Mutton Keema: హోలీ రోజున మస్త్ మజా.. మటన్ కీమా లాభాలు తెలిస్తే గిన్నె లేపాల్సిందే..

 Mutton Keema: హోలీ రోజున మస్త్ మజా.. మటన్ కీమా లాభాలు తెలిస్తే గిన్నె లేపాల్సిందే..

Holi special Mutton Keema recipe: మటన్ కీమా ప్రోటీన్, ఐరన్, B-విటమిన్లు, జింక్‌తో నిండిన పోషకాహారం. ఇది కండరాల వృద్ధికి, రక్తహీనత నివారణకు, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, ఎముకల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు తోడ్పడుతుంది. మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి, ఆరోగ్యకరమైన చర్మానికి, మెటబాలిజంకు కూడా కీమా ఉపకరిస్తుంది. ఇంకా బరువు నిర్వహణలోనూ, మెదడు పని తీరును మెరుగుపరచడంలోనూ దోహదపడుతుంది.

Mutton Keema: హోలీ రోజున మస్త్ మజా.. మటన్ కీమా లాభాలు తెలిస్తే గిన్నె లేపాల్సిందే..

మటన్.. అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ఇంకా మటన్ కీమా (Mutton Keema) అంటే.. చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరూ లాగించేస్తారు.. మటన్ కీమా.. అద్భుతమైన రుచికి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. మటన్ కీమాలో.. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ B12, జింక్ వంటి పోషకాలతో కూడిన ఒక పౌష్టికాహారమని.. ప్రతిఒక్కరూ ఈజీగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు డైటీషియన్లు..

మటన్ కీమా.. ఎన్నో పోషకాలు.. మరెన్నో ప్రయోజనాలు..

మటన్ కీమా అత్యున్నత స్థాయి ప్రోటీన్‌తో నిండి ఉంటుంది.. ఇది కండరాల మరమ్మత్తు, వృద్ధి, శరీర బలానికి అవసరం. అంతేకాకుండా, ఇందులో ఉండే ప్రోటీన్ మెటబాలిజంను వేగవంతం చేసి ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది. కీమాలో హేమ్ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో తేలికగా పీల్చబడుతుంది. రక్తకణాల ఉత్పత్తికి, రక్తహీనత నివారణకు దోహదపడుతుంది.

మటన్‌లో జింక్ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. తద్వారా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. విటమిన్ B12, ఇతర B విటమిన్లు శక్తి స్థాయిలను మెరుగుపరుస్తాయి.. మెదడు పనితీరుకు మద్దతు ఇస్తాయి. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. ఫాస్పరస్, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలు, పళ్లను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కీమాలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తిని అందించి.. కొవ్వు-పరంగా విటమిన్లను సమర్థవంతంగా శోషించడంలో సహాయపడతాయి. అయితే.. ఇది మితంగా వినియోగించడం హృదయ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి కూడా తోడ్పడుతుంది. ఈ విధంగా, మటన్ కీమా సమతుల్య ఆహారంలో భాగంగా అనేక కీలకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని.. పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..

హోలీ పండుగ స్పెషల్ మటన్ కీమా.. ఇలా తయారు చేసుకోండి..

మటన్ కీమాను కర్రీగా లేదా ఫ్రైగా చేసుకోని తినవచ్చు.. కీమాను గిన్నెలో లేదా ప్రెజర్ కుక్కర్‌లో సులభంగా, రుచిగా తయారు చేసుకోవచ్చు. నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయించి.. కీమా, పసుపుకారం, ఉప్పు, కారం, టమోటాలు చేర్చి.. కొద్దిగా నీరు పోసి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర గరం మసాలా చల్లుకుంటే వేడివేడి మటన్ కీమా సిద్ధమవుతుంది. ఫ్రై కూడా ఇలానే చేసుకోవచ్చు.. అయితే.. ముదురు మటన్ అయితే.. కుక్కర్ లో వండటం బెస్ట్.. లేదంటే.. చాలా సేపు పట్టే అవకాశం ఉంది.. హోలీ పండుగ వేళ ఇలా మటన్ కీమా చేసుకుంటే.. చిన్నా పెద్దా అందరూ ఇష్టంగా తినవచ్చు..

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *