపండని అంటాడు. పక్కనే ఉండి కాళ్లు లాగే వాళ్లతో ఎలా ఉండాలని ఇంట్లోంచి వెళ్లిపోతాడు చక్రి.
అక్కడ మాట్లాడే దమ్ముందా?
గుమ్మం వద్ద నారాయణ పాటలు వింటూ ఉంటాడు. రేడియోలో పాటలు వింటున్నావా? అని రేడీయోని పగలగొట్టాని చక్రి చూస్తాడు. ఇలా అక్కడ దమ్ము చూపించగలవా? అక్కడ అరవగలవా? భార్యని ఎలా గ్రిప్‌లో పెట్టుకోవాలో తెలీదు.. అమ్మాయితో ఎలా ఉండాలో తెలీదు.. ఏది ఇష్టమో.. ఇది ఇష్టం కాదో తెలుసుకుని ప్రవర్తించాలి.. దగ్గరవ్వాలి.. నీ భార్యని నువ్వు దూరం చేసుకుంటే నీ ఇంత పిచ్చోడు ఇంకెవ్వరూ ఉండరు.. అని నారాయణ అంటాడు. ఇంత వరకు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచింది.. అసలు ఈ ఇంట్లో ఉంటారా? ఇది నరకం అని అంటాడు చక్రి. అయితే వెళ్లిపో అని నారాయణ అంటాడు. దీంతో చక్రి బయటకు వెళ్లిపోతాడు.
బుస్సు గురించి టాపిక్..
తినడానికి అందరూ కూర్చుంటారు. చక్రి కోసం మహా చూస్తుంది. చక్రి ఎక్కడికి వెళ్లాడో అని పెద్ది ఫోన్ చేస్తాడు. కానీ చక్రి మాత్రం ఫోన్ కట్ చేస్తాడు. దీంతో పెద్ది బయటకు వెళ్లి చూస్తాను.. మీరు తినండని అంటాడు. మహా, కన్నా, కేశవ తింటూ బుస్సు గురించి మాట్లాడతారు. సారీ చెప్పారా? అని మహా అడిగితే.. జరిగిన విషయం అంతా చెబుతాడు కేశవ. అసలు గ్యాప్ ఇవ్వలేదంటి.. తిడుతూనే ఉంది.. అది నిజంగానే బుస్సు.. తింగర్ది అని కేశవ అంటాడు. నిజంగానే మీ మధ్య ఏమీ లేదా? అని మహా అడుగుతుంది. ఇంతలో పెద్ది వచ్చి ఏం లేదు.. కూరలో ఉప్పు, కారం లేదా? అని అడుగుతాడు. అదేం లేదు అన్నీ బాగానే ఉన్నాయని అంటారు.
కారులో చక్రి బాధలు..
కారులో పడుకున్న చక్రిని దోమలు కుడుతుంటాయి. అందరూ నా రక్తాన్నే తాగండి.. ఇందులో నా తప్పేం ఉంది.. తన మంచి కోసం చేస్తే.. అందరూ కలిసి నన్ను చెడ్డవాడ్ని చేస్తున్నారు.. వాళ్లు నన్ను ఇంట్లోంచి పంపించి.. వాళ్లు మాత్రం హాయిగా పడుకుని ఉంటారు.. ఇక్కడ నన్ను ఈ దోమలు చంపేస్తున్నాయి.. అని చక్రి కారులో కూర్చుని బాధపడుతుంటాడు. ఇంకో వైపు చదువుకోవడం పూర్తయ్యాక.. చక్రి ఇంకా రాలేదే అని మహా అనుకుంటుంది. ఇంకా రాలేదా? అని మహా ఫోన్ చేయాలని చూస్తుంది. వద్దు లే.. ఇంకాసేపు చూద్దాం అని మహా అనుకుంటుంది. కనీసం నాకు ఫోన్ కూడా చేయడం లేదు అని మహాని తల్చుకుని చక్రి బాధపడతాడు.
హద్దుల్లో ఉంచడం తెలుసు..
ఈ రోజు సండే కదా.. రెస్ట్ తీసుకో.. అని మహాతో పెద్ది అంటాడు. రోజూ రెస్టే కదా అని మహా అంటుంది. ఆఫీసులో ఇక ప్రాబ్లం ఉండదా? అని మహాని పెద్ది అడుగుతాడు. ఇకపై ఇలా జరగదు అని చెప్పానని మహా అంటుంది. చక్రి చేసింది తప్పే.. అని కేశవ అంటాడు. మహా గురించి ఆలోచించి వెళ్లాడు.. అని పెద్ది అంటుంది. నాకు హద్దుల్లో ఉండటం తెలుసు.. ఎదుటి వాళ్లని హద్దుల్లో ఉంచడం కూడా తెలుసు.. ఆఫీస్‌లో ఎలాంటి ఇబ్బంది లేదు అని మహా అంటుంది. బాస్ అన్న చిన్న విషయాన్ని చక్రికి చెప్పడంతో ఇదంతా జరిగిందని మహా అంటుంది. ఇంతే ఓపిక, శాంతంగా ఉండు అని పెద్ది సలహాలు ఇస్తాడు.
ఫోన్ చేసి రమ్మని చెప్పిన మహా..
చక్రి ఇంకా రాలేదేంటి? పెద్ది అని మహా అడుగుతుంది. వాడు ఇంతే అని కేశవ అంటాడు. ఇక చక్రికి మహా ఫోన్ చేస్తుంది. కారులో పడుకున్న చక్రి ఆ ఫోన్‌ను లిఫ్ట్ చేస్తాడు. ఎందుకు ఇంటికి రాలేదు.. మీ వాళ్ల ముందు మిమ్మల్ని తిడితేనే మీకు కోపం వస్తే.. ఆఫీసులో మీరు చేసిన దానికి నాకు ఎంత కోపం రావాలి.. ఆ కోపంలో ఏదో తిట్టాను.. అంత మాత్రానికే వెళ్లిపోతారా? రండి అని అంటుంది మహా. నేను అలిగాను.. నిద్రపోవాలి.. రాను అని అంటాడు చక్రి. ఇక్కడకు వచ్చి నిద్రపోండి.. త్వరగా రండి అని మహా అంటుంది. తిట్టడం వీళ్లే.. రమ్మనడం వీళ్లే అనుకుని వస్తాను అని చెబుతాడు చక్రి. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.