విజయవాడ: అటెండర్‌కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!
విజయవాడ: అటెండర్‌కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!
Vijayawada ACB Raids Attenders House: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులశాఖ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూటబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతేడాది లంచం తీసుకుంటూ ఏసీబకి దొరికిపోయి అరెస్ట్ అయ్యారు.. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈలోపు మరోసారి ఏసీబీ అధికారులు ఆయనతో పాటూ సోదరుల ఇళ్లలో సోదాలు చేసి అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.
హైలైట్:
విజయవాడ ప్రభుత్వ అటెండర్ ఇంట్లో సోదాలు
భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు
గతేడాది లంచం తీసుకుంటూ దొరికిపోయారు
ACB Raids Attenders House
విజయవాడ అటెండర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అటెండర్.. కానీ ఆయనకున్న ఆస్తులు గురించి తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టిన అటెండర్ ఇంట్లీ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆయనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ గవర్నర్‌పేటలోని పన్నుల శాఖ కార్యాలయంలో కొండపల్లి శ్రీనివాసరావు అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆయన నివాసంతో పాటుగా సోదరుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
1986లో కొండపల్లి శ్రీనివాసరావు పన్నుల శాఖలో ఉద్యోగిగా చేరారు.. ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 2022 నుంచి విజయవాడ గవర్నర్‌పేట కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనివాసరావు గతేడాది అక్టోబర్ నెలలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. లంచం తీసుకున్న కేసులో అరెస్టై జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం సస్పన్షన్లో ఉన్నారు. గతేడాది లంచం తీసుకుని దొరికిపోయిన సమయంలోనే ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి విచారణ చేశారు.
తాజాగా శ్రీనివాసరావు ఆస్తులపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి తనిఖీలు చేశారు. శ్రీనివాసరావు కూడబెట్టిన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, వస్తువులను గుర్తించారు. ఆయనపై కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థలం, బంగారం, వెండి, విలువైన పరికరాలు ఉన్నట్లు తేలింది. శ్రీనివాసరావు ఆస్తుల్లో కొన్ని భార్య, కుమారుడి పేర్లతో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆయన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. శ్రీనివాసరావుకు ఒక భవనం ఉన్నట్లు తెలుస్తోంది. రూ. 41 లక్షల విలువైన స్థలం.. ఐదు బిస్కెట్ల బంగారం కలిపి మొత్తం 760 గ్రాముల బంగారం, దాదాపు 7.8 కిలోల వెండి, బ్యాంకు అకౌంట్లో డబ్బులు, ఇంట్లో కొంత డబ్బులు.. విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు.. రెండు బైక్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అటెండర్ ఇంత భారీస్థాయిలో ఆస్తులు కూడబెట్టడంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.