రాశిఫలాలు 18 ఏప్రిల్ 2026: ఈరోజు అనఫ యోగం ప్రభావంతో మేషం, తులా సహా ఈ 5 రాశులకు భారీ విజయాలు

 

horoscope today 18 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అనవ యోగం ప్రభావంతో మేషం, తులా సహా ఈ 5 రాశులకు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel Apr18

horoscope today 18 April 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు మీన రాశిలో కుజుడు, బుధుడు, శని గ్రహాలు కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. మేష రాశిలో చంద్రుడు, శుక్రుడు, సూర్యుడు కలిసి ఏక కాలంలో మూడు గ్రహాల కూటమి ఏర్పరచనున్నారు. అంతేకాదు సూర్య చంద్రులకు బుధ, కుజ గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండటం కారణంగా అనఫా, వాశి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మేషం, తులా సహా ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు ఏర్పడే అరుదైన శుభ యోగాల కారణంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మెరుగైన ప్రజాదరణ లభించొచ్చు. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మనోధైర్యం పెరుగుతుంది. మీ ఖర్చులపై నియంత్రణ పాటించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. దీంతో మీరు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే సహోద్యోగుల నుంచి మద్దతు లభించొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక ప్రాజెక్టులలో డబ్బు పెట్టుబడి పెట్టేందుకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ వనరులు కూడా పెరగొచ్చు. ఈరోజు ఎవరికైనా రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు శని దేవుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రుడు, శుక్రుడు, సూర్యుడి అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. మీ కోరికలలో ఒకటి ఈరోజు నెరవేరొచ్చు. దీంతో మీ మనసులో సంతోషంగా ఉంటుంది. ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీరు పాల్గొన్న ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక బలోపేతం కావొచ్చు. వ్యాపారులకు ఊహించిన మేరకు లాభాలు రావొచ్చు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు పనిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే మీకు నష్టాలు రావొచ్చు. వ్యాపారులు కూడా ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చులు చేయాలి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు గ్రహాల కదలికతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సానుకూల ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. ఈరోజు మీరు పనికి సంబంధించి కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో సాన్నిహిత్యంగా గడుపుతారు. మీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలొస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రణాళికల పట్ల గోప్యతను పాటించాలి. ఈరోజు ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టేందుకు నిపుణుల సలహా తీసుకోవాలి. ఈరోజు మీరు సుదూర ప్రయాణాలు చేయొచ్చు. విదేశీ లావాదేవీలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయ

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూల ప్రభావంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ బంధువులతో చాలా ఆనందంగా గడుపుతారు. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయాలు సాధించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ ప్రేమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటా

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. శుక్రుడి ప్రభావంతో మీకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉండకపోవచ్చు. అయితే పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శని దేవుడిని పూజించడం వల్ల మీకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈరోజు పేదలకు దానం చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీ పనులకు ప్రశంసలు లభించొచ్చు. టెక్నాలజీ, ఐటీ రంగాల్లో ఉండే వ్యక్తులకు సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు పెట్టుబడి పెట్టేందుకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీకు పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ, సరైన సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యమైన పనుల్లో మంచి విజయం సాధిస్తారు. ఈ కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.ఈరోజు మీరు ఒక కొత్త ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *