రాశిఫలాలు 26 మే 2026: ఈరోజు రుచక యోగం ప్రభావంతో వృషభం, మకరం సహా ఈ 4 రాశులకు శుభ సంకేతాలు

 రాశిఫలాలు 26 మే 2026: ఈరోజు రుచక యోగం ప్రభావంతో వృషభం, మకరం సహా ఈ 4 రాశులకు శుభ సంకేతాలు
రాశిఫలాలు 26 మే 2026: ఈరోజు రుచక యోగం ప్రభావంతో వృషభం, మకరం సహా ఈ 4 రాశులకు శుభ సంకేతాలు

horoscope today 26 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు రుచక యోగం ప్రభావంతో వృషభం, మకరం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May26
horoscope today 26 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి, హస్తా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. మరోవైపు మేష రాశిలో కుజుడు రుచక యోగం సంచారం చేయనున్నాడు. అదే సమయంలో చంద్రుడు, గురుడు కలిసి గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మిథునం, వృశ్చికం సహా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. చంద్రుడి సంచారం కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజుడి ప్రభావంతో ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు స్నేహితులు, సహోద్యోగుల నుంచి మద్దతు లభించొచ్చు. మీ కుటుంబ జీవితంంలో సంయమనం పాటించాలి. మీ పిల్లలకు సంబంధించి ఏదైనా ఆందోళన కలిగించే విషయం ఉండొచ్చు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి మరింత పెరగొచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సూర్య, బుధుని అనుగ్రహంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. బ్యాంకింగ్ రంగంలో ఉండే వ్యక్తులు మంచి విజయాన్ని ఆశించొచ్చు.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభించొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడు సుఖ స్థానంలో సంచారం చేయడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక ప్రణాళికలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలన్నింట్లో మంచి ఫలితాలు రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరగొచ్చు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలి. ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు పాత మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం లభించొచ్చు.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. సూర్యుడు కర్మ స్థానంలో సంచారం చేయడం కారణంగా అద్భుత ఫలితాలు రావొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇదే రాశిలో చంద్రుడు సంచారం చేయడం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడి ప్రభావంతో శుభ ఫలితాలు రావొచ్చు. మీకు స్నేహితులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ కారణంగా మీరు కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం లభించొచ్చు. మీకు ఆధ్యాత్మిక, మతపరమైన భావాలు బలపడతాయి. మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు బంధువుల నుంచి ఆశించిన మద్దతు లభించొచ్చు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు పనులన్నీ సాఫీగా సాగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతర్జాతీయ సంబంధాలతో పనులు చేసే వారికి గొప్ప అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. మీ బంధువుల నుంచి పూర్తి సహకారం లభించొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసిన పనులకు సానుకూల ఫలితాలు రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగించబడొచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం, మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. మీరు దానధర్మాలు, సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రణాళికలన్నీ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ పని సామర్థ్యం, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాల ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రానున్నాయి. అంతర్జాతీయ వనరుల నుంచి మీరు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్ ఊహాగానాలకు, జూద కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు ఇరుగుపొరుగు వారి నుంచి మంచి సహకారం లభిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి విజయం లభించొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీకు స్నేహితుడి లేదా దగ్గరి బంధువు సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైన కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి పెరగొచ్చు. మీ పిల్లల ద్వారా మీకు ఆనందంగా ఉంటుంది. వారి వైపు నుంచి శుభవార్తలు వినొచ్చు.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *