రాశిఫలాలు 25 మే 2026: ఈరోజు వజ్ర యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు
రాశిఫలాలు 25 మే 2026: ఈరోజు వజ్ర యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలు
horoscope today 25 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం ప్రభావంతో మేషం, కర్కాటకం సహా ఈ 5 రాశుల వ్యక్తులు విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.
Daily Horoscope in Tel May25
horoscope today 25 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తర ఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు వజ్ర యోగం, సిద్ధి యోగాలతో పాటు అనేక శుభ కలయికలు జరగనున్నాయి. సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. మేషం సహా కొన్ని రాశుల వారికి శివయ్య అనుగ్రహం లభించనుంది. అంతేకాదు చంద్రుడి స్థానం బలపడటంతో ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు రావొచ్చు. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. గ్రహాలు, నక్షత్రాల అనుగ్రహంతో మీరు చేసే పనులన్నింట్లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందొచ్చు. మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ ప్రభుత్వ లేదా కోర్టు సంబంధిత పనులు విజయవంతంగా పూర్తవ్వొచ్చు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవ్వొచ్చు. ఈరోజు పుణ్యక్షేత్రానికి వెళ్లడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. గురు, శుక్ర గ్రహాల ప్రభావంతో మీకు పూర్వీకుల ఆస్తి నుంచి గణనీయమైన ప్రయోజనాలు లభించొచ్చు. మీ భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన, తెలివైన పెట్టుబడిని ప్లాన్ చేసుకోవచ్చు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. మీ తెలివితేటలతో అత్యంత కష్టమైన ప్రాజెక్టులను సులభంగా పూర్తి చేయొచ్చు.
మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో వ్యాపారులు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ భవిష్యత్తు కోసం ఒక ముఖ్యమైన, తెలివైన పెట్టుబడిని ప్లాన్ చేసుకోవచ్చు. కెరీర్ పరంగా మీ ఆలోచనలను ప్రశంసిస్తారు. రాహువు ప్రభావంతో సానుకూల ఫలితాలు పొందొచ్చు. మీ కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన లాభాలు రావొచ్చు. మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. ఈ రాశి నుంచి దశమ స్థానంలో ఉన్న కుజుడి ప్రభావంతో మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవ్వొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. ఈరోజు మీరు చేసే ఏ పని అయినా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత ఆందోళన ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీరు పెట్టుబడి పెట్టే డబ్బు నుంచి మంచి రాబడి రావొచ్చు. ప్రభుత్వ పథకాలం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీ ఇంట్లో వాతవరణం సానుకూలంగా ఉంటుంది.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాల వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఎలాంటి పెద్ద రిస్క్‌లు తీసుకోకుండా ఉండాలి. మీ రహస్య ఖర్చులను నియంత్రించుకోవాలి. దీర్ఘకాలిక పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుంచి శని ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. మీకు కొంత పనిభారం ఎక్కువగా ఉండొచ్చు. మీరు చేసే పనులన్నిట్లో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి చంద్రుడు పదకొండో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. మీకు కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి రావొచ్చు. తెలివిగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించాలి. కుజుడు బలంగా ఉండటంతో మీరు అత్యంత కష్టమైన పనులను కూడా సునాయసంగా నిర్వహించగలరు. కేతువు దశమ స్థానంలో ఉండటంతో, రోజువారీ పనులపై ప్రభావం పడొచ్చు.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుంచి సూర్యుడు, బుధుడు ఆరో స్థానంలో సంచారం చేయడం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. కుజుడు పంచమ స్థానంలో ఉండటం కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభించొచ్చు. దశమ స్థానంలో చంద్రుడు రవాణా చేయడం కారణంగా మీరు అతి పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చు. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు లభించొచ్చు.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు అనేక కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ధార్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు పొందే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరగొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీకు కొన్ని బాధ్యతలు లభించొచ్చు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. మీకు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రావొచ్చు. రాహువు ప్రభావం వల్ల మీకు అకస్మాత్తుగా ఖరీదైన వస్తువులు కొనాలనే కోరిక కలగొచ్చు. ఈ రాశి నుంచి చంద్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగవ్వొచ్చు. భవిష్యత్తులో మీకు గణనీయమైన లాభాలు రావొచ్చు. శని దేవుని అనుగ్రహంతో ఉత్సాహంగా గడుపుతారు.
గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.