రాశిఫలాలు 07 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మకరం సహా ఈ 4 రాశుల వారికి ప్రత్యర్థులపై విజయం

 రాశిఫలాలు 07 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మకరం సహా ఈ 4 రాశుల వారికి ప్రత్యర్థులపై విజయం

రాశిఫలాలు 07 మే 2026: ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మకరం సహా ఈ 4 రాశుల వారికి ప్రత్యర్థులపై విజయం

horoscope today 07 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సాధ్య, గజకేసరి, బుధాదిత్య యోగాల ప్రభావంతో వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May7

horoscope today 07 May 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు ధనస్సు నుంచి మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఆషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు, గురుడు పరస్పరం వ్యతిరేక(సమసప్త స్థానాల్లో) ఉండటం కారణంగా గజకేసరి యోగం ఏర్పడనుంది. మరోవైపు బుధుడు, సూర్యుడు కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. అంతేకాదు బుధుడు భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు సంపదకు ప్రతీకగా భావించే శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు జరగొచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల సాయంతో మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు కోపంలో, తొందరపాటులో ఎలాంటి పనులు చేయకండి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించొచ్చు. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. మీరు చేసే పనుల్లో గొప్ప విజయాలు సాధించొచ్చు. ఇల్లు, ఆస్తి తదితర వాటిని కొనాలని కలలు కంటుంటే, మీ కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఈరోజు మీరు అనవసరమైన కోపాన్ని నివారించాలి. వ్యాపారులు ఈరోజు పని నిమిత్తం కొంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మీ పిల్లల గురించి కొన్ని శుభవార్తలు వినొచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశాలున్నాయి. మీ పాత సమస్యలకు పరిష్కారం లభించొచ్చు. మీ కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించొచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు రావొచ్చు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీకు పలు సమస్యల నుంచి ఉపశమనం లభించొచ్చు. మీరు చేసే పనులకు ప్రత్యర్థులు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చాలా కాలంగా న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటుంటే, వాటికి ఈరోజు పరిష్కారం లభించొచ్చు. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావొచ్చు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. ఆరోగ్య పరంగా కొంత అలసట ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపే అవకాశం లభిస్తుంది. శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభించొచ్చు. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఇతరులను బాధపెట్టగలవు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడాలి. మీ ఆర్థిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇతరులు చెప్పే మాటలను బట్టి ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకండి. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు రావాలంటే మరింత కష్టపడాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు గురు దేవుని అనుగ్రహం లభిస్తుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవ్వొచ్చు. మీ ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. దీంతో మీకు లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. దీర్ఘకాలిక ప్రాజెక్టులలో విజయం సాధించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరగొచ్చు. మీ కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. మరోవైపు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం రావొచ్చు. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ప్రత్యర్థులను ఎక్కువగా పట్టించుకోకండి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీకు స్నేహితులు లేదా సహోద్యోగుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. దీంతో మీ మనసులో ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగులకు తాము పని చేసే ప్రాజెక్టులో మంచి విజయం లభించొచ్చు. మీకు అప్పుల నుంచి విముక్తి లభించే అవకాశాలున్నాయి. మీ ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. ఈరోజు పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *