జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే

 జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే

జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే

Ys Jagan Mohan Reddy Horoscope 2026: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతకం ఎలా ఉంటుందో చెబుతూ కీలక అంశాలను పిడపర్తి ప్రస్తావించారు.

హైలైట్:

తాడేపల్లి వైసీపీ ఆఫీసులో ఉగాది వేడుకల నిర్వహణ

వైఎస్ జగన్ జాతకంపై పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి

జగన్ జాతకం వీక్.. భారతి జాతకం బలంగా ఉందన్నారు

Ys Jagan Mohan Reddy

వైఎస్ జగన్ జాతకం 2026

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతకం పై వైఎస్సార్‌సీపీ నిర్వహించిన పంచాగ శ్రవణంలో సిద్ధాంతి పిడపర్తి సుబ్రమణ్యశాస్త్రి ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ఈ ఏడాది వైఎస్ జగన్ ‌‌ జాతకం వీక్‌గా (బలహీనంగా) ఉందని.. సామాన్య ఫలితాలు ఉంటాయని తెలిపారు. వైఎస్ జగన్‌ది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి అని పిడపర్తి వివరించారు. ఈ ఏడాది జాతకంలో సామాన్య ఫలితాలు ఉంటాయని.. అయితే వచ్చే ఏడాది, ఆ పై ఏడాది మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. వైఎస్ జగన్ జాతకం బలహీనంగా ఉన్నా.. ఆయన భార్య భారతిది రోహిణి నక్షత్రం బలంగా ఉందన్నారు. ఆ ప్రభావంతో జగన్‌ అనుకున్న వాటిలో ముందుకెళ్లే అవకాశం ఉందని వివరించారు. జగన్ చిన్నగా ప్రయత్నం ప్రారంభిస్తే.. అది పెద్దగానే పూర్తవుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో మంచి పునాది పడుతుందన్నారు. జగన్ జాతకం గురించి ముందే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పానన్నారు పిడపర్తి.

‘రాష్ట్రంలో రాజులంతా నీతిమంతమైన పరిపాలన అందిస్తారు. ఈ ఏడాది పంటలతో సుభిక్షంగా ఉంటుంది.. పాడి వృద్ధి ఉంటుంది. ప్రజలు వారి ధర్మ కార్యాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సుఖంగా, సుభిక్షంగా ఉంటారు. అహంకారం, గర్వం, స్వార్థం చూపేవాళ్లు పరాభవం పొందే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్వీయ లాభాపేక్షతో పరస్పర విమర్శలు పెరిగే సూచనలున్నాయి. మంత్రుల శాఖల్లో మార్పు, చేర్పులకు సంకేతాలున్నాయి. అక్టోబరు 31 నుంచి డిసెంబరు 10 వరకు జననష్టం, దుర్భిక్షం వల్ల రాజుల పతనానికి ఆస్కారముంది. గృహనిర్మాణ, ప్రాజెక్టుల పనులు నెమ్మదిస్తాయి. ఈ ఏడాది వర్షాలు చాలా ముందుగా వస్తాయి.. వాటితో ఉపయోగం ఉండదు. జులై 10 తర్వాత కురిసే వర్షాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చిరుధాన్యాల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది’ అని వివరించారు.

వైఎస్ జగన్ మిథున రాశి విషయానికి వస్తే రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.. ఈ ఏడాది ఆదాయం-8, వ్యయం-11, రాజపూజ్యం-1, అవమానం-7గా ఉంది. ఈ రాశివారికి ఈ ఏడాది శని దశమ స్థానంలో ఉంటుంది. రాహువు భాగ్య స్థానంలో ఉంటుంది. ధన స్థానంలో జూన్ నుంచి గురువు సంచారం వల్ల ఈ రాశివారికి ఉత్తమ ఫలితాలు ఉంటాయంటున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *