రాశిఫలాలు 23 మే 2026: ఈరోజు ఉభయచారి యోగం వల్ల మిథునం, కుంభం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి

 రాశిఫలాలు 23 మే 2026: ఈరోజు ఉభయచారి యోగం వల్ల మిథునం, కుంభం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి

రాశిఫలాలు 23 మే 2026: ఈరోజు ఉభయచారి యోగం వల్ల మిథునం, కుంభం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా పురోగతి

horoscope today 23 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఉభయచారి యోగం ప్రభావంతో మిథునం, కుంభం సహా ఈ 5 రాశులకు కెరీర్ పరంగా మంచి అవకాశం రావొచ్చు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Tel May23
horoscope today 23 May 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు చంద్రుడు కుజుడితో కలిసి నవ పంచమ యోగాన్ని ఏర్పరచనున్నాడు. మిథునంలో గురు శుక్రుల కలయికతో గజలక్ష్మీ యోగం ఏర్పడనుంది. అంతేకాదు వృషభ రాశిలో సూర్యుడి నుంచి రెండు, పన్నెండో స్థానంలో ఉండటం కారణంగా ఉభయచారి యోగం కూడా ఏర్పడనుంది. మరోవైపు మీన రాశిలో శని, గురు మధ్య కేంద్ర యోగం ఏర్పడనుంది. సింహ రాశిలో చంద్రుడు, కేతువు కలయికతో గ్రహణ యోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగాల కారణంగా మిథునం, కుంభం సహా ఈ రాశుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభ యోగాల కారణంగా కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదాలు రావొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుంచి చంద్రుడు పంచమ స్థానంలో ఉండటం కారణంగా మీకు మానసికంగా కొంత గందరగోళం ఏర్పడుతుంది. ఈరోజు మీరు సాహాసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ తల్లి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉండొచ్చు. వ్యాపారులకు ఈరోజు ఊహించినంతగా లాభాలు రాకపోవచ్చు. అయితే మీ ఖర్చులు పెరగొచ్చు. మీకు పొరుగువారి నుంచి లేదా స్నేహితుని మద్దతు లభించొచ్చు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో నాణ్యమైన గడిపే అవకాశం లభిస్తుంది.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
మిథున రాశి నుంచి చంద్రుడు మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మానసికంగా కొంత గందరగోళంగా ఉండొచ్చు. అయితే ఈ రాశిలో గురు, శుక్ర గ్రహాల ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆహ్లాదకరంగా గడిపే అవకాశం లభిస్తుంది. మీ పిల్లల విద్య, ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకవోాలి. ఊహించని పరిస్థితుల కారణంగా మీకు అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. మీరు బంధువులతో సంయమనం పాటించాలి. ఈ రాశి నుంచి రెండో స్థానంలో కేతువు, చంద్రుడి సంచారం కారణంగా మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. రక్తపోటు ఉండే వ్యక్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతరులు మీ పనుల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
సింహ రాశి వారికి ఈరోజు కొంత మానసిక గందరగోళం పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. మీ పనులకు ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పొచ్చు. ఇతరుల ప్రభావంతో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
కన్య రాశి వారికి ఈరోజు ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ పనులన్నీ సజావుగా సాగే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశాలున్నాయి. మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేయొచ్చు. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ రాశి నుంచి చంద్రుడు పన్నెండో స్థానంలో సంచారం చేయడం కారణంగా ఖర్చులు పెరగొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
తులా రాశి నుంచి చంద్రుడు పదకొండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పిల్లలతో వినోదాత్మకంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీకు స్నేహితుల నుంచి అనేక రంగాల్లో మద్దతు లభిస్తుంది. వ్యాపారవేత్తలకు మెరుగైన ప్రయోజనాలు కలగొచ్చు. మీకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తే, అందులో మంచి విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
వృశ్చిక రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. అయితే మీరు చేసే పనుల్లో కొంత ఒత్తిడిని అనుభవించొచ్చు. ఇది మీకు మానసిక క్షోభను కలిగించొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో అకస్మాత్తుగా ఏదైనా పని అప్పగించబడొచ్చు. సహోద్యోగులు, ఉన్నతాధికారులతో వాదన చేయకుండా ఉండాలి. కుటుంబ జీవితంలో మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణాల వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ధనస్సు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయొచ్చు. మీ ప్రేమ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
మకర రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ మనసు పరధ్యానంలో ఉండొచ్చు. మీరు చేసే పనులపై ఆసక్తి తగ్గిపోవచ్చు. ఈరోజు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. లేదంటే మీరు నష్టాలను చవిచూడాల్సి రావొచ్చు. మీ తండ్రి మద్దతు, మార్గదర్శకత్వం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. వాహనాలు, ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరగొచ్చు.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
కుంభ రాశి నుంచి ఈరోజు చంద్రుడు పంచమ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరగొచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీరు పనికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయొచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో పై అధికారుల నుంచి మద్దతు, ప్రోత్సాహం లభించొచ్చు. కొందరు పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు కూడా చేయొచ్చు.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
మీన రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఖర్చులు పెరగొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఏదైనా ఆస్తికి సంబంధించిన ఒప్పందం చేసుకోవాలని చూస్తుంటే, అన్ని అంశాలను స్వయంగా చెక్ చేయాలి. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *