Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: దినేష్‌తో చేతులు కలిపిన గుణ.. కిడ్నాప్‌లో కేసులో రోహిణి‌కి బిగిసిన ఉచ్చు.. ఖతం గయా

 Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: దినేష్‌తో చేతులు కలిపిన గుణ.. కిడ్నాప్‌లో కేసులో రోహిణి‌కి బిగిసిన ఉచ్చు.. ఖతం గయా

Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: దినేష్‌తో చేతులు కలిపిన గుణ.. కిడ్నాప్‌లో కేసులో రోహిణి‌కి బిగిసిన ఉచ్చు.. ఖతం గయా

ప్రభావతి.. శివపై దొంగతనం కేసు పెట్టడంతో అతనికోసం వేట మొదలైంది. అయితే శివ దొరక్కపోవడంతో అతని తల్లి పార్వతమ్మని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు కిడ్నాప్ కేసులో రోహిణికి ఉచ్చు బిగిసింది. ఈరోజు (ఏప్రిల్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే..

Gundeninda Gudigantalu Serial Today
గుండెనిండా గుడిగంటలు సీరియల్
పార్వతిని పోలీసుల అదుపులో ఉండటంతో స్టేషన్‌కి వస్తారు మీనా, బాలు. నాకు భయంగా ఉంది అక్కా.. అమ్మ లోపలే ఉంది అని కంగారు పడుతుంది సుమతి. ఏం కాదు.. మేం ఉన్నాం కదా అంటూ సుమితిని తీసుకుని లోపలికి వెళ్తారు బాలు, మీనాలు. కూతుర్ని చూసి భోరున ఏడుస్తుంది పార్వతి. ‘మీ తమ్ముడు చూడే నాకు ఎలాంటి పరిస్థితి తీసుకుని వచ్చాడో.. ఇంకెన్ని అవమానాలు పడలో నేను చనిపోయినా బాగుండేది.. ఈ పోలీసులేమో నాకేం తెలియదంటే వినిపించుకోవడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతి. దాంతో బాలు.. ‘సార మా అత్తయ్యని ఎందుకు తీసుకొచ్చారు’ అని నిలదీస్తాడు. ‘దొంగ దొరక్కపోతే దొంగకి సంబంధించిన వాళ్లని తీసుకుని వస్తామని తెలియదా? అని అంటాడు ఎస్ఐ. ‘లేదు సార్.. వాడు అలాంటి పనులు చేయడు’ అని అంటాడు బాలు. ‘కంప్లైంట్ ఇచ్చింది మీ అమ్మే కదా’.. అని ఎస్ఐ అనడంతో.. ఇంట్లో గొడవల వల్లే అలా చేసింది సార్ అని అంటాడు బాలు. ఆ మాట ఆవిడతో చెప్పించు.. ఈమెను వదిలేస్తాం.. అయినా ఇది పంచాయితీ కాదు పోలీస్ స్టేషన్ అని అంటాడు ఎస్ఐ.You May Like
మీ తమ్ముడ్ని అప్పగించి.. మీ అమ్మని తీసుకెళ్లు.. లేదంటే!!
మీ తమ్ముడ్ని అప్పగించి.. మీ అమ్మని తీసుకెళ్లు.. లేదంటే!!

మీ తమ్ముడ్ని అప్పగించి.. మీ అమ్మని తీసుకెళ్లు.. లేదంటే!!
పవర్ చేతిలో ఉంది కదా అని తప్పు చేయని వాళ్లని శిక్షించడం కరెక్ట్ కాదు సార్ అని బాలు తిరగబడతాడు. చట్టం గురించి మాకు చెప్తున్నావా? వాడ్ని దాచి పెట్టింది నువ్వేనని నాకు తెలుసు.. చూస్తా ఎంత కాలం వాడ్ని దాస్తావో చూస్తా’ అని అంటాడు ఎస్ఐ. ఇంతలో మీనా కల్పించుకుని.. ‘దయచేసి మా అమ్మని వదిలిపెట్టండి సార్.. అని బ్రతిమిలాడుతుంది. ఇక సెంటిమెంట్‌లు ఉండవు.. మీ తమ్ముడ్ని అప్పగించి మీ అమ్మని తీసుకుని వెళ్లండి. లేదంటే ఎఫ్ఐఆర్‌లో మీ పేర్లు కూడా చేర్చాల్సి ఉంటుంది. మీరంతా బయటకు పొండి’ అని తిట్టి పంపేస్తాడు ఎస్ఐ.

పార్వతి రిలీజ్.. కానీ ఓ కండిషన్
పార్వతి రిలీజ్.. కానీ ఓ కండిషన్

పార్వతి రిలీజ్.. కానీ ఓ కండిషన్
దాంతో పార్వతి అక్కడే కూలబడి ఏడుస్తుంది. ఇక బాలు, మీనలు ఎస్ఐ కోసం బయటే ఎదురుచూసి.. అతన్ని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో చల్లబడిన ఎస్ఐ.. ‘మీకు ఒక్కరోజు టైమ్ ఇస్తున్నా.. ఆలోపు ఆ శివని తీసుకొచ్చి అప్పగించండి. ప్రస్తుతానికి అయితే ఆవిడ్ని పంపిస్తున్నా’ అని అంటాడు ఎస్ఐ. ఇక పార్వతి.. ‘వాడు చేసిన తప్పుకి నేను ఎన్ని అవమానాలు పడాలో.. వాడ్ని తీసుకొచ్చి అప్పగించేయండి.. అని అంటుంది. ‘లేదు అత్తయ్యా.. మన వాళ్లని మనమే వదిలేస్తే ఎలా.. వాడికి ఇలాంటి టైమ్‌లోనే కదా అండగా ఉండాలి.. ముందు మీరు రండి’ అని ధైర్యం చెప్పి తీసుకుని వెళ్తాడు బాలు.

దయచేసి ఈ పెళ్లి ఆపొద్దయ్యా.. చేతులు జోడించి వేడుకున్న పార్వతమ్మ

దయచేసి ఈ పెళ్లి ఆపొద్దయ్యా.. చేతులు జోడించి వేడుకున్న పార్వతమ్మ
ఇక ఇంటికి వచ్చిన తరువాత వాడి వల్ల నేనే కాకుండా మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది పార్వతమ్మ. ఇంతలో పెళ్లి వాళ్లు వచ్చి.. ‘ఈ పెళ్లి జరగదు అని బాంబ్ పేల్చుతారు. మీకు డబ్బు లేకపోయినా మీ కుటుంబం గౌరవాన్ని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం.. మీదో పెద్ద దొంగల ముఠా అని ఆ వీడియో చూస్తే తెలిసింది.. అని నోటికొచ్చినట్టు మాట్లాడతారు. దాంతో పార్వతమ్మ.. ‘దయచేసి అలా మాట్లాడకండమ్మా.. తప్పు చేసింది నా కొడుకు కానీ నా కూతురు కాదు.. దయచేసి ఈ పెళ్లి ఆపొద్దు.. దాని జీవితాన్ని నాశనం చేయొద్దు’ అని చేతులు జోడించి వేడుకుంటుంది.

నా కూతురి జీవితం నాశనం అయిపోయిందే మీనా

నా కూతురి జీవితం నాశనం అయిపోయిందే మీనా
మేం నిర్ణయం తీసేసుకున్నాం.. నా మాట కూడా మా అమ్మనాన్నల మాటే అని అంటాడు పెళ్లి కొడుకు. దాంతో బాలు.. ‘లేదు సార్.. వాడు దొంగ కాదు.. మా కుటుంబ గొడవల వల్లే ఇలా అయ్యింది. ఆ బ్యాగ్ ఎవరిదో కాదు మా అమ్మదే ’అని అంటాడు. ‘ఏంటీ మీ అమ్మదా? అంటే వియ్యంకుల బ్యాగే కొట్టేశాడా.. ఇలాంటి వాళ్లతో వియ్యం అందాలంటే మాకే సిగ్గుగా ఉంది.. ఇది జరగదు. మా అమ్మాయితో పాటు ఇంటి గౌరవం కూడా ముఖ్యమే.. ఈ పెళ్లి జరగదు’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. దాంతో పార్వతమ్మ.. వాళ్ల చేతులు పట్టుకుని బ్రతిమిలాడినా వినిపించుకోరు. దాంతో అయ్యో నా కూతురు జీవితం నాశనం అయిపోయిందే మీనా అంటూ ఏడుస్తుంది.

ప్రాణాపాయంలో దినేష్.. రోహిణికి షాకిచ్చిన గుణ

ప్రాణాపాయంలో దినేష్.. రోహిణికి షాకిచ్చిన గుణ
దాంతో సుమితి.. ‘ఈ పెళ్లి ఆగిపోతే ఏమైందమ్మా.. నాకు అసలు ఈ పెళ్లే వద్దు’ అని అంటుంది. ‘లేదు సుమతీ.. వీళ్లు కాకపోతే మరొకరు.. మనిషి విలువని ఒక సంబంధం నిర్ణయించదు.. అప్పటి వరకూ ధైర్యంగా ఉండు.. మేం లాయర్‌ని కలిసి వస్తాం’ అని వెళ్తారు. అటు స్నేహితురాలని తీసుకుని మళ్లీ గుణ దగ్గరకు వెళ్తుంది రోహిణి. ఆ వీడియో గుణ గాడికి ఇచ్చేశాం.. దినేష్‌ని కిడ్నాప్ చేయడంతో మన డీల్ అయిపోయింది కదా.. మళ్లీ ఎందుకు పిలిచాడే వీడు అని అంటుంది రోహిణి ఫ్రెండ్. ‘ఏమోనే నాకూ అదే అర్థం కావడం లేదు.. వీడు ఏం ఫిటింగ్ పెడతాడో చూద్దాం పదా’ అని గుణ దగ్గరకు వెళ్తారు.

వీడు చస్తే.. ఆ నేరం మీపై వేస్తా

వీడు చస్తే.. ఆ నేరం మీపై వేస్తా
ఇక గుణ.. కిడ్నాప్ చేసి దినేష్‌ని ప్రాణాపాయంలో ఉన్నాడని అతన్ని చూపిస్తాడు. నాలుగురోజుల నుంచి కొడుతూనే ఉన్నా కదా.. గుండెపట్టుకుని పడిపోయాడు. కళ్లు తెరవడం లేదు అని అంటాడు గుణ. డాక్టర్ వచ్చి చూసి.. వాడ్ని వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాలని అంటున్నారు.. లేదంటే వారం కంటే ఎక్కువ బతకడట. హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తే పోలీస్ కేసు అవుతుంది.. ఇలాగే వదిలేస్తే వాడు చచ్చినా చస్తాడు.. అప్పుడు ఇంకా పెద్ద సమస్య అవుతుంది. పోలీసులు నన్ను పట్టుకుంటే నేను మీ పేర్లే చెప్పాల్సి వస్తుంది అని షాక్ ఇస్తాడు గుణ. దాంతో రోహిణి.. ‘ఏంటీ మా పేర్లు చెప్తావా? అని కంగారుపడుతుంది.

రెండు లక్షలు ఇస్తావా? చస్తావా??

రెండు లక్షలు ఇస్తావా? చస్తావా??
నాకు వేరే దారిలేదు.. నాకు కేరళలో తెలిసిన హాస్పిటల్ ఉంది.. అక్కడికి తీసుకుని వెళ్తే తొందరగా కోలుకుంటాడు అని అంటాడు గుణ. అదేదో తొందరగా చెయ్ అని రోహిణి అంటే.. ‘దానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది’ అని అంటాడు గుణ. మీరు డబ్బులు వడ్డీకి ఇస్తారు కదా.. మీ దగ్గర డబ్బులు లేవా? అని అంటుంది రోహిణి. వాడి ఖర్చులు నేను ఎందుకు భరించాలి? ఆ రెండు లక్షలు ఇస్తే వాడ్ని కేరళకి పంపిస్తా.. లేదంటే అందరికీ ప్రమాదమే’ అని అంటాడు గుణ. నా దగ్గర అంత డబ్బు లేదు అని రోహిణి అనడంతో.. ‘మీరు ఇంతలా కంగారు పడుతున్నారంటే..ఏదో పెద్ద తప్పే చేస్తున్నారు. ఇప్పుడు వాడు చనిపోతే పోలీసులు నేరుగా మీ ఇంటికే వస్తారు చూసుకోండి మరి’ అని అంటాడు గుణ.

గుణతో చేతులు కలిపిన దినేష్.. ఇదంతా వీడి ప్లానే

గుణతో చేతులు కలిపిన దినేష్.. ఇదంతా వీడి ప్లానే
ఆ మాటతో రోహిణి.. ‘దేవుడా.. ఏంటి నాకు ఈ కర్మ.. ఏదోటి చేస్తానులే’ అంటూ కంగారుగా వెళ్తుంది. అయితే వాళ్లు అలా వెళ్లగానే తన నిజస్వరూపం బయటపెడతాడు గుణ. ‘అన్నా నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది.. రాజకీయాల్లో అని కిడ్నాప్ చేసిన రౌడీలు అంటే.. ఇది నా ప్లాన్ కాదు.. రా చూపిస్తాను అంటూ దినేష్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు దినేష్ కళ్లు తెరుస్తాడు. ‘వర్కౌట్ అయ్యింది కదా గురూ.. నేను చెప్పాను కదా.. ఎంత అడిగినా అది ఇస్తుందని. ఇప్పటికైనా నన్ను బయటకు పంపించెయ్ గురూ’ అని అంటాడు దినేష్. పంపిస్తా.. పంపిస్తా.. అది డబ్బులు ఇవ్వగానే పంపిచేస్తా’ అని అంటాడు గుణ. ఇవ్వక ఎక్కడికి పోతుంది గురూ.. తప్పకుండా ఇస్తుంది అని అంటాడు దినేష్.

ఉన్నది ఒకటే దారి..

ఉన్నది ఒకటే దారి..
అటు మీనా, బాలులు లాయర్‌ని కలుస్తారు. ఈ కేసు నుంచి బయటడాలంటే చాలా ఖర్చు అవుతుంది అని చెప్తాడు లాయర్. దాంతో మనకి ఉన్నది ఒకటే దారి.. అమ్మ కేసుని వెనక్కి తీసుకోవాలి అని మీనాతో చెప్తాడు బాలు. మనం చెప్తే మీ అమ్మ వినదు అని మీనా అంటుంది. మనం అడిగితే అస్సలు చేయదు.. నాన్న చెప్తే వింటుంది. నాన్నే అమ్మని ఒప్పిస్తారు’ అని అంటాడు బాలు. కానీ నాన్న కూడా శివని నమ్మడం లేదు కదా అని మీనా అంటే.. ‘శివ ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందో నాన్నకి చెప్దాం.. ఆయనకి న్యాయం అనిపిస్తే తప్పకుండా సాయం చేస్తారు’ అని అంటాడు బాలు.

ఏం తెలుసా నీకు.. గతంలోకి బాలు.. సత్యం ఎమోషనల్

ఏం తెలుసా నీకు.. గతంలోకి బాలు.. సత్యం ఎమోషనల్
ఇక బాలు, మీనాలు వెళ్లి సత్యంని కన్వెన్స్ చేస్తుంటే మధ్యలో మనోజ్ అడ్డుకుంటాడు. దాంతో బాలు అతని కాలర్ పట్టుకుని అక్కడొక జీవితం నాశనం అయిపోతున్నా కేసులు, జైలు అంటావ్ ఏంట్రా అని కోప్పడతాడు. చేయని నేరానికి శిక్ష పడిన వాడు ఎంత నలిగిపోతాడో నీకు తెలుసా? అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు బాలు. ఇంతలో సత్యం కల్పించుకుని ఏంట్రా ఈ ఆవేశం అని అంటాడు. మనోజ్ మౌనంగా వెళ్లిపోవడంతో.. ఏంటి అలా వెళ్లిపోతున్నాడూఅని అడుగుతుంది మీనా. గతమే వాడి నోరు మూయిస్తుందమ్మా అని అంటాడు సత్యం.

దయచేసి ఆదుకోండి మామయ్యా..

దయచేసి ఆదుకోండి మామయ్యా..
గతమా? గతం ఏంటి? అని అంటుంది మీనా. తెలియాల్సినప్పుడు తెలుస్తుంది అని అంటాడు సత్యం. ‘ఆవేశంలో అమ్మ తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి.. సుమతి పెళ్లి కూడా ఆగిపోయింది. శివ తప్పు చేశాడని సుమతికి శిక్ష వేశారు. వాడు చిన్న వయసులోనే జైలుకి వెళ్తే వాడి జీవితం కూడా నా జీవితంలాగే రోడ్డున పడుతుంది. దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి మామయ్యా’ అంటూ చేతులు జోడించి అడుగుతుంది మీనా. అయితే సమాధానం చెప్పకుండానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు సత్యం. అనంతరం ప్రభావతి దగ్గరకు వెళ్లి కేసు వెనక్కి తీసుకోమని అడుగుతాడు.

కేసు వాపస్ తీసుకుంటాను.. కానీ ఒక్క షరతు!!

కేసు వాపస్ తీసుకుంటాను.. కానీ ఒక్క షరతు!!
మీరు దాని కోసమే వచ్చారని అనుకున్నాను అని ఆగ్రహంతో ఊగిపోతుంది ప్రభావతి. ‘ఈ కేసు వెనక్కి తీసుకుని మన ఇంటికి వచ్చేయ్’ అని అంటాడు సత్యం. ‘తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి’ అని అంటుంది ప్రభావతి. దాంతో సత్యం.. ‘మన ఇంట్లో తప్పు ఎవరు చేయలేదు.. దొంగతనం ఎవరు చేయలేదు.. ఆవేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. చిన్న వయసులోనే వాడి జీవితం నాశనం అవుతుంది.. జీవితాంతం దొంగలా బతకాల్సి వస్తుంది’ అని అంటాడు సత్యం. దాంతో ప్రభావతి.. ‘మీరు చెప్పినట్టే చేస్తాను.. కేసు వాపస్ తీసుకుంటాను.. కానీ ఒక్క షరతు.. ఆ పూలు అమ్మే మీనా మన ఇంట్లో ఉండకూడదు.. అది మన ఇంట్లో నుంచి వెళ్తేనే నేను మన ఇంట్లో అడుగుపెడతా’ అని మెలిక పెడుతుంది. మరి సత్యం ఏం నిర్ణయం తీసుకున్నాడో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *