ఫేక్ వర్సెస్ రియల్.. ఎగిరెగిరిపడ్డ షాలిని.. మాటలే కాదు చేతలు
ఫేక్ వర్సెస్ రియల్.. ఎగిరెగిరిపడ్డ షాలిని.. మాటలే కాదు చేతలు
Bigg Boss Agnipariksha Season 2 Episode 13 బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని పదమూడో ఎపిసోడ్లో ఫేక్ వర్సెస్ రియల్ గేమ్ నడిచింది. ఏది ఫేక్ ఏది రియల్.. ఎవరు ఫేక్? ఎవరు రియల్ అని కనిపెట్టే ఈ టాస్కులో మూడు టీంలను చేశారు. ఈ మూడు టీంలు పోటీ పడగా.. చివరకు రాజ కుమారి టీం విన్ అయింది. ఆమె టీంలో భాగి ఉండటం, ఆమెకి ఉన్న బ్లైండ్ కార్డ్ వాడటంతో టీం విన్ అయింది. అలా చివరకు నేటి ఎపిసోడ్ ముగిసే సరికి భాగి, రాజ కుమారికి ఓట్ అప్పీల్ రాగా.. అపూర్వకు ఎల్లో కార్డ్ వచ్చింది.

రామకృష్ణ, గాయత్రి, శ్రష్టి, రోహిత్‌లకు ఎల్లో కార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నలుగురిలో ఎవరు ఫేక్? ఎవరు రియల్? అనే గేమ్ పెట్టారు. దీంతో ఒక్కొక్కరు తమలో తామే ఎవరు ఫేక్? ఎవరు రియల్ అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో రామకృష్ణ తన వర్షెన్‌ను వినిపిస్తుండగా షాలిని ఎగిరెగిరి పడింది. మధ్యలోకి వచ్చిన షాలిని గట్టిగట్టిగా అరుస్తూ రామకృష్ణకు అడ్డు పడింది. దీంతో జ్యూరీ మధ్యలో కలగజేసుకుంది. నువ్వు అలా చేయడం తప్పు.. నీ పాయింట్ పెట్టు.. అలా మీదమీదకు వెళ్లకు.. అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో తాను మాట్లాడింది తప్పు కాదు కానీ.. మాట్లాడిన విధానం తప్పు అని అందరికీ సారీ చెబుతుంది షాలినీ.
ఆ తర్వాత భాగీ సాధించిన బ్లైండ్ కార్డులో స్టీల్ ది హాఫ్ అని పవర్ ఉంది. అంటే ఎవరి టీంలోంచి అయినా, ఎప్పుడు అయినా సగం స్కోర్‌ని లాక్కునే ఛాన్స్ భాగీకి ఉంటుంది. ఆ కార్డుని తీసుకు వెళ్లి భాగీ చేతిలో పెడుతుంది శ్రీముఖి. ఆ తర్వాత నాలుగు నిమ్మకాయల్ని విసిరేస్తుంది శ్రీముఖి. నిమ్మకాయని పట్టుకునే టైంలో అపూర్వ, అమన్‌కి గొడవ అవుతుంది. నిమ్మకాయల్ని పట్టుకున్న ఆ నలుగురు అమన్, భాగీ, రామకృష్ణ, రాజ కుమారి టీం లీడర్లు అని చెప్పారు. అయితే వారికి ఓ టాస్క్ పెట్టారు.
కొన్ని సంచుల్లో బరువు ఉంటుంది.. ఇంకొన్ని సంచుల్లో బరువు ఉండదు.. ఐదు సంచుల్ని పట్టుకుని ఆ ఐదుగురు నిల్చోవాలి. అందులో నిజంగా బరువుని మోస్తున్నది ఎవరు అన్నది.. మిగిలిన వారిలో ఎవరైనా గెస్ చేస్తే.. వారి స్థానం మారిపోతుంది. నిజం చెప్పిన ఆ కంటెస్టెంట్.. లీడర్ స్థానంలోకి వెళ్లిపోతాడు. అలా మొదటగా మిథిలేష్ వచ్చి రాజ కుమారి పేరు చెప్తాడు. కానీ రాజ కుమారి మాత్రం బరువున్న సంచిని మోస్తుంది. అలా మిథిలేష్ తప్పు సమాధానం చెప్పడంతో రాజ కుమారి లీడర్‌గా మారుతుంది.
ఆ తర్వాత శ్రష్టి వచ్చి రామకృష్ణ పేరు చెబుతుంది. అది కరెక్ట్ సమాధానం కావడంతో రామకృష్ణకు బదులుగా శ్రష్టి లీడర్ అవుతుంది. ఇక మిగిలిన దీపక్, రామకృష్ణ, భాగీలకు ఓ జ్యూస్ ఇస్తారు. ఒక్క దాంట్లో మాత్రమే వెనిగర్ వేసి ఉంటుంది. ఆ వెనిగర్ జ్యూస్ తాగింది ఎవరో గుర్తు పట్టాలి. ప్రశాంత్ వచ్చి అమన్ తాగాడని చెప్తాడు. కానీ తాగింది దీపక్. దీంతో అమన్ ఇంకో లీడర్ అవుతాడు. ఇక ముగ్గురు లీడర్లు వచ్చేస్తారు. ఆ ముగ్గురు లీడర్లకు ఓ టాస్క్ పెడతారు. పైకి ఒకే రకంగా కనిపించే మూడు స్ట్రాలను తీసుకోవాలి, అందులోపెద్ద, చిన్న, మీడియం సైజుల్లో స్ట్రా ఉంటుంది. పెద్ద స్ట్రా వస్తే ఎక్కువ మంది కంటెస్టెంట్లు, చిన్న స్ట్రా వస్తే తక్కువ మంది కంటెస్టెంట్లను ఎంచుకోవాలి.
అలా చిన్న స్ట్రా రావడంతో శ్రష్టి ముందుగా.. తన టీంలోకి దీపక్, రోహిత్, చరణ్‌లను తీసుకుంటుంది. మీడియం స్ట్రా వచ్చిన రాజ కుమారి ముందుగా కార్డ్ ఉన్న కారణంతో భాగీని తీసుకుంటుంది. ఆ తర్వాత మిథిలేష్, ఝాన్సీ, ప్రియలను తీసుకుంటుంది. చివరకు మిగిలిన వారంతా అమన్ టీంలోకి వస్తారు. భాగీ తన కార్డున వాడి అమన్ టీంలోంచి స్కోర్ కాజేస్తా అని చెబుతుంది. ఇక పెట్టిన ఆరేడు టాస్కుల్లో ఫేక్ ఎవరు, రియల్ ఎవరు? అని కనిపెట్టేందుకు అందరూ చాలానే కష్టపడ్డారు.
ఫస్ట్ టాస్క్‌లో భాగంగా ఓ ఇద్దరి తలకాయలు మాత్రమే చూపిస్తారు. అందులో పొట్టి ఎవరు? పొడుగు ఎవరు అని కని పెట్టాలి. ఆ రౌండ్లో షాలినీ, భాగి, శ్రష్టి పాల్గొనగా.. శ్రష్టి కరెక్ట్‌గా చెప్పి.. గాయత్రిని ఆట నుంచి తప్పిస్తుంది. రెండో టాస్క్‌లో రాజకుమారి, దీపక్, మిథిలేష్ పోటీ పడతారు. చూపించిన వాటిల్లో రియల్ క్రోసాంటో ఏది? ఫేక్‌ది ఏది అన్నది చెప్పాలి. అపూర్వ, మిథిలేష్ విన్ అయి.. చరణ్‌ను లేపేస్తారు. మూడో టాస్క్‌లో చరణ్, ఝాన్సీ, ప్రశాంత్ పార్టిసిపేట్ చేస్తారు. రియల్ మెజీషియన్ ఎవరు? ఫేక్ ఎవరు? అని చెప్పడంతో ముగ్గురూ కరెక్ట్‌గా సమాధానం ఇస్తారు.
నాలుగో టాస్క్.. డోనట్‌ను చూపిస్తారు. రియల్ డోనట్‌ను శ్రష్టి, రామకృష్ణ, ప్రియాంక అందరూ రైట్‌గా గుర్తిస్తారు. ఐదో టాస్క్‌లో రియల్‌గా భరతనాట్యం చేసే అమ్మాయి ఎవరు అన్నది.. దీపక్, హేమంత్, రాజకుమారి.. అందరూ కరెక్ట్‌గా గెస్ చేస్తారు. ఆరో టాస్క్‌లో అమన్, మిథిలేష్, రోహిత్ రియల్ సన్ ఫ్లవర్‌ను గుర్తించి విన్ అవుతారు. లాస్ట్ రౌండ్లో రాజుకుమారి, అమన్, శ్రష్టి.. అక్కడ చూపించిన ఇద్దరు మహిళల్లో బిడ్డ తల్లిని గుర్తిస్తారు. అలా చివరకు స్కోర్ బోర్డ్ చూసిన తర్వాత భాగీ తన కార్డుని వాడటంతో 900 మార్కులతో రాజకుమారి టీం విన్ అవుతుంది.
భాగీకి ఓట్ అప్పీల్ ఇవ్వాలని రాజ కుమారి కోరుతుంది.మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా రాజ కుమారిని అభిజిత్ సెలెక్ట్ చేస్తాడు. ముగ్గురు లీడర్లను పిలిచి.. ముగ్గురు వీక్ కంటెస్టెంట్ల పేర్లను చెప్పమని అడుగుతారు. అలా అపూర్వ,హేమంత్, షాలినీ పేర్లను చెప్తారు. మాటలే కాదు చేతలు కూడా ఉండాలని అపూర్వకు బిందు మాధవి ఎల్లో కార్డ్ ఇస్తుంది.