‘దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి’.. కొండా సురేఖపై బీజేపీ ఫైర్

 ‘దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి’.. కొండా సురేఖపై బీజేపీ ఫైర్

‘దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి’.. కొండా సురేఖపై బీజేపీ ఫైర్

మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదని.. దైవద్రోహ శాఖ మంత్రి అంటూ మండిపడుతున్నారు. బీజేపీని విమర్శించే క్రమంలో ఆమె శ్రీరాముడిని అవమానించారని ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి.. దేవుడినే అవమానించేలా మాట్లాడారని.. వెంటనే హిందువులకు ఆమె క్షమాపణలు చెప్పాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు.

హైలైట్:
మంత్రి కొండా సురేఖపై బీజేపీ తీవ్ర విమర్శలు
దైవద్రోహ శాఖ మంత్రి అంటూ వ్యాఖ్యలు
శ్రీరాముడిని అవమానించేలా మాట్లాడారని ఆరోపణలు

BJP
కొండా సురేఖ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
బీజేపీ నేతలను విమర్శించే క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. జై శ్రీరాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన, దాని కోసం బీజేపీ నేతలు చేస్తున్న ఏర్పాట్లపై తాజాగా స్పందించిన మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మీటింగ్ పెట్టి, జై శ్రీరాం అంటారని.. అలా చేస్తే డబ్బులు వస్తాయా, పథకాలు వస్తాయా అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారానికి కారణం అయ్యాయి. దీనిపై కాషాయ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మంత్రి కొండా సురేఖపై విరుచుకుపడుతున్నారు.

మంగళవారం రోజున హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాకు హాజరైన కొండా సురేఖ.. అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ.. తీవ్రంగా మండిపడింది. ‘దేవాదాయ శాఖ మంత్రి కాదు.. దైవద్రోహ శాఖ మంత్రి. శ్రీరాముడిపై మంత్రి కొండా సురేఖ అహంకారపూరిత వ్యాఖ్యలు’ అంటూ విరుచుకుపడింది.

జై శ్రీరామ్ నినాదాన్ని పైసలతో పోల్చుతూ కోట్లాది మంది హిందువుల మనోభావాలపై మంత్రి కొండా సురేఖపై విషం చిమ్మారని టీబీజేపీ ఫైర్ అయింది. హిందూ దేవుళ్లంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న చులకన భావానికి ఈ అహంకారపూరిత మాటలే సజీవ నిదర్శనమని పేర్కొంది. పవిత్రమైన దేవాదాయ శాఖకు మంత్రిగా ఉండి.. దైవాన్నే అవమానించడం దారుణమని మండిపడింది.

జై శ్రీరాం అంటే డబ్బులు ప‌డ‌తాయా.. కొండా సురేఖ వ్యాఖ్యలు

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడమే కాంగ్రెస్ నాయకుల అసలు నైజమని ఆరోపించింది. శ్రీరాముడిని అపహాస్యం చేసిన కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదని తేల్చి చెప్పింది. శ్రీరాముడిని కించపరిచిన కొండా సురేఖ తక్షణమే హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. హిందుత్వాన్ని విమర్శించడం ఇకపై అంత తేలికైన విషయం కాదని.. హిందువులు ప్రతిస్పందిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రతిఘటన ఇటీవలి ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ధర్మం తన మార్గాన్ని తాను వెతుక్కుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. శబరిమల బంగారం చోరీ ఘటనలో పినరయి విజయన్.. సనాతన ధర్మ నిర్మూలన వివాదంలో ఎంకే స్టాలిన్.. గంద ధర్మం, మృత్యు కుంభ్ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ.. తిరుమల వివాదంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. హిందూ బంధు అంటూ ఎగతాళి చేసిన విషయంలో కేసీఆర్ ఓటమి పాలైనట్లు బండి సంజయ్ గుర్తు చేశారు.

ప్రతిసారీ విశ్వాసం అనేది రాజకీయ విమర్శలకు గురైనప్పుడు.. ఓటర్లు తమదైన రీతిలో సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మంత్రి జై శ్రీరామ్ నినాదాన్ని డబ్బుతో ముడిపెడితే.. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పటికే ఉన్న ట్రెండ్ ద్వారా స్పష్టమవుతోందని వెల్లడించారు. ఈ సందర్భంగా.. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.. జై శ్రీరామ్ భారత మాతా కీ జై అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *