మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వాటర్ బాటిల్ రూ.299 !!

సినీ తారలు ఇప్పుడు కేవలం వెండితెరపైనే కాదు.. వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. సినిమాలతో పాటు థియేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, క్లాతింగ్ బ్రాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ ఫుడ్ బిజినెస్‌పై సెలబ్రిటీల దృష్టి ఎక్కువైంది. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu ముందువరుసలో ఉన్నారు.

ఇప్పటికే ఏషియన్ గ్రూప్‌తో కలిసి AMB Cinemas మల్టీప్లెక్స్‌ను విజయవంతంగా నడుపుతున్న మహేష్ బాబు.. ఇప్పుడు లగ్జరీ రెస్టారెంట్ బిజినెస్‌లోనూ దూసుకెళ్తున్నారు. ఆయన సతీమణి Namrata Shirodkar, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో “AN Restaurants” పేరుతో ప్రీమియం డైనింగ్ చైన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని Sarath City Capital Mallతో పాటు బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న AVN Palace Heights ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అందుకు కారణం అక్కడి ఫుడ్ కాదు.. ఆ ఫుడ్ బిల్లు!

“వాటర్ బాటిల్ రూ.299 ?”..
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌ను సందర్శించి తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెస్టారెంట్ ఇంటీరియర్, రాయల్ అంబియన్స్, ఫుడ్ టేస్ట్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించినా.. మెనూ ధరలు మాత్రం నెటిజన్లకు పెద్ద షాక్ ఇచ్చాయి. బయట సాధారణంగా ₹20కి దొరికే వాటర్ బాటిల్ అక్కడ ₹299గా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే ₹40 విలువైన డైట్ కోక్ క్యాన్‌కు ₹180 ఛార్జ్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది

బ్లాగర్ ఆర్డర్ చేసినవి:
చికెన్ టిక్కా స్టార్టర్ – ₹725
మటన్ బిర్యానీ – ₹600
రెండు డైట్ కోక్స్ – ₹360 ట్యాక్స్‌లు,
సర్వీస్ ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు ₹1,853 రావడంతో
నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్,
ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
“ఒక బిర్యానీకి EMI వేయాలేమో!” అంటూ ట్రోల్స్
“అంత డబ్బు పెట్టి ఒక ప్లేట్ బిర్యానీ తినే బదులు.. 2 కేజీల మటన్ తెచ్చుకుని ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి వండేస్తాం” అంటూ ఒకరు కామెంట్ చేశారు.
“అక్కడ వాటర్ బాటిల్ తాగితే.. ఇంటికి వచ్చాక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాల్సిందే” అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.
“బిర్యానీ కంటే బాటిల్ రేటు చూసి గుండె ఆగిపోయింది బ్రో!”
“రెస్టారెంట్‌లోకి వెళ్లే ముందు Loan Eligibility చెక్ చేసుకోవాలి”
“AMB అంటే Asian Mahesh Biryani కాదు..
Amount Massive Bill!” అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

డబ్బు పిచ్చితో కూతురితో రెస్టారెంట్ పెట్టించి డబ్బు బాగా గుంజు తున్నాడు మహేష్ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *