Podarillu Today ఏప్రిల్ 03 ఎపిసోడ్: మాధవకి మహా క్షమాపణలు.. శైలుతో కలిసి రీల్స్ చేసిన కేశవ.. నారాయణ అల్లరే అల్లరి

 Podarillu Today ఏప్రిల్ 03 ఎపిసోడ్: మాధవకి మహా క్షమాపణలు.. శైలుతో కలిసి రీల్స్ చేసిన కేశవ.. నారాయణ అల్లరే అల్లరి

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో తమ్ముళ్లపైన, మహాపైన మాధవ సీరియస్ అవుతాడు. ఎవరిని అడిగి గాయత్రి ఇంటికెళ్లి మాట్లాడారని మాధవ ఫైర్ అవుతాడు. తమ్ముళ్ల తప్పేం లేదు.. నేనే వాళ్లని తీసుకెళ్లానని మహా మొత్తం తన నెత్తిన వేసుకొని క్షమాపణలు చెప్తుంది. అయినా కానీ మాధవ కొంచెం గట్టిగానే మాట్లాడతాడు. అయితే మాధవ కోపం తెల్లారేసరికి మాయమైపోతుంది. మరోవైపు కేశవ గ్యారేజ్ దగ్గరికొచ్చి శైలు మళ్లీ డ్రామాలు చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

Podarillu Today
మాధవకి మహా క్షమాపణలు.. శైలుతో కలిసి రీల్స్ చేసిన కేశవ.. నారాయణ అల్లరే అల్లరి
Podarillu April 03rd Episode: గాయత్రిని మాధవకి ఇచ్చి పెళ్లి చేయాలని అడగటానికి మహా అండ్ కో తాయారు ఇంటికెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మాట చెప్పగానే తాయారు రెచ్చిపోతుంది. అయినా సిగ్గులేకుండా ఇక్కడికి వచ్చి ఇలా అడుగుతావా.. పో ముందు అంటూ మహాని కూడా తిడుతుంది. ఈ మాట వినగానే కేశవ ఆవేశంతో ఊగిపోతాడు. పక్కనే ఉన్న కర్ర తీసుకొని తాయారు బుర్ర బద్దలుకొట్టబోతాడు. మా నాన్న ఏం చేసి జైలుకి వెళ్లాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నీ తల పగలగొట్టే వెళ్తాను.. ఇంకొక్కసారి ఎప్పుడైనా మా వదిన గురించి తప్పుగా మాట్లాడావంటే అంటూ కేశవ వార్నింగ్ ఇస్తాడు. సరి సర్లేరా ఆ అమ్మాయి గురించి ఎవరూ ఏమనరులే కానీ.. పెళ్లి కుదిరిన అమ్మాయి ఇంటికొచ్చి ఇలా గొడవ చేయడం కరెక్ట్ కాదు.. మీరంతా ఇంటికెళ్లండని రమణయ్య అంటాడు. చూడు గాయత్రి.. నేను నాకు నచ్చని పెళ్లి తప్పించుకోవడానికి పెద్ద యుద్ధమే చేశాను.. నువ్వు నీకు నచ్చిన పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో వాళ్లని ఎదిరించు.. పెద్ది కావాలంటే ధైర్యంగా మందడుగు వెయ్.. అంతా నీ చేతుల్లోనే ఉందని మహా చెప్తుంది. దీంతో అందరూ తిరిగి ఇంటికొచ్చేస్తారు.

చేసిన అవమానం సరిపోయిందా

చేసిన అవమానం సరిపోయిందా

చేసిన అవమానం సరిపోయిందా
ఇంక ఇంటికి రాగానే ఆరుబయటే అందరినీ ఏకిపారేస్తాడు నారాయణ. ఏ వెళ్లిన పని ఏమైంది.. అమ్మాయిని అడిగారా.. మీతో పాటు వచ్చేసిందా.. వాళ్లు చేసిన సన్మానం బావుందా.. అంటూ వెటకారం ఆడతాడు. ఇన్నాళ్లూ నా పెద్ద కొడుకు మనసు తెలుసుకోకుండానే వాడి బాబుని ఇక్కడ ఉన్నానా.. తెలిసినా ఏం చేయలేం కాబట్టే ఇలా ఉన్నాను. వాళ్ల ఆస్తులన్నీ వాళ్లు అమ్ముకుదొబ్బి నా ఆస్తిలో మళ్లీ వాటా కావాలంటూ అడిగిన వెధవలు వాళ్లు.. అలాంటి వాళ్లు ఎక్కడ నా పిల్లలకి నిలువ నీడ లేకుండా చేస్తారేమోనని రోజూ ఇంటి ముందు ఇలా కాపలా కాస్తూ ఉన్నాను.. అయినా వాళ్ల సంగతి ఈ అమ్మాయికి తెలియకపోవచ్చు.. మీరు తెలియదా అని కొడుకుల్ని తిడతాడు.

ఆయన్ని ఏమైనా అంటే బాగోదు
ఆయన్ని ఏమైనా అంటే బాగోదు

ఆయన్ని ఏమైనా అంటే బాగోదు
నారాయణ మాటలకి కేశవకి కోపం వస్తుంది. అసలు నువ్వే సరిగ్గా ఉండుంటే అంటూ ముందుకు రాగానే మహా ఆగండి అంటూ చేయి చూపిస్తుంది. ఆయన్ని ఏమైనా అంటే మాత్రం బాగోదు.. ఆయనలో ఏదో తెలియని ఒక సంస్కారం, గౌరవం రెండూ ఉన్నాయి.. కానీ వాటిని గుర్తించడం మీకు తెలియడం లేదు అంతే.. నేను ఈ ఇంటి అమ్మాయిని కాదని తెలిసినా.. కోడలిగా రాలేదు ఒక గెస్టుగా వచ్చానని చెప్పినా కూడా.. ఆయన నాకు తోడుగా వచ్చారు.. నా కోసం ప్రాణాలు కూడా లెక్కచేయలేదు.. అలాంటి మంచి మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.. అంతేకానీ ఆయన అనుభవాన్ని, వయసుని తక్కువ చేసేలా మాట్లాడకండి అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తుంది మహా.

ఏంటి పెళ్లి పెద్దలైపోయారా?

ఏంటి పెళ్లి పెద్దలైపోయారా?
మరోవైపు గాయత్రి ఇంటికి మీ తమ్ముళ్లు, చక్రి భార్య వెళ్లారని మాధవకి ఎవరో చెప్పడంతో పరిగెత్తుకుంటూ ఇంటికొస్తాడు. రేయ్ ఏం చేశార్రా మీరు.. ఎందుకు అత్తయ్య వాళ్ల ఇంటికి వెళ్లారని అడుగుతాడు. మీకు గాయత్రి అంటే ఇష్టం కదా.. మీకు ఇచ్చి పెళ్లి చేయమని అడగటానికి వెళ్లామని మహా అంటుంది. అయినా ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడటానికి వెళ్లారని మాధవ అడిగితే నిన్న తెల్లవారుజామున మీరు గాయత్రి మీ బాధలు చెప్పుకొని ఏడ్చారు కదా అని మహా అంటుంది. అయినా కానీ మీరు ఇంటికి వెళ్లి అలా అడగటం.. వాళ్ల చేత మాటలు అనిపించుకోవడం నాకు నచ్చలేదని మాధవ చెప్తాడు.

హద్దుల్లో ఉండకుండా జోక్యం చేసుకున్నాను

హద్దుల్లో ఉండకుండా జోక్యం చేసుకున్నాను
ఈ విషయంపైన కన్నా, చక్రి సహా తమ్ముళ్లని మాధవ తిడతాడు. ఇది చూసి మహాకి బాధగా అనిపిస్తుంది. ఇందులో వాళ్ల తప్పేం లేదు పెద్ది.. చేసిందంతా నేనే.. బయటి నుంచి వచ్చినదాన్ని బయటికి వెళ్లిపోయేదాన్ని.. నా హద్దుల్లో నేను ఉండకుండా జోక్యం చేసుకున్నందుకు అందరికీ క్షమాపణలు చెప్తున్నాను.. అని చెప్పి గదిలోకి వెళ్లిపోతుంది. ఇది చూసి నారాయణ కూడా కొంచెం బాధపడతాడు. అడ్డగాడిదల్లా ముగ్గురుండి ఆ అమ్మాయి చేత క్షమాపణలు చెప్పించారేంట్రా.. సిల్లీ ఫెలోస్ అంటూ తిట్టేసి బయటికెళ్లిపోతాడు.

మీరు నా పెద్ది అనుకున్నాను కాబట్టే

మీరు నా పెద్ది అనుకున్నాను కాబట్టే
కాసేపటికి మాధవ ఒంటరిగా ఉండగా మహా వెళ్తుంది. కోపం తగ్గిందా పెద్ది అని అడిగితే కోపపడటానికి నేనెవర్ని అమ్మా అని అంటాడు. మీరు ఎవరని నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు.. మీరు ఎవరని నేను మిమ్మల్ని పెద్ది అని పిలుస్తున్నాను.. మీ బాధ చూడలేకే మేము అక్కడికెళ్లాం.. గాయత్రిని ఇచ్చి పెళ్లి చేస్తారేమోనని అడగటానికే వెళ్లాం.. కానీ వాళ్లు అంతలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదుు అంటుంది. వాళ్ల గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసమ్మా.. వాళ్లు ఎలా ఉంటారో ఏంటో నాకు తెలీదా.. అయినా వాళ్ల వల్ల నువ్వు ఇంకెప్పుడూ మాటలు పడకూడదు.. అందుకే చెప్తున్నా.

కాలర్ పట్టుకోవడం కాదు కొట్టుకోండికాలర్ పట్టుకోవడం కాదు కొట్టుకోండి

కాలర్ పట్టుకోవడం కాదు కొట్టుకోండి
ఇక తెల్లారగానే మాధవ మళ్లీ కూల్ అయిపోతాడు. మీరు ఇంత త్వరగా కూల్ అవుతారని నేను అనుకోలేదు పెద్ది అంటుంది. అయినా కూల్ కాకపోవడానికి మీరేమైనా పరాయివాళ్లా.. మీ మీద నాకు ఏమైనా పగలు ఉన్నాయా.. అని మాధవ అంటాడు. ఇంతలో కేశవ-చక్రి మళ్లీ గొడవ పడుతుంటారు. వీళ్లకి ఇదే పనైపోయిందని మాధవ వెళ్తుంటే మీరు ఉండండి నేను చూస్తా అని మహా వెళ్తుంది. అదేంటి కాలర్ కాలర్ పట్టుకొని ఎంతసేపు అలా ఉంటారు.. కొట్టుకోండి.. రక్తాలు రావాలి.. ఇక్కడ కొట్టుకుంటే ఏం సరిపోతుంది.. వీధిలోకి వెళ్లి కొట్టుకుంటే నలుగురూ చూస్తారు వెళ్లండి అంటూ వెటకారం ఆడుతుంది. దీంతో ఇద్దరూ ఆగిపోతారు

ఏంటి నా మీద కోపం తగ్గిందా

ఏంటి నా మీద కోపం తగ్గిందా
ఇక మాధవ అందరికీ టీ ఇస్తుంటే.. మీ నాన్నగారికి నేను ఇచ్చి వస్తానని తీసుకొని ఆరుబయటకి వెళ్తుంది. ఏంటి నువ్వు తీసుకొచ్చావ్.. నువ్వు గానీ చేశావా అని నారాయణ అంటాడు. అంత కంగారుపడకండి.. నేను ఏం చేయలేదులే.. మీ పెద్ద అబ్బాయే చేశాడని అంటుంది. మంచిది.. నువ్వు ఏమైనా ప్రయోగాలు చేయాలంటే చక్రి గాడి మీద చెయ్.. వాడు ఎలక లాంటోడు.. నీ ప్రయోగాలకి సరిగ్గా సరిపోతాడని అంటాడు. ఇదిగో ఈ కుళ్లు జోకులు వేశారంటే నేనే టీ తీసుకొచ్చి మీ నోటిలో పోస్తా అంటుంది. దీనికి నారాయణ నవ్వుతాడు. ఏంటి నా మీద కోపం తగ్గిందా అని మహా అడుగుతుంది. నీ మీద కోపపడితే నాకు గుక్కెడు మందు కూడా దొరకదని నారాయణ సరదాగా అంటాడు.

నువ్వు అటు తిరుగమ్మా నాకు సిగ్గేస్తుంది

నువ్వు అటు తిరుగమ్మా నాకు సిగ్గేస్తుంది
సరే అయితే మీ కట్టు తీసి కొత్తగా డ్రెస్సింగ్ చేస్తా ఉండండి అంటుంది మహా. ఏంటి నువ్వా.. వద్దు నేను చేసుకుంటానులే అంటాడు నారాయణ. అదేం కుదరదు నేను చేస్తానని అందర్నీ పిలుస్తుంది. వద్దమ్మా.. వీళ్లు ఉన్నారు కదా వీళ్లు చేస్తారులే అంటాడు. దీంతో చక్రి-కేశవ.. నారాయణ దెబ్బకి డ్రెస్సింగ్ చేస్తారు. నువ్వు అటు తిరుగమ్మా నా పొట్ట చూసి నువ్వు నవ్వుతావ్.. నాకు సిగ్గుగా ఉంటుంది అంటాడు నారాయణ. దీంతో మహా అటు తిరిగి నిల్చుంటుంది. కొడుకులు నలుగురూ నారాయణకి డ్రెస్సింగ్ చేసి ఆటపట్టిస్తారు.

గ్యారేజ్‌లో ప్రేమాయణం

గ్యారేజ్‌లో ప్రేమాయణం
ఇక కేశవ గ్యారేజ్‌లో పని చేసుకుంటుంటే బుస్సు అక్కడికి వస్తుంది. ఏంటి బుస్సు ఇలా వచ్చావని అడిగితే మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుందామని అంటుంది. ఏంటని అడిగితే నా ఫాలోవర్లు నా కోసం ఎదురుచూస్తుంటారు.. మీరు నాకు ఒక్కసారి ఫోన్ ఇస్తే ఒక్క రీల్ చేసి అప్‌లోడ్ చేస్తా.. అప్పుడు నా ఫాలోవర్లు, నేను అందరం హ్యాపీ అవుతామంటుంది. మొదట కేశవ కుదరది చెప్పినా చివరికి ఒప్పుకుంటాడు. కానీ శైలు చేతికి తన చేతికి కలిసి గొలుసు వేస్తాడు. ఇక కేశవ చేయి పట్టుకునే రీల్స్ చేస్తుంది శైలు. కేశవకి మాత్రం ఏదేదో అవుతూ ఉంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.

పెద్దికి సంబంధాలు చూద్దాం

పెద్దికి సంబంధాలు చూద్దాం

పెద్దికి సంబంధాలు చూద్దాం
తరువాయి భాగం ప్రోమోలో చక్రి-కేశవ-కన్నా ముగ్గురితో మహా బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. పెద్దికి మనం పెళ్లి సంబంధాలు చూద్దామని అంటుంటే మాధవ వస్తాడు. ఏంటి మళ్లీ నలుగురు కలిసి ఏం ప్లాన్ చేశారని అడుగుతాడు. ఏం లేదు పెద్ది మీ ప్రొఫైల్.. మ్యాట్రిమొనీ సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నాం.. మీకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తామంటుంది. మాధవ తెల్లమొహం పెట్టేసరికి ఏ గాయత్రి వేరే సంబంధం చేసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు చేసుకోకూడదని మహా అంటుంది.

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *