Podarillu Today మార్చి 31 ఎపిసోడ్: నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష.. వదినకి ఇచ్చిపడేసిన మహా.. నారాయణ సేఫ్
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణకి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతుంది. కత్తి లోతుగా దిగలేదని దాని వల్ల ప్రాణాపాయం ఏం లేదని డాక్టర్ చెప్పడంతో మహా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈ విషయాన్ని చక్రికి ఫోన్ చేసి చెప్తుంది. షాకైన చక్రి వెంటనే తాను బయలుదేరి వస్తానని చెప్తాడు. కానీ మహా మాత్రం వద్దని చెప్తుంది. మొత్తానికి కుట్లు వేసి కట్టు కట్టిన కాసేపటికి నారాయణని తీసుకొని మహా ఇంటికి వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం.

Podarillu March 31st Episode: కాలేజ్‌లో జరిగిన గొడవలో నారాయణని ఆది కత్తితో పొడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి నారాయణని తీసుకెళ్తుంది మహా. ఈ విషయాన్ని చక్రికి కాల్ చేసి చెప్తుంది. ఇలా గొడవైంది.. ఆ గొడవలో కత్తి గుచ్చుకుంది అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నారండి.. ఎవరికి గుచ్చుకుందని చక్రి టెన్షన్ పడతాడు. నాకు కాదండీ.. మీ నాన్నకి అని మహా అంటుంది. మా అన్నయ్య కాలేజ్‌కి వచ్చాడు.. నన్ను తీసుకెళ్లడానికి ట్రై చేస్తే మీ నాన్న అడ్డుపడ్డారు.. ఆ గొడవలో మా అన్నయ్య చేతిలో కత్తి మీ నాన్నకి గుచ్చుకుందని మహా అంటుంది. అయ్యో అది గుచ్చుకోవడం అనరండీ.. పొడవడమంటారు.. ముందు మీరు ఏ ఆసుపత్రిలో ఉన్నారు చెప్పండి.. నేను వెంటనే బయలుదేరతానని చక్రి అంటాడు. లేదు లేదు. ప్రాణాపాయం ఏం లేదు.. డాక్టర్ కుట్లు వేశారు.. మేమే కాసేపట్లో బయలుదేరతాం.. ఈ విషయం పెద్ది వాళ్లకి అప్పుడే చెప్పకండి టెన్షన్ పడతారని మహా అంటుంది. సరే మీరు జాగ్రత్తగా రండి.. ఏమైనా అవసరం ఉంటే చెప్పండని చక్రి అంటాడు.
నేను ఆల్ రైటు డాక్టర్.. ఇక పోతా
నేను ఆల్ రైటు డాక్టర్.. ఇక పోతా
మత్తు ఇవ్వడంతో నారాయణ కాసేపు నిద్రబోతాడు. ఇక చూడటానికి వెళ్లిన మహా.. నారాయణ చేసిన సాయం.. అంతకుముందు తనతో సరదాగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని మహా ఎమోషనల్ అవుతుంది. కాసేపటికి మెలుకువ రాగానే నారాయణ ఇంటికెళ్లిపోదామంటాడు. ఇంతలో డాక్టర్ రావడంతో ఎలా ఉంది ఏమైనా నొప్పి ఉందా అని అడుగుతాడు. కొంచెం నొప్పి ఉంది డాక్టర్.. కానీ నేను నడవగలను అంటాడు. అలా అయితే డిశ్చార్జ్ చేస్తాం.. కొన్ని మెడిసిన్స్ రాసిస్తా అవి వాడండి.. వారం రోజుల తర్వాత మళ్లీ ఒకసారి డ్రెస్సింగ్ కోసం రావాలని చెప్తాడు. దీంత సరే అని చెప్పి మహా వాళ్లు ఇంటికి బయలుదేరతారు.
నొప్పి తగ్గడానికి మందు కావాలి
ఇక దారిలో వచ్చేటప్పుడు కారు కుదుపులకి నారాయణకి నొప్పి వస్తూ ఉంటుంది. దీంతో డ్రైవర్‌తో సరదాగా క్వార్టర్ కావాలని అడుగుతాడు. ఇది విన్న మహా.. కారు టీ కోసం ఆపినప్పుడు డైరెక్ట్ వైన్ షాప్‌కి వెళ్తుంది. ఇదేంటి అమ్మాయి ఇలా వైన్ షాప్‌కి వచ్చిందని అందరూ కాస్త తేడాగా చూస్తారు. ఏం కావాలమ్మా అని అడిగితే నొప్పి తగ్గడానికి మందు కావాలంటుంది. అమ్మా నువ్వు మెడికల్ షాప్‌కి వెళ్లాలి ఇక్కడ అలాంటివి దొరకవు అంటాడు. అది కాదు కత్తి గుచ్చుకుంది.. నార్మల్ మెడిసిన్స్ వేస్తే నొప్పిగా ఉందట.. అందుకే ఇది తాగితే మత్తుగా నిద్రపోతారని అంటుంది. దీంతో షాప్ వాడు ఒక క్వార్టర్ ఇస్తాడు.
ఏంటమ్మా నా కోసం వైన్ షాప్‌కి వెళ్లావా?
నొప్పితో అల్లాడుతున్న నారాయణకి ఇదిగో ఈ మందు తాగండని ఇస్తుంది మహా. క్వార్టర్ చూసి నారాయణ షాకవుతాడు. ఇదేంటమ్మా ఇదెవరు ఇచ్చారని అడుగుతాడు. నేనే వెళ్లి తీసుకొచ్చానని చెప్పగానే కోపపడతాడు. ఏంటమ్మా నీ ముందు బీడీ తాగడానికి కూడా నేను ఇబ్బంది పడతాను.. అలాంటిది నువ్వు షాప్‌కి వెళ్లి ఇలా మందు తీసుకురావడమేంటని తిడతాడు. సరే అయితే రిటర్న్ ఇచ్చేయనా అని అంటుంది. వద్దు వద్దు అలా తీసుకోరు.. ఎలాగో తెచ్చావ్ కదా తాగి పెడతాలే అని క్వార్టర్ బాటిల్ లోపలేస్తాడు.దీంతో ఆ మత్తుకి నారాయణకి కాస్త నిద్రపట్టేస్తుంది.
చెప్తే వినాలి చూశారా ఏమైందో?
ఇక మహా వాళ్లు ఇంటికి వచ్చేసరికి బయట నలుగురు అన్నదమ్ములు టెన్షన్‌గా ఎదురుచూస్తుంటారు. నారాయణని అలా చూసి మాధవ బాధపడతాడు. కుర్చీలో కూర్చోపెట్టగానే.. చక్రి-కేశవ ఇద్దరూ మహా మీద కాస్త కోపపడతారు. చెప్తే వినాలి.. చూశారా ఇప్పుడు ఏమైందో.. మీరెవరో అంటూ చక్రి సీరియస్ అవుతాడు. అయినా చెప్పేవాళ్లు వెర్రివాళ్లు అనుకుంటుందా అని చక్రిని చూసి అంటాడు కేశవ. ఆ తిట్టేది ఏదో నన్ను చూసే తిట్టొచ్చని మహా అంటుంది. మొత్తానికి అక్కడ ఏం జరిగింది.. గొడవ ఎలా అయింది ఏంటి అనేది మహా అందరికీ చెప్తుంది.
నీకు ఏమైనా అయితే ఎవరూ లేని
ఇంతలో నారాయణ కొడుకుల్ని తిడతాడు. రేయ్ ఏంట్రా ఇంత చెట్టంత మనిషిని కట్టు కట్టుకొని ఇలా వస్తే.. నాకు ఎలా ఉంది.. కత్తి ఎన్ని ఇంచులు దిగింది.. నొప్పిగా ఉందా అని నన్ను అడగకుండా.. పాపం ఆ అమ్మాయి మీద కోపపడుతున్నారు.. అసలు మీరు నా పుత్రులేనా అని నారాయణ వెటకారం ఆడతాడు. దీంతో మాధవ నారాయణ పక్కనే కూర్చొని.. నాన్న నొప్పిగా ఉందా.. నీకు ఏమైనా జరిగుంటే మేము అమ్మానాన్న లేని అనాథలం అయిపోయేవాళ్లమని కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటాడు. రేయ్ పెద్ద పుత్రా అంత లేదురా.. నా బాన పొట్టే నన్ను కాపాడింది.. కొవ్వు ఉండటం వల్ల కత్తి లోతుగా దిగలేదని నారాయణ సరదాగా అంటాడు.
నేను ఉండుంటే ఈగ కూడా వాలనిచ్చేవాడ్ని కాదు
ఈ సీన్ చూసి మహా అందరికీ సారీ చెప్తుంది. నన్ను అందరూ క్షమించండి.. మీ మాట వినకుండా నేను వెళ్లడం తప్పే.. మా అన్నయ్య ఇంత పని చేస్తాడని నేను ఊహించలేదు.. నా వల్లే మీకు ఇలా జరిగిందని మహా అంటుంది. ఈసారైనా చెప్తే వినండి.. మీరు ఎక్కడికి వెళ్లినా నేను వెంటొస్తాను.. అప్పుడు ఎన్ని గొడవలు జరిగినా మీ మీద ఈగ కూడా వాలనివ్వలేదు.. ఇప్పుడు చూడండి ఏమైందో అని చక్రి అంటాడు. దీంతో మళ్లీ సారీ చెప్పి మహా లోపలికి వెళ్లిపోతుంది. అయినా చెప్పిందే చెప్పి ఎందుకురా ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తున్నావ్.. చూడు ఫీలై ఉంటుందని కేశవ తిడతాడు.
వాడ్ని అలా వదిలేయకూడదు
ఇక నారాయణ లేచి ఆరుబయట మంచం మీద కూర్చుంటాడు. ఇంతలో నలుగురు కొడుకులు వచ్చి నిల్చుంటారు. కేశవ కోపంగా ఉండేసరికి మాధవ ఏంట్రా అలా ఉన్నావని అడుగుతాడు. వాళ్ల అన్నయ్య ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదు అన్నయ్య.. అయినా ఇలానే వదిలేస్తే రేపు.. మనం ఎవరూ లేనప్పుడు ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లిపోతే.. అందుకే వాడికి సరైన బుద్ధి చెప్పాలంటాడు. చక్రి కూడా అవును అంటాడు. కానీ మాధవ మాత్రం రేయ్.. గొడవలొద్దురా.. మహా ఇంటికి వచ్చినప్పటి నుంచి మనం ఎలాంటి గొడవల్లోకి తలదూర్చలేదు.. దూర్చొద్దు కూడా.. అందరూ ప్రశాంతంగా ఉండండి అని మాధవ అంటాడు.
కోట్లు ఉన్నోళ్లు కదా ఆ మాత్రం ఉంటదిలే
అవునురా పెద్దోడు చెప్పింది కరెక్టే.. అయినా వాళ్ల అన్నయ్య ఏం కావాలని ఇలా చేయలేదు.. నేను అడ్డుపడేసరికి ఆ కంగారులో పొడిచేశాడు.. కోడలు పిల్ల మీదకెళ్లేసరికి పిరికోడు పారిపోయాడని నారాయణ అంటాడు. అయినా సొంత మేనమామ కొడుకు అయినా కూడా మాధవకి తన కూతుర్ని ఇవ్వడానికి నా చెల్లి తాయారు ఒప్పుకోలేదు.. సిమెంట్ పని చేసుకునేవాడికి ఇవ్వనని చెప్పింది. మరి కోట్ల ఆస్తిపరులు.. విదేశాలకి తన కూతుర్ని పంపిద్దామనుకున్న ఒక్కగానొక్క కూతురు.. ఇలా మన అడ్డగాడిదతో వచ్చేస్తే వాళ్ల నాన్నకి కోపం రాదా.. ఎంత కాదనుకున్నా వాళ్లు తన అన్నయ్య, నాన్నలు కదా.. మీరు ఏం మాట్లాడకండి.. ఆ అమ్మాయి బాధపడుతుందని నారాయణ అంటాడు. సర్లే కానీ నాకు ఒక క్వార్టర్ తెచ్చి ఇవ్వండి తాగేసి పడుకుంటా అంటాడు. అలాంటివేం కుదరవని కొడుకులు అనడంతో మీ కంటే నా కోడలే నయంరా.. దారిలో క్వార్టర్ కొనిచ్చిందని నారాయణ అంటాడు. ఇది విని అందరూ అవాక్కవుతారు.
మహాకి ఫోన్ చేసిన హారిక
కాసేపటికి మహాకి ఫోన్ చేస్తుంది వదిన హారిక. లిఫ్ట్ చేసిన వెంటనే ఏంటి అని కోపంగా అంటుంది. ఏంటి మహా అంత కోపంగా ఉన్నావని అడిగితే నువ్వు ఫోన్ ఎందుకు చేశావో నాకు తెలుసు.. ఏం జరిగిందని తెలుసుకోవడానికే కదా అని మహా అంటుంది. అవును మహా.. అయినా నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు కాలేజ్‌కి వచ్చావని అంటుంది. చెప్తే ఏం చేసేదానివి.. నాతో పాటు వచ్చేదానివా.. నేను వెళ్తేనే మీ ఆయనకి తెలిసింది.. నువ్వు వస్తే తెలియదా.. అప్పుడు నిన్ను బతకనిస్తాడా.. అయినా వాడు ఈ మధ్య ఒక రౌడీలా మారిపోయాడులే.. అని మహా అంటుంది. ఏంటి మహా.. కాలేజ్‌లో ఏదో గొడవ జరిగింది.. నీతో వచ్చిన వ్యక్తి రూడ్‌గా బిహేవ్ చేశాడని ఆయన చెప్పారు అంటుంది.
నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష
ఓహో అలా చెప్పాడా నీ మొగుడు.. ఇంటికి వస్తే నా సర్టిఫికేట్లు కాల్చేశారు.. ఇప్పుడు మళ్లీ అప్లై చేసుకోవడానికి వస్తే పెద్ద గొడవ చేసి నన్ను తీసుకెళ్లడానికి ట్రై చేశాడు. సమయానికి చక్రి నాన్న ఉన్నారు కాబట్టి నేను బయటపడ్డాను.. ఆ గొడవలో పెద్దాయన అని కూడా చూడకుండా నీ మొగుడు.. కత్తితో పొడిచేశాడని మహా అంటుంది. ఈ మాట వినగానే హారిక అవాక్కవుతుంది. పొడిచారా అని అంటుంటే అవును.. అదృష్టం బావుండి ప్రాణాపాయం జరగలేదు.. అయినా అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టి నీ మొగుడ్ని జైలులో వేయించే ఛాన్స్ ఉన్నా కూడా ఆయన అందుకు ఒప్పుకోలేదు. నీ మొగుడి జీవితం ఆయన పెట్టిన భిక్ష. ఇకనైనా బుద్ధిగా తన పని తనని చూసుకోమను.. మళ్లీ నా జోలికి వస్తే ఊరుకోనని చెప్పి మహా ఫోన్ కట్ చేస్తుంది. ఇదేంటి తన కోసం ప్రాణాలిచ్చే మనుషులు ఉన్నారని మహా ఇక ఆ ఇంట్లోనే ఉండిపోతుందా అని హారిక అనుకుంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.