కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే!
కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే!
Father Sets Fire To Son Bike In Visakhapatnam: విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తీరు మారింది. ఒకటి రెండు సందర్భాల్లో తండ్రికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.. కొడుకు తీరు మారకపోవడంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే కొడుక్కి ప్రేమతో కొనిచ్చిన బైక్కు తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతకీ ఆ కొడుకు ఏం చేశాడు?.. ఆ తండ్రికి ఎందుకు కోపం వచ్చింది?
హైలైట్:
విశాఖలో కొడుకు బైక్ తగలబెట్టిన తండ్రి
ప్రేమతో బైక్ కొనిచ్చి తండ్రే కాల్చేశాడు
కొడుకు తీరు మారకపోవడంతో ఆగ్రహం
Vizag Father Sets Fire To Son Bike
విశాఖపట్నం కుమారుడి బైకుని తగలబెట్టిన తండ్రి
ఆ తండ్రికి కొడుకుపై ఎంతో ప్రేమ.. కొడుకు అడిగాడని ఓ బైక్ కూడా కొనిచ్చాడు. ఏడాది తర్వాత కొడుకుకు తండ్రి ప్రేమగా కొనిచ్చిన బైక్ను తండ్రి తగలబెట్టాడు. అదేంటి కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చిన తండ్రి ఇలా ఎందుకు చేశాడని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది. విశాఖపట్నం వేపగుంట దగ్గరలోని బంటాకాలనీలో నివాసం ఉండే ఓ వ్యక్తి ఆటో డ్రైవర్. ఆయనకు ఇద్దర కొడుకులు.. ఓ కుమారుడు చదువుకుంటున్నాడు. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లిరావడానికి తనకు బైక్ కావాలని తండ్రిని కోరాడు. తండ్రి నచ్చజెప్పాలని సూసినా బైక్ కావాల్సిందేనని పట్టుబట్టాడు.
ఆ తండ్రి తప్పనిసరి పరిస్థితిలో కొడుకు కోసం ఏడాది క్రితం ఖరీదైన బైక్ కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ఆ కాలేజీ కుర్రోడు రెచ్చిపోయాడు.. తన స్నేహితులతో ఎక్కువగా తిరుగుతున్నాడు. ఈ బైక్పై ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు నడిపాడు. ఈ బైక్పై వెళుతున్న సమయంలో గతేడాది ఆ అబ్బాయికి ప్రమాదం జరిగి ఆస్పత్రి పాలయ్యాడు. పాపం ఆటో నడిపి జీవనం సాగించే తండ్రి కుమారుడి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఆ అబ్బాయి ఆస్పత్రిలో కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.
రోడ్డు ప్రమాదంత తర్వాత కూడా అతడి తీరు మారలేదు.. మళ్లీ తాజాగా ఆ బైక్పై ట్రిపుల్ రైడింగ్ కారణంగా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. గతంలో ట్రాఫిక్ చలానాలు రావడం, కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలవ్వడం, మళ్లీ మరోసారి ట్రాఫిక్ చలానా రావడంతో ఆ తండ్రి అసహనం వ్యక్తం చేశాడు. తాను బైకు కొనివ్వడం వల్లే కొడుక్కి ఇలా తయారయ్యాడని తండ్రి ఆగ్రహం వ్యక్తం చఏశారు. బైక్ తీసుకెళ్లి కాలనీకి దూరంగా వాహనాన్ని తీసుకెళ్లి తగలబెట్టాడు. ఆ తండ్రి చేసిన పనితో అందరూ షాకయ్యారు.
తండ్రి కొడుకుపై ప్రేమతో బైక్ కొనిస్తే.. ఆ కుర్రాడు మాత్రం ఇష్టారీతిన వ్యవహరించాడు. వరుసగా సమస్యలు చుట్టుముట్టడంతో ఆ తండ్రి మనసు విరిగిపోయింది. అందుకే బైక్ తీసుకెళ్లి తగులబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు పిల్లలకు నిజంగానే అవసరమైతే బైక్ కొనివ్వడంలో తప్పులేదు.. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని బెదిరించి, పట్టుబట్టి బైక్ కొనేలా చేస్తున్నారు. కానీ ఆ బైక్ కారణంగా కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ ఘటనలో కూడా అదే జరిగింది.. తండ్రి ప్రేమతో బైక్ కొనిస్తే ఆ కుమారుడు మాత్రం ఇష్టం వచ్చినట్లు చేశాడు. చివరికి కొడుకుకు ప్రేమగా కొనిచ్చిన బైకును తండ్రి తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.