హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్

 హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్

హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Gas Cylinders

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్

పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో.. ప్రపంచ వ్యాప్తంగా గ్యాస్, చమురు రవాణాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. మరీ ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా.. హోటల్స్ భారీగా మూతపడుతున్నాయి. ఇటీవల ఈ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక గ్యాస్ కొరత నేపథ్యంలో.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

గ్యాస్‌ సిలిండర్లను సేకరించి.. బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంత మంది సభ్యులు ఒక ముఠాగా ఏర్పడి కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను తీసుకువచ్చి అక్రమంగా అధిక ధరలకు మార్కెట్‌లో అమ్ముతున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్‌ సిలిండర్లను విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ఓ గ్యాస్ డీలర్‌తోపాటు మరో 10 మందిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ గ్యాస్ సిలిండర్ల ముఠాకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రఘునాథ్‌ మీడియాకు వివరించారు.

నగరంలోని పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను నిందితులు నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్మశాన వాటిక నుంచి మొత్తం 414 గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ గ్యాస్ సిలిండర్ బ్లాక్‌ మార్కెట్‌ దందా కొనసాగుతోందని విచారణలో వెల్లడైంది. నగరంలో కమర్షియల్ గ్యాస్‌ కొరత ఉన్నట్లు నిందితులు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.2 వేలు మార్కెట్‌లో ఉండగా.. నిందితులు ఒక్కో సిలిండర్‌ను గ్యాస్ కొరత పేరు చెప్పి.. బ్లాక్‌లో రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా గురించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రంగంలోకి దిగి.. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి 2 డీసీఎంలు సహా 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లో ఓ గోదాం ఉందని.. అక్కడి నుంచి ఈ బ్లాక్ సిలిండర్ల దందాను ఈ ముఠా సభ్యులు నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు.

అఫ్జల్‌గంజ్‌లో ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుని.. పంజాగుట్ట శ్మశానంలో సిలిండర్లను డంప్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్‌ అమీర్‌ను బంజారాహిల్స్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు డీసీపీ రఘునాథ్ తెలిపారు. మహ్మద్ అమీర్.. అఫ్జల్‌గంజ్‍లో మెట్రోగ్యాస్ ఏజెన్సీ పేరుతో హెచ్‍పీ గ్యాస్ ఏజెన్సీని కలిగి ఉన్నాడని.. అక్కడి నుంచే ఈ బ్లాక్ సిలిండర్ల దందా కొనసాగుతోందని వెల్లడించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *