Gundeninda Gudigantalu Today మార్చి 27 ఎపిసోడ్: మీనా పశ్చాత్తాపం! శివ సూసైడ్! దద్దరిల్లిపోయిన ఎపిసోడ్..

 Gundeninda Gudigantalu Today మార్చి 27 ఎపిసోడ్: మీనా పశ్చాత్తాపం! శివ సూసైడ్! దద్దరిల్లిపోయిన ఎపిసోడ్..

Gunde Ninda Gudi Gantalu 2026 March 27 Episode: శివ దొంగతనం చేసిన వీడియోను రోహిణి ప్రభావతికి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి కోపంతో రగలిపోతుంది. మీనా కుటుంబం దొంగల ఫ్యామిలీ అంటూ నిందలు వేస్తుంది. ఆవేశంగా మీనా ఇంటికి చేరుకున్న ప్రభావతి శివను చెప్పుతో కొడుతుంది. శివ దొంగతనం చూసిన వీడియో చూసిన మీనా, పార్వతి కుప్పకూలిపోతారు. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. శుక్రవారం(మార్చి 27) నాడు ఏం జరిగిందో చూద్దాం.

Gunde Ninda Gudi Gantalu 2026 March 27 Episode (photo courtesy by star maa and JioHotstar)
గుండెనిండా గుడిగంటలు (photo courtesy by star maa and JioHotstar)

గుండెనిండా గుడిగంటలు

Gunde Ninda Gudi Gantalu 2026 March 27 Episode: శివ దొంగతనం వీడియో బయటకు రాగానే, ప్రభావతికి ఒక ఆయుధం దొరికినట్లయింది. నేరుగా మీనా పుట్టింటికి వెళ్ళి హంగామా సృష్టించింది. మీనా తమ్ముడిని చెప్పుతో కొడుతుంది. మీనా కుటుంబాన్ని ‘దొంగల కుటుంబం’ అంటూ ప్రభావతి తీవ్రంగా దూషిస్తుంది. ప్రభావతి రెచ్చిపోతూ.. “అసలు మీది కుటుంబమా లేక దొంగల ముఠా నా? నువ్వే క్లూ ఇచ్చావు కాబట్టే, ఆ శివ గాడు నా దగ్గర డబ్బున్న టైమ్ చూసి మరీ చేతివాటం ప్రదర్శించాడు” అంటూ మీనాపై అవమానకరంగా నిందలు మోపుతుంది. ప్రభావతి మాటలకు నాలుగు ఎక్కేసి చెబుతూ.. “ఏంటి మీనా.. ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావా? అత్తయ్య చెప్పేది నిజమే. ఇంట్లో మనుషుల సాయం లేకుండా బయటవాడు దొంగతనం చేయలేడు కదా” అని అంటుంది. అప్పుడే శివ తట్టుకోలేక బయటకు వచ్చి తల్లి, అక్క కాళ్లపై పడతాడు. శివ బాధపడుతూ..”అక్కా.. నన్ను క్షమించు. నాకు ఆ డబ్బు మీద ఆశ లేదు. ఆ రోజు అత్తయ్య నన్ను ఘోరంగా అవమానించారు.. ఆ కోపంతో బుద్ధి చెప్పాలనే అలా చేశాను. కానీ అది ఇంత పెద్ద గొడవ అవుతుందని అనుకోలేదు” అని నిజాన్ని చెబుతాడు. అయినప్పటికీ ప్రభావతి మాత్రం ఏ మాత్రం కరగదు.

ప్రభావతిపై తిరగపడ్డ కాలనీ వాసులు

ప్రభావతిపై తిరగపడ్డ కాలనీ వాసులు

ప్రభావతిపై తిరగపడ్డ కాలనీ వాసులు

ప్రభావతి శివ కాలర్ పట్టుకుని ..”బుద్ధి చెప్పడానికా? ఇప్పుడు నేను నీకు బుద్ధి చెబుతాను రా.. పద పోలీస్ స్టేషన్‌కి” అంటూ శివను ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్తుంటే, ఆమెనుని కాలనీ వాసులు అడ్డుకుంటారు. “తప్పు ఒప్పుకున్నాడు కదా వదిలేయండి” అని వారు హెచ్చరిస్తారు. అయినా ప్రభావతి తగ్గకుండా, శివ దొంగిలించిన డబ్బుతో కుటుంబం జల్సాలు చేస్తున్నారని, సుమతి పెళ్లి కూడా ఆ డబ్బుతో చేయాలని చూస్తున్నారంటూ మీనా కుటుంబంపై నిందలు వేస్తుంది. దీంతో కాలనీ ప్రజలు మీనా కుటుంబానికి మద్దతుగా నిలుస్తారు. ప్రభావతి వ్యవహరించిన తీరుపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో రోహిణి జోక్యం చేసుకుని, ‘ఇప్పుడు వెనక్కి తగ్గకపోతే మనపై అందరూ తిరగబడతారు’ అంటూ ప్రభావతిని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది.

బాలు బావకు ఇదంతా ముందే తెలుసు .. నిజం చెప్పిన శివ..
బాలు బావకు ఇదంతా ముందే తెలుసు .. నిజం చెప్పిన శివ..

బాలు బావకు ఇదంతా ముందే తెలుసు .. నిజం చెప్పిన శివ..
ప్రభావతి గొణుగుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్తూ వెళ్తూ.. నిన్ను నా ఇంట్లో కాలు పెట్టనివ్వను మీనా” అని వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి వెళ్ళిపోయిన తర్వాత మీనా తల్లి పార్వతి తీవ్ర మనోవేదనకు గురవుతుంది. తన భర్త కూడా ‘దొంగ’ అనే ముద్ర పడి ప్రాణాలు తీసుకున్న విషయం గుర్తు చేసుకుని విలపిస్తుంది. పార్వతి ఆవేదనతో.. “శివా.. ఎందుకురా పుట్టావు? నీ తండ్రి ఆ మచ్చ భరించలేకే చనిపోయారు. ఇప్పుడు నువ్వు మళ్లీ అదే దొంగ ముద్రను ఈ ఇంటికి తెచ్చావు. నీ వల్ల మీనా సంసారం ముక్కలైందిరా” అని బాధపడుతుంది. అప్పుడు శివ అసలు నిజాన్ని బయటపెడతాడు. శివ మాట్లాడుతూ.. “అమ్మా.. ఈ విషయం బాలు బావకు ముందే తెలుసు. అందుకే ఆయన నా చెయ్యి విరగ్గొట్టారు. అంటూ జరిగింది అంతా చెబుతాడు.

అన్ని నిజాలు తెలుసుకున్న పార్వతమ్మ.. మీనా పశ్చాత్తాపం..

అన్ని నిజాలు తెలుసుకున్న పార్వతమ్మ.. మీనా పశ్చాత్తాపం..
బావే.. అప్పట్లో ఆ వీడియో డిలీట్ చేయించి నన్ను కాపాడాడు” అని బాలు గొప్పతనాన్ని వివరిస్తాడు. అక్కడే ఉన్న సుమతి మాట్లాడుతూ.. “అంతే కాదు అమ్మా.. శివ ఎగ్జామ్స్ రాయడానికి బాలు బావ తనే జైలుకి కూడా వెళ్లారు. మనల్ని కాపాడటం కోసం ఆయన ఎన్ని నిందలు పడ్డారో మనకు తెలియదు” అంటూ బాలు చేసిన విషయాలను పార్వతికి చెబుతుంది. ఈ మాటలు విన్న మీనా ,పార్వతి గుండెలు తరుక్కుపోతాయి. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న బాలును తప్పుగా అర్థం చేసుకున్నందుకు పార్వతి, మీనాలు పశ్చాత్తాపంతో కుమిలిపోతారు.

సత్యం ఇంట్లో ప్రభావతి ఉగ్రరూపం..

సత్యం ఇంట్లో ప్రభావతి ఉగ్రరూపం..
మీనా, పార్వతమ్మ, సుమతి ముగ్గురూ తమ బాధలో తాము ఉండగా.. శివ మనస్తాపంతో ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అది ఎవరూ గమనించుకోరు. ముఖ్యంగా మీనా తన భర్త గతంలో చేసిన విషయాలను గుర్తు తెచ్చుకుని.. తనని తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతుంది. తానే తన భర్త గురించి తప్పుగా ఆలోచించానని కుమిలిపోతుంది. మరోవైపు సత్యం ఇంట్లో అందరూ శివ దొంగతనం వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభావతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభావతి ఆవేశంతో ఊగిపోతూ “చూశారా.. ఈ మీనా తమ్ముడు మన కుటుంబ గౌరవాన్ని ఎలా బజారున పడేశాడో. అసలు ఆ దొంగల కుటుంబంతో మనకు సంబంధం ఏంటి? నా కొడుకు బతుకును అది పాడుచేసింది” అని అంటుంది.

ప్రభావతిని రెచ్చగొట్టిన రోహిణీ..

ప్రభావతిని రెచ్చగొట్టిన రోహిణీ..
సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న రోహిణి, తన నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ మీనాపై మరింత విషం చిమ్మింది. రోహిణి మరింత తన వక్రబుద్దిని బయటపెడుతూ.. “అత్తయ్య .. నిజం చెప్పాలంటే నాకు చాలా భయమేస్తోంది. నేను అబద్ధాలు చెప్పలేను కానీ.. మీనా, బాలు ఇద్దరికీ ఆ లక్ష రూపాయల దొంగతనం విషయం ముందే తెలుసు, తెలిసినా మనందరినీ మోసం చేస్తూ ఆ నిజాన్ని దాచిపెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఇంతగా వంచిస్తారని నేనైతే అస్సలు అనుకోలేదు” అంటూ నాలుగు మాటలు ఎక్కేసి చెబుతుంది.

మీనా లేదు ఇక రాదు..

మీనా లేదు ఇక రాదు..
రోహిణి మాటలకు ఊతమిస్తూ, మనోజ్ కూడా పాత పగను గుర్తుచేసుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ..”అవును అమ్మా.. ఆ రోజు నా మీద ఎంతగా అరిచాడు. ఎంతగా అవమానించాడు.. అసలు దొంగ ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది కదా, వాళ్ళే దొంగతనాలు చేస్తూ.. నాపై నిందలు వేయడం ఏంటి? ” అని మనోజ్ కూడా బాలు, మీనాలపై రగిలిపోతాడు. అక్కడే ఉన్న సత్యం ఎవరి మాట నమ్మాలో తెలియక తీవ్ర ఆలోచనలో పడిపోయారు. వీడియో సాక్ష్యం కనిపిస్తుండటంతో ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయారు. మరోవైపు బాలు… తిరుపతి నుంచి తిరిగి వస్తాడు. ఇంట్లో ఏం జరిగిందో అతనికి తెలియదు. తండ్రి సత్యానికి ప్రసాదం ఇవ్వబోతే ఆయన నిరాకరిస్తాడు. మీనా మీనా అని పిలిస్తే సత్యం.. ‘లేదు’ అంటాడు. ప్రభావతి ‘ఇక రాదు’ అంటుంది.

ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది?  బాలు షాక్..

ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? బాలు షాక్..
బాలు.. కోపంగా ‘నా భార్య ఏమైంది? ఏమన్నారు?’ అంటూ అరుస్తాడు. దాంతో ప్రభావతి..”ఆ దొంగల కుటుంబం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు.. మీనా ఇక ఈ ఇంటికి రాదు” అని చెబుతుంది. పక్కనే ఉన్న మనోజ్ వ్యంగ్యంగా ..”ఏంటి బాలు.. ఇంకా నటిస్తున్నావా? నీ బామ్మర్ది శివ దొంగతనం చేసిన వీడియో చూడు. ఇది నీకు ముందే తెలుసు కదా?” అంటూ బాలుకి వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. వెంటనే బాలు .. “మనోజ్ ఈ వీడియో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు పంపారు?” అని ప్రశ్నిస్తాడు. “అంటే నీకు ఈ విషయం ముందే తెలుసన్నమాట, తెలిసినా మా అందరినీ మోసం చేస్తూ దాచిపెట్టావా?” అని బాలుని మనోజ్ నిలదీస్తాడు. అక్కడితో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.

చావుకి సిద్ధపడిన శివ.. కాపాడిన బాలు.. అదిరిపోయిన సీన్..

చావుకి సిద్ధపడిన శివ.. కాపాడిన బాలు.. అదిరిపోయిన సీన్..
ఇంట్లో జరిగిన ఘోర అవమానం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో శివ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఒకవైపు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారనే వార్త అతన్ని భయపెడుతుంది. అదే సమయంలో పోలీసులు శివ ఇంటికి చేరుకుంటారు. అరెస్ట్ గ్యారెంటీ అని తెలిసిన శివ, ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోవడానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయానికి బాలు మీనా ఇంటికి వస్తాడు. మీనా ఏడుస్తూ బాలు గుండెలపై వాలిపోతుంది. ‘ఇంత జరిగాక శివ కనిపించడంలేదంటే ఏదైనా చేసుకుంటాడేమో’ అని బాలు పరుగుతీస్తాడు. బాలు వెనుకే మీనా, పార్వతమ్మ, సుమతి కూడా పరుగుతీస్తారు. నిజంగానే శివ మేడపైనుంచి దూకబోతుంటే.. ఆపి పక్కకు లాగేస్తాడు బాలు. నేను ఉండగా ఏం కాదని శివకు భరోసా ఇస్తాడు. దీంతో ఈ గండం నుంచి బాలు మీనా కుటుంబాన్ని ఎలా కాపాడతాడో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *