Podarillu Today మే 29 ఎపిసోడ్ : చక్రిని నీచంగా చూస్తున్న లలిత.. వెళ్లగొట్టేందుకు ప్లాన్ వేసిన ఆది, ప్రతాప్.. గుడ్డిగా నమ్ముతున్న మహా

 Podarillu Today మే 29 ఎపిసోడ్ : చక్రిని నీచంగా చూస్తున్న లలిత.. వెళ్లగొట్టేందుకు ప్లాన్ వేసిన ఆది, ప్రతాప్.. గుడ్డిగా నమ్ముతున్న మహా

Podarillu Today మే 29 ఎపిసోడ్ : చక్రిని నీచంగా చూస్తున్న లలిత.. వెళ్లగొట్టేందుకు ప్లాన్ వేసిన ఆది, ప్రతాప్.. గుడ్డిగా నమ్ముతున్న మహా

Podarillu Serial 2026 May 29th Episode Preview పొదరిల్లు సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మాధవకి జోడి దొరికినట్టుగానే కనిపిస్తోంది. భన్సీ చెల్లి మనీషా అనే కొత్త కారెక్టర్ వచ్చింది. ఈ ఇద్దరికీ మంచి పరిచయం కూడా ఏర్పడింది. మరి మున్ముందు ఈ జంట ఎలా కలుస్తుందో చూడాలి. మరో వైపు చక్రిని బయటకు పంపించాలని ఆది, ప్రతాప్, లలిత కలిసి ప్లాన్ వేస్తారు. ఇక వీరి నాటకాన్ని కనిపెట్టలేక మహా గుడ్డిగా అంతా నమ్మేస్తుంది.

పొదరిల్లు టుడే ఎపిసోడ్
కేశవకి అన్నయ్య ఉన్నాడని, ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయనకు పెళ్లి అయితేనే కేవశకు పెళ్లి అవుతుందని శైలు తెలుసుకుంటుంది. ఈ విషయాలన్నీ కేశవ అసిస్టెంట్ గాడు శైలుకి చెబుతుంటాడు. అలా చెబుతున్న టైంలోనే కేశవ వస్తాడు. చెప్పరా.. అన్నీ చెప్పు.. అని అసిస్టెంట్‌ను లాగి పెట్టి తన్నే లోపు.. అతను పారిపోతాడు. ఇవన్నీ నీకు ఎందుకే.. అయినా ఎప్పుడూ నా షాప్ చుట్టూనే తిరుగుతున్నావ్ నీకు పనీ పాట లేదా? అని తిడతాడు. ఇలా తిరిగితే అయినా నన్ను పెళ్లి చేసుకుంటావేమో అని చిన్నగా గునుగు తుంది శైలు. మీ అన్నకి ఏమైనా సంబంధాలు చూడమంటావా? అని శైలు అంటే.. మా అన్న కోసం మా వదిన ఎక్కడో చోట పుట్టే ఉంటుంది.. నువ్వేమీ వెతకాల్సిన అవసరం లేదు లే అని శైలుని కసురుకుంటాడు కేశవ. మరో వైపు బస్టాండులో రూకో భయ్యా అని ఓ లేడీ ఆటో కోసం వెయిట్ చేస్తుంది. మాధవ కూడా తన సైకిల్ పాడు అయిందని ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇద్దరూ ఆటోలో ఎక్కే టైంలో ఒకరి తల మరొకరికి తగులుతుంది. క్షమించండి చూసుకోలేదు అని మాధవ చెబుతుంటే.. తెలుగు నై హిందీ అని ఆమె చెబుతుంది. ఇక ఇద్దరూ కలిసి ఒకే తండేల్ బస్తీకి వెళ్లాల్సి ఉంటుంది. ఆటో వాడికి కూడా మాధవే అడ్రస్ చెబుతాడు.

ఇద్దరూ ఆటోలో..

ఇద్దరూ ఆటోలో..

ఇద్దరూ ఆటోలో..
ఆమెకు తెలుగు రాదు.. మనోడికి హిందీ రాదు.. ఆటో దిగిన తరువాత ఎంతైంది అంటే కూడా ఆ ఆటో వాడు చెబుతుంటే ఈమెకు అర్థం కాదు.. వాడు 45 అంటే.. ఈమె 450 అంటుంది.. ఇక మాధవ ఎలాగోలా ఆమెకు అర్థమయ్యేలా పది రూపాయల నోట్లు, 5 రూపాయల బిళ్ల తీసి ఆటో వాడికి ఇస్తాడు.. ఓహో.. పైంథాలిసా? అని ఆమె కూడా ఇస్తుంది. ఆప్ అచ్చా ఆద్మీ హై (మీరు చాలా మంచివారు) అని ఆమె అంటే.. షర్ట్ బాగుందని అంటుందేమో అనుకున్న మాధవ్.. మీ ముసుగు కూడా బాగానే ఉందని అంటాడు. అలా ఇద్దరూ వెళ్లిపోతారు.

గుడికి పోదామా..
గుడికి పోదామా..

గుడికి పోదామా..
ఇక్కడ నాకు చాలా బోర్ కొడుతోంది వదిన.. అక్కడైతే కన్నా గాడు నాతో ఉంటాడు.. ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు.. అని మహా అంటుంది. బయటకు వెళ్లు.. సినిమాకు వెళ్లు.. లేదంటే అత్తయ్య గారితో మాట్లాడు అని హారిక అంటుంది. వద్దు.. ఆమెతో మాట్లాడితే.. చక్రినే దెప్పి పొడుస్తూనే ఉంటుంది.. వద్దు అని మహా అంటుంది. నీతో మాట్లాడదామంటే నీకు పనే సరిపోవడం లేదు అని హారిక గురించి మహా అంటుంది. సరే ఈ రోజంతా నీతోనే ఉంటాను లే.. చెప్పు ఏం చేద్దాం అని హారిక అడుగుతుంది. గుడికి పోదాం పదా అని మహా అంటే హారిక షాక్ అవుతుంది.

బాగుండాలని కోరుకో..

బాగుండాలని కోరుకో..
ఒకప్పుడు గుడికి రమ్మంటేనే వచ్చేదానివి కాదు కదా? నువ్వేంటి ఇప్పుడు పోదాం అని అడుగుతున్నావ్ అని హారిక షాక్ అవుతుంది. అక్కడకు వెళ్లిన తరువాత అలవాటు అయిందిలే అని మహా అంటుంది. నువ్వు చాలా మారిపోయావ్ మహా అని హారిక అంటుంటే.. లలిత కూడా అక్కడికి వస్తుంది. వెళ్లండి.. ఈ రోజు మంచి రోజు.. వెళ్లి ఇక మనకు ఎలాంటి కష్టాలు రావొద్దని మొక్కుకోండని లలిత చెబుతుంది. ఇంకో వైపు ఆది, ప్రతాప్ ఇద్దరూ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు. చక్రి మాత్రం ఇళ్లంతా ఏదో వెతుకుతూ ఉన్నట్టుగా చేస్తాడు.

ప్రతాప్, ఆదితో చక్రి గొడవ..

ప్రతాప్, ఆదితో చక్రి గొడవ..
ఏంట్రా వెతుకుతున్నావ్ అని చక్రిని ఆది అడుగుతాడు. మామయ్య నా భార్య ఎక్కడ అని ప్రతాప్‌ని అడుగుతాడు. మామయ్య అంటే మాయం చేస్తా అని ప్రతాప్ ఫైర్ అవుతాడు. మీరు ఏం పీకలేరు.. పోలీస్ స్టేషన్‌లో ఏడుస్తూ ఉన్నారు.. ప్రతాప్ మామ ప్రతాపం నాకు తెలీదా అని కౌంటర్లు వేస్తాడు. షూట్ చేసి పారేస్తా.. అని ప్రతాప్ అంటే.. జైల్లో చిప్ప కూడు తింటారా తర్వాత.. అని చక్రి అంటాడు. నాకేమైనా జరిగితే మీరే కారణం అని మహా ముందే ఇంట్లో చెప్పొచ్చా అని చక్రి చెబుతాడు. ఇదంతా మహాలక్ష్మీకి కూడా తెలుసు.. తనే కంప్లైంట్ ఇస్తానని చేస్తానని చెప్పిందంటూ చక్రి బెదిరిస్తాడు. ఇంతలో లలిత రావడంతో చక్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మళ్లీ డ్రైవర్‌గా చక్రి..

మళ్లీ డ్రైవర్‌గా చక్రి..
మహా, హారిక కలిసి గుడికి నడిచి వెళ్లారని లలిత చెబుతుంది. ముష్టోడు తిరిగినా ఓకే కానీ.. ఇలాంటి వాడు అల్లుడిగా ఈ ఇంట్లో తిరుగుతుంటే నచ్చడం లేదు.. ఏదో ఒకటి చేయండి.. త్వరగా చేసేయండి.. సిరి పాపని స్కూల్లో ఎలా డ్రాప్ చేయాలని లలిత అడిగితే.. డ్రైవర్ ఉన్నాడు.. రా అని చక్రిని పిలుస్తాడు ప్రతాప్. మేడంని, సిరి పాపని స్కూల్లో డ్రాప్ చెయ్ అంటూ ప్రతాప్ ఆర్డర్ వేస్తాడు. నీ స్థాయి ఏంటో తెలుసు కదా.. అని చక్రిని అవమానిస్తాడు ప్రతాప్. సిరి పాపను తీసుకెళ్లడానికి నేను ఎందుకు వెనకాడతాను.. పైగా మా అత్తే కదా.. అని చక్రి కౌంటర్లు వేస్తాడు.

భన్నీ చెల్లి మనీషా..

భన్నీ చెల్లి మనీషా..
భన్సీ ఊరి నుంచి మాధవ కోసం ఓ స్పెషల్ స్వీట్ తీసుకుని వస్తాడు. నాతో పాటు ఇంకొకరిని తీసుకు వచ్చాను అని భన్సీ అంటాడు. ఆ ఇంకొకరు మనీషా.. ఇంతకు ముందు ఆటోలో మాధవకు పరిచయమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి మాధవ షాక్ అవుతాడు. మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా? అని భన్సీ అడుగుతాడు. మా చెల్లి అని మనీషాని పరిచయం చేస్తాడు భన్సీ. ఇక ఆమె హిందీలో మాట్లాడుతూ ఉంటే.. మన భన్సీ దాన్ని తెలుగులో మాధవకి ట్రాన్స్ లేట్ చేస్తుంటాడు. ఈ రోజు పనిలోకి రావొద్దు.. మీ చెల్లితో సిటీ అంతా తిరిగి ఎంజాయ్ చెయ్ అన్నట్టుగా మాధవ చెబుతాడు.

కోపంగా వడ్డించిన లలిత

కోపంగా వడ్డించిన లలిత
డైనింగ్ టేబుల్ వద్ద చక్రికి లలిత ఇష్టమొచ్చినట్టుగా వడ్డిస్తుంది. దాన్ని చూసి మహా ఫీల్ అవుతుంది. మీకు నచ్చినంతే తినండి అని చక్రికి మహా చెబుతుంది. మీరు డ్రైవర్‌గా ఎన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు అని ప్రతాప్ ఏదో టాపిక్ తీసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. డిగ్రీ పూర్తి చేశారా? అని ప్రతాప్ అంటే.. చదువుకు, డ్రైవింగ్‌కు సంబంధం లేదు.. అని చక్రి అంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్నా అని మహా అంటే.. సంబంధం ఉంది అని బిజినెస్ చేయరా? ఎదగరా? అని ప్రతాప్ అడుగుతాడు. నాకు బిజినెస్‌లు ఉన్నాయి.. చూసుకో.. అని ప్రతాప్ అంటాడు. అవన్నీ ఆయనకు ఇష్టం లేదు అని మహా అంటుంది.

ప్రతాప్ కొత్త ప్లాన్..

ప్రతాప్ కొత్త ప్లాన్..
బిజినెస్ నేను నేర్పుతాను.. రిస్క్ నేను చూసుకుంటాను.. మహాతో డిస్కస్ చేసి నాకు చెప్పు అని ప్రతాప్ చాలా ప్రేమగా నటిస్తాడు. లలిత కూడా ప్రేమగానే నటిస్తుంది. ఈ రోజు వీళ్లు ఇంతగా ప్రేమగా నటిస్తున్నారు.. అంటే ఏదో ప్లాన్ చేశారు.. ఏమై ఉంటుంది.. అని చక్రి లోలోపల అనుకుంటాడు. ఇక రూంలోకి వచ్చాక చక్రి కంగారు పడతాడు. ఎలా దెబ్బ కొడతారో.. అర్థం కావడం లేదే.. అని చక్రి మధన పడుతుంటాడు. మహాతో కలిసి ఉండటం మాత్రం సంతోషంగానే ఉంది లే అని చక్రి అనుకుంటాడు. మరో వైపు లలిత, ఆది, ప్రతాప్ ప్లాన్ వేస్తుంటారు. ఇంతలో అక్కడకు మహా వస్తుంది.

అక్కడ సంతోషంగానే..

అక్కడ సంతోషంగానే..
అంత రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు అని మహా అడుగుతుంది. రహస్యం ఏం ఉంటుంది.. అల్లుడికి బిజినెస్ ఇష్టం లేదంటున్నాడు.. నువ్వేమీ పట్టించుకోవడం లేదు.. నువ్వు అక్కడికి వెళ్తే ఎలా ఉంటావో అని, నిన్ను పంపించాలా? అని కంగారు పడుతున్నా అని లలిత అంటుంది. అంటే నీ ఉద్దేశం ఏంటి అమ్మా అని మహా అంటుంది. మీ అమ్మ మాటల పట్టించుకోకు లే.. నువ్వు అక్కడ సంతోషంగానే ఉన్నావా అమ్మా అని ప్రతాప్ అంటాడు. నిజమైన సంతోషం అక్కడే తెల్సుకున్నాను నాన్నా అని మహా అంటుంది. ఈ జీవితం నువ్వే ఎంచుకున్నావ్.. బలవంతంగా ఆపలేం కానీ.. నువ్వు అక్కడ కష్టపడుతుంటే తట్టుకోలేం అని ప్రతాప్, లలిత అంటారు.

సరిగ్గా అర్థం చేసుకోలేదు..

సరిగ్గా అర్థం చేసుకోలేదు..
అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు.. ఇల్లే రేపోమాపో కూలిపోతుంది.. నువ్వు అక్కడ ఎలా ఉంటావే అని ఆది అంటాడు. మీ అనుమానం నిజమేరా.. కోర్ట్ లిటిగేషన్‌లో ఉంది.. అందుకే కట్టడం లేదు.. నేను బాగానే ఉన్నాను.. సంతోషంగా ఉన్నాను అని మహా అంటుంది. మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు.. అని మహా అంటుంది. నువ్వు బాగా ఉండాలని అనుకున్నా కానీ.. సంతోషంగా ఉండాలని అనుకోలేదు.. అని ప్రతాప్ అనడంతో మహా అన్నీ గుర్తు చేసుకుంటుంది. నన్ను క్షమిస్తావా?.. అల్లుడి గారిని బిజినెస్ చూసుకోమను అని మహాని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు.

ఇక్కడే ఉంటుందిలే..

ఇక్కడే ఉంటుందిలే..
ఇంత ప్రేమ పెంచుకున్నాం.. మహా మనల్ని వదిలి వెళ్లిపోదు అని ఆది అంటాడు. అంటే ఏంట్రా.. నేను పర్మినెంట్‌గా ఇక్కడ ఉండటానికి వచ్చానని అనుకుంటున్నావా? నా గోల్స్, డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. మీరేం మాట్లాడరు ఏంటి? నాన్నా అని మహా అంటుంది. అవును.. అంతే అని ప్రతాప్ అంటాడు. ఇక భూషణ్‌తో జరిగిన గొడవ గురించి ప్రతాప్‌కి చెబుతుంది మహా. రేయ్ ఆది.. వాడికి చెప్పురా.. ఇంకో సారి మహా జోలికి రాకూడదు.. అని ప్రతాప్ వార్నింగ్ ఇవ్వమని అంటాడు. ఇక వాడు నీ జోలికి రాడు లే అని ఆది అంటాడు. చక్రితో నిజమైన పెళ్లి కాదు అని చెప్పాలా? వద్దా అని మహా అంటుంది.

నిజం చెప్పాలనుకున్న మహా..

నిజం చెప్పాలనుకున్న మహా..
వామ్మో నిజం చెబుతుందేమో అని ఇంతలో చక్రి వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్లిపోతాడు. అందరూ తలా ఓ దిక్కుకి వెళ్తారు. చక్రి కూడా రూంలోకి వస్తాడు. అక్కడేం జరుగుతోందో ఏమో అని చక్రి కంగారు పడుతుంటే మహా లోపలకు వస్తుంది. మా నాన్న మారిపోయినందుకు సంతోషంగా ఉందని మహా అంటుంది. నిన్ను మాయ చేస్తున్నాడు అని చక్రి లోలోపల అనుకుంటాడు. నాన్న పశ్చాత్తాపడుతున్నాడు.. క్షమాపణలు చెబుతున్నాడు.. నాన్నని అలా చూస్తే జాలి వేసింది.. బాధ అనిపించింది.. అంటూ నాన్న గురించి మహా గొప్పగా చెబుతుంది. మన పెళ్లి గురించి నిజం చెప్పాలని అనుకుంటున్నా అని మహా అనడంతో చక్రి షాక్ అవుతాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *